Hyundai Creta N Line : రేపే హ్యుందాయ్ క్రేట్ ఎన్ లైన్ లాంచ్.. ఫీచర్స్ ఇవే!
Hyundai Creta N Line India launch : హ్యుందాయ్ క్రేట్ ఎన్ లైన్ సోమవారం లాంచ్కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఎస్యూవీ ఫీచర్స్ వివరాలు మీకోసం..

Hyundai Creta N Line price in India : హ్యుందాయ్ మోటార్ ఇండియా.. తన మూడొవ ఎన్ లైన్ మోడలైన.. క్రెటా ఎన్ లైన్‌ని సోమవారం లాంచ్ చేయనుంది. క్రెటా లైనప్‌లో ఫ్లాగ్షిప్ వేరియంట్‌గా ఉంటుంది ఈ ఎన్ లైన్! ఈ మోడల్ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. రూ. 25వేల టోకెన్ అమౌంట్‌తో ఈ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు. క్రేటా ఎన్ లైన్.. ఇప్పటికే డీలర్షిప్ షోరూమ్స్‌కి కూడా చేరుకుంది.
హ్యుందాయ్ క్రేటా ఎన్ లైన్..
క్రెటా ఎన్ లైన్.. రెండు ట్రిమ్స్‌లో వస్తుంది. అవి.. ఎన్ 8, ఎన్ 10. ఇవి.. స్టాండర్డ్ క్రెటా ఎస్‌యూవీలోని ఎస్ఎక్స్ (టెక్) - ఎస్ఎక్స్ (ఓ) ట్రిమ్స్‌తో సమానం. టర్బో-డీసీటీతో క్రెటా ఎస్ఎక్స్(ఓ) ప్రస్తుత ధర రూ .20 లక్షలు, టర్బో-డీసీటీతో క్రెటా ఎన్ లైన్ ఎన్10 వేరియంట్ ధర రూ. 20.50 లక్షల నుంచి రూ. 20.60 లక్షల మధ్య ఉండవచ్చని తెలుస్తోంది. మాన్యువల్ వేరియంట్ కొంచెం చౌకగా ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
క్రెటా టర్బో పెట్రోల్ యూనిట్ మాదిరిగానే.. ఎన్ లైన్ మోడల్లో 1.5-లీటర్ జీడీఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 160 బీహెచ్పీ పవర్‌ని 253 ఎన్ఎమ్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. స్టాండర్డ్ వేరియంట్ 7 స్పీడ్ డీసీటీతో వస్తుంది. ఎన్ లైన్ 6స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా అందిస్తుంది.
Hyundai Creta N Line launch date in India : కాస్త ఎక్కువ ఖర్చు చేస్తే.. క్రెటా ఎన్ లైన్ కాస్మొటిక్, మెకానికల్స్ని మెరుగుపరుచుకోవచ్చు. ఎక్స్టీరియర్ డిజైన్ డబ్ల్యూఆర్సీ కార్ల స్ఫూర్తితో రూపొందించినట్లు హ్యుందాయ్ తెలిపింది. కియా సెల్టోస్ ఎక్స్-లైన్, స్కోడా కుషాక్ మోంటే కార్లో వంటి మోడళ్లకు పోటీగా.. ప్రత్యేక ఎడిషన్ క్రెటా ఎన్-లైన్ పెయింట్ స్కీమ్స్, ఫ్రంట్- రేర్ బ్యాడ్జింగ్, కొత్త స్పోర్టీ ఫ్రంట్ గ్రిల్, రెడ్ యాక్సెట్తో మరింత అగ్రెసివ్ ఫ్రంట్ బంపర్, రెడ్ యాక్సెంట్‌తో సైడ్ స్కర్ట్‌లను కలిగి ఉంటుంది. ఎన్ లైన్-స్పెసిఫిక్ 18-ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. స్టాండర్డ్ మోడల్లో ఇది ఉండదు.
రేర్‌లో.. స్టాండర్డ్ క్రెటాతో పోలిస్తే కొత్త ట్విన్-టిప్ ఎగ్జాస్ట్ మరింత ఆకర్షణీయమైన సౌండ్‌ని అందిస్తుందని భావిస్తున్నారు. అదనంగా.. హ్యుందాయ్ ఎస్యూవీ హ్యాండ్లింగ్‌ను మెరుగుపరచడానికి సస్పెన్షన్ సెటప్‌ను పెంచే అవకాశం ఉంది.
Hyundai Creta N Line price : ఇతర ఎన్ లైన్ మోడల్స్‌తో జతచేసిన హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్లో ఎన్ లైన్-స్పెసిఫిక్ స్టీరింగ్ వీల్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, సీట్లపై రెడ్ పైపింగ్, గేర్ లివర్, స్టీరింగ్ వీల్ ఉంటాయి. టాప్-స్పెక్ క్రెటా ఎస్ఎక్స్ (ఓ) ఆధారంగా, ఎన్ లైన్లో 360-డిగ్రీ కెమెరా, లెవల్ -2 ఏడీఏఎస్, డ్యూయల్ డిజిటల్ డిస్ప్లే, పవర్డ్ డ్రైవర్ సీట్, రియర్-సీట్ రెక్లైన్, ఎఈడీ లైటింగ్ ప్యాకేజీ వంటి ఫీచర్లు ఉంటాయి.
ఈ హ్యుందాయ్ క్రేటా ఎన్ లైన్ ధర, ఫీచర్స్పై లాంచ్ టైమ్‌లో అధికారిక ప్రకటన వస్తుంది.
సంబంధిత కథనం