Hyundai Exter : ఈ బెస్ట్​ సెల్లింగ్​ హ్యుందాయ్​ కార్లలో కొత్త వేరియంట్లు​- ఫీచర్స్​ చెక్​ చేశారా?-hyundai exter and aura get new variants and feature upgrades for 2025 ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Hyundai Exter : ఈ బెస్ట్​ సెల్లింగ్​ హ్యుందాయ్​ కార్లలో కొత్త వేరియంట్లు​- ఫీచర్స్​ చెక్​ చేశారా?

Hyundai Exter : ఈ బెస్ట్​ సెల్లింగ్​ హ్యుందాయ్​ కార్లలో కొత్త వేరియంట్లు​- ఫీచర్స్​ చెక్​ చేశారా?

Sharath Chitturi HT Telugu
Published Feb 08, 2025 06:20 AM IST

హ్యుందాయ్​ ఎక్స్​టర్​, హ్యుందాయ్​ ఆరాల్లో కొత్త వేరియంట్లను సంస్థ తీసుకొచ్చింది. ఇవి ఫీచర్​ లోడెడ్​ వేరియంట్స్​గా ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ హ్యుందాయ్​ కార్లలో కొత్త వేరియంట్లు..
ఈ హ్యుందాయ్​ కార్లలో కొత్త వేరియంట్లు..

హ్యుందాయ్​ మోటార్స్​ నుంచి కీలక్​ అప్డేట్​ వచ్చింది! హ్యుందాయ్​ ఎక్స్​టర్​ ఎస్​యూవీ, ఆరా కార్లను అప్​డేట్​ చేసినట్టు సంస్థ వెల్లడించింది. అంతేకాదు, వీటిల్లో కొత్త వేరియంట్లను కూడా తీసుకొచ్చినట్టు తెలిపింది. హ్యుందాయ్​ ఎక్స్‌టర్​ ఎస్​యూవీలో కొత్త మిడ్-స్పెక్ వేరియంట్లు - ఎస్​ఎక్స్​ టెక్, ఎస్​+, మరిన్ని సీఎన్జీ ఆప్షన్స్​ యాడ్​ అయ్యాయి. మరోవైపు, హ్యుందాయ్​ ఆరా పెట్రోల్, CNG ఇంజిన్​ ఆప్షన్స్​లో ఒక కార్పొరేట్ వేరియంట్‌ యాడ్​ అయ్యింది. ఆ వివరాలు.

2025 హ్యుందాయ్​ ఎక్స్‌టర్ - కొత్త వేరియంట్లు..

ఎక్స్‌టర్ కొత్త ఎస్​ఎక్స్​ టెక్ వేరియంట్‌ను పొందుతుంది. ఇది పెట్రోల్, హై-CNG డ్యూయో ఇంజిన్​లతో అందుబాటులో ఉంటుంది. కొత్త ట్రిమ్ స్మార్ట్ కీతో పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, డ్యూయెల్ కెమెరాతో డాష్‌క్యామ్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో 8-ఇంచ్​ టచ్‌స్క్రీన్ ఇన్​ఫోటైన్‌మెంట్ సిస్టెమ్, డిజిటల్ డిస్​ప్లేతో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, బై-ఫంక్షనల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ల వంటి ఫీచర్లతో వస్తోంది.

కొత్త హ్యుందాయ్​ ఎక్స్‌టర్ ఎస్​+ వేరియంట్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 15-ఇంచ్​ డ్యూయెల్-టోన్ స్టీల్ వీల్స్, స్టాటిక్ గైడ్‌లైన్‌లతో రేర్ కెమెరా, 8 ఇంచ్​​ టచ్‌స్క్రీన్ ఇన్​ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రేర్ ఏసీ వెంట్స్, ఎలక్ట్రికల్‌గా అడ్జస్ట్ చేయగల ఓఆర్​వీఎంలు ఉన్నాయి.

హ్యుందాయ్​ ఎక్స్‌టర్ ఎస్​ వేరియంట్​ని సైతం సంస్థ అప్డేట్​ చేసింది. స్టాటిక్ గైడ్‌లైన్‌లతో రేర్ పార్కింగ్ కెమెరా, ఈఎస్​సీ, వీఎస్​ఎం, హిల్ స్టార్ట్ అసిస్ట్, 15 ఇంచ్​ డ్యూయెల్-టోన్ స్టీల్ వీల్స్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లేతో 8-ఇంచ్​ ఇన్​ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఎక్స్‌టర్ ఎస్​ ఎగ్జిక్యూటివ్, ఎస్​+ ఎగ్జిక్యూటివ్ వేరియంట్‌లను అదనపు ఫీచర్లతో సీఎన్జీ ఆప్షన్​ని కూడా సంస్థ ప్రవేశపెట్టింది. అప్‌డేట్ చేసిన ఎక్స్‌టర్ రేంజ్ ధర రూ. 7.73 లక్షల నుంచి ప్రారంభమై రూ. 9.53 లక్షల వరకు ఉంటుంది. హ్యుందాయ్​ ఎక్స్‌టర్ రూ. 6 లక్షల ఎక్స్​షోరూం ధరతో ఈఎక్స్​ వేరియంట్‌తో ప్రారంభమవుతుంది.

2025 హ్యుందాయ్​ ఆరా కార్పొరేట్ వేరియంట్..

అప్డేటెడ్​ హ్యుందాయ్​ ఆరా.. పెట్రోల్, సీఎన్జీ ఇంజిన్ ఆప్షన్​తో కొత్త కార్పొరేట్ వేరియంట్‌ను పొందుతుంది. ఆరా కార్పొరేట్ 15-ఇంచ్​ డ్యూయల్-టోన్ స్టీల్ వీల్స్, ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​, రేర్ వింగ్ స్పాయిలర్, 6.75-ఇంచ్​ టచ్‌స్క్రీన్ డిస్​ప్లే ఆడియో, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, రేర్ ఏసీ వెంట్స్, కప్‌హోల్డర్‌తో రేర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్, ప్రత్యేక కార్పొరేట్ ఎంబ్లెమ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది. ఆరా కార్పొరేట్ ఎడిషన్ ధరలు.. పెట్రోల్‌కు రూ. 7.48 లక్షలు, హై-సీఎన్జీ డ్యూయో వెర్షన్‌కు రూ. 8.47 లక్షల వద్ద ప్రారంభమవుతాయి. ఇవి ఎక్స్​షోరూం ధరలు.

Whats_app_banner

సంబంధిత కథనం