జీఎస్టీ సంస్కరణలతో అనేక వాహనాల ధరలు భారీగా తగ్గాయి. ఆ తర్వాత, వాటి మీద అనేక సంస్థలు పండుగ ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటార్స్ చేరింది. దీపావళి సందర్భంగా తమ పోర్ట్‌ఫోలియోలోని పలు బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌పై ఆఫర్స్‌ని ప్రకటించింది హ్యుందాయ్. ఫలితంగా, జీఎస్టీ తగ్గింపుతో పాటు ఆఫర్స్ కారణంగా వాహనాల ధరలు మరింత దిగొచ్చాయి. ఈ నేపథ్యంలో హ్యుందాయ్ దీపావళి ఫెస్టివల్ డిస్కౌంట్స్ గురించి ఇక్కడ తెలుసుకోండి..
ఇండియాలో మంచి డిమాండ్ ఉన్న హ్యాచ్బ్యాక్స్లో గ్రాండ్ ఐ10 నియోస్ ఒకటి. ఇందులో 8 ఇంచ్ టచ్‌స్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. సీఎన్జీ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.
| ఫీచర్స్ | వివరాలు |
| ఇంజిన్ ఆప్షన్స్ | 1.2 లీటర్ పెట్రోల్/ సీఎన్జీ |
| ట్రాన్స్మిషన్ | 5 స్పీడ్ మేన్యువల్/ఏఎంటీ |
| టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ | 8 ఇంచ్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ |
| సేఫ్టీ | డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్, ఏబీఎస్, రేర్ పార్కింగ్ సెన్సార్ |
హ్యుందాయ్‌కి ఉన్న బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీల్లో ఈ వెన్యూ ఒకటి. ఇందులో సన్‌రూఫ్, డిజిటల్ క్లస్టర్, కనెక్టెడ్ టెక్, 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఫ్యామిలీ ఎస్‌యూవీగా దీనికి మంచి గుర్తింపు సైతం ఉంది.
| కీలక ఫీచర్స్ | వివరాలు |
| ఇంజిన్ ఆప్షన్స్ | 1.2 లీటర్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ |
| ట్రాన్స్మిషన్ | మేన్యువల్/డీసీటీ |
| టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ | 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ |
| సేఫ్టీ | 6ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్సీ, హిల్ అసిస్ట్ |
హ్యుందాయ్ ఆరా అనేది ఒక సెడాన్. ఇందులో స్పేషియస్ క్యాబిన్, వైర్లెస్ ఫోన్ కనెక్టివిటీ సహా అనేక సౌకర్యవంతమైన ఫీచర్స్ ఉన్నాయి. సీఎన్జీ ఆప్షన్ కూడా ఉంది.
| కీలక ఫీచర్స్ | వివరాలు |
| ఇంజిన్ ఆప్షన్స్ | 1.2 లీటర్ పెట్రోల్. సీఎన్జీ |
| ట్రాన్స్మిషన్ | మేన్యువల్/ఏఎంటీ |
| ఇన్ఫోటైన్మెంట్ | 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ |
| సేఫ్టీ | 4 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్, రేర్ కెమెరా |
హ్యుందాయ్ నుంచి వచ్చిన చిన్న ఎస్యూవీ ఈ ఎక్స్టర్. ఇందులో డ్యాష్‌క్యామ్, సన్‌రూఫ్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటివి వస్తున్నాయి.
| కీలక ఫీచర్స్ | వివరాలు |
| ఇంజిన్ ఆప్షన్స్ | 1.2 లీటర్ పెట్రోల్. సీఎన్జీ |
| ట్రాన్స్మిషన్ | మేన్యువల్/ఏఎంటీ |
| ఫీచర్స్ | ఇన్‌బిల్ట్ డ్యాష్‌క్యామ్, సన్‌రూఫ్ (టాప్ వేరియంట్) |
| సేఫ్టీ | 6 ఎయిర్‌బ్యాగ్‌లు |
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో హ్యుందాయ్ ఐ20దే హవా! బోస్ సౌండ్ సిస్టెమ్, యాంబియెంట్ లైటింగ్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, స్పేషియస్ సెకెండ్ రో వంటివి దీని సొంతం.
| కీలక ఫీచర్స్ | వివరాలు |
| ఇంజిన్ ఆప్షన్స్ | 1.2లీటర్ పెట్రోల్, 1.2లీటర టర్బో పెట్రోల్ |
| ట్రాన్స్మిషన్ | మేన్యువల్, సీవీటీ, డీసీటీ |
| ఇన్ఫోటైన్మెంట్ | బాస్ సౌండ్‌తో కూడిన 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ |
| సేఫ్టీ | 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్సీ, టీపీఎంఎస్ |
3-రో ఎస్యూవీ కోరుకునే వారికి అల్కజార్ మంచి ఆప్షన్! ఇందులో పానోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి.
| కీలక ఫీచర్స్ | వివరాలు |
| సీటింగ్ కాన్పిగరేషన్ | 6,7 సీటర్ |
| ఇంజిన్ | 1.5లీటర్ టర్బో పెట్రోల్, 1.5లీటర్ డీజిల్ |
| ట్రాన్స్మిషన్ | మేన్యువల్, ఆటోమెటిక్ |
| ఫీచర్స్ | పానోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా |