Hyundai Creta EV : హ్యుందాయ్ క్రెటా ఈవీ కొంటున్నారా? హైదరాబాద్‌లో ఆన్‌రోడ్ ప్రైజ్ ఎంతంటే..
Hyundai Creta EV on road price Hyderabad : హ్యుందాయ్ క్రెటా ఈవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్‌లో ఈ హ్యుందాయ్ క్రెటా ఈవీ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారత ఆటోమొబైల్ మార్కెట్ ఎలక్ట్రిక్ వాహనాల సెగ్మెంట్లోని లేటెస్ట్ ఎంట్రీల్లో హ్యుందాయ్ క్రేటా ఈవీ ఒకటి. బెస్ట్ సెల్లింగ్ క్రెటా ఎస్‌యూవీకి ఎలక్ట్రిక్ వర్షెన్‌గా మార్కెట్లో అడుగుపెట్టిన ఈ క్రెటా ఈవీపై కస్టమర్స్‌లో విపరీతమైన ఆసక్తి కనిపిస్తోంది. మరి, మీరు కూడా ఈ ఈవీని కొనే ప్లాన్‌లో ఉన్నారా? అయితే ఇది మీకోసమే! హైదరాబాద్‌లో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఆన్‌రోడ్ ప్రైజ్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హైదరాబాద్‌లో హ్యుందాయ్ క్రెటా ఈవీ ఆన్‌రోడ్ ప్రైజ్..
హ్యుందాయ్ క్రెటా ఈవీ ఎగ్జిక్యూటివ్- రూ. 18.92 లక్షలు
స్మార్ట్- రూ. 19.98 లక్షలు
స్మార్ట్ (ఓ)- రూ .20.50 లక్షలు
స్మార్ట్ (ఓ) డీటీ- రూ. 20.66 లక్షలు
ప్రీమియం- రూ. 21.02 లక్షలు
ప్రీమియం డీటీ- రూ. 21.18 లక్షలు
స్మార్ట్ (ఓ) హెచ్‌సీ- రూ. 21.26 లక్షలు
స్మార్ట్ (ఓ) హెచ్‌సీ డీటీ- రూ. 21.42 లక్షలు
ప్రీమియం హెచ్‌సీ- రూ. 21.79 లక్షలు
ప్రీమియం హెచ్‌సీ డీటీ- రూ. 21.94 లక్షలు
స్మార్ట్ (ఓ) ఎల్ఆర్- రూ. 22.59 లక్షలు
స్మార్ట్ (ఓ) ఎల్ఆర్ డీటీ- రూ. 22.75 లక్షలు
స్మార్ట్ (ఓ) ఎల్ఆర్ హెచ్‌సీ- రూ. 23.36 లక్షలు
స్మార్ట్ (ఓ) ఎల్ఆర్ హెచ్‌సీ డీటీ- రూ .23.51 లక్షలు
ఎక్సెలెన్స్ ఎల్ఆర్- రూ. 24.68 లక్షలు
ఎక్సెలెన్స్ ఎల్ఆర్ డీటీ- రూ. 24.84 లక్షలు
ఎక్సెలెన్స్ ఎల్ఆర్ హెచ్‌సీ- రూ. 25.45 లక్షలు
ఎక్సెలెన్స్ ఎల్ఆర్ హెచ్‌సీ డీటీ- రూ. 25.60 లక్షలు
అంటే.. హైదరాబాద్‌లో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ ఆన్‌రోడ్ ప్రైజ్ రూ. 18.92 లక్షల నుంచి రూ. 25.60 లక్షల వరకు ఉంటుంది.
సాధారణంగా వెహికల్‌కి ఎక్స్‌షోరూం ప్రైజ్, ఆన్‌రోడ్ ప్రైజ్‌లు వేరువేరుగా ఉంటాయి. వెహికిల్‌ని లాంచ్ చేసే సమయంలో ఆటోమొబైల్ సంస్థలు ఎక్స్‌షోరూం ధరలను మాత్రమే చెబుతాయి. కాగా ఆన్‌రోడ్ ప్రైజ్ అనేది వివిధ రాష్ట్రాల్లో ట్యాక్స్‌లు వేరువేరుగా ఉండటంతో మారుతుంటూ ఉంటుది. అందుకే కస్టమర్లు వెహికిల్‌ని కొనే ముందు, ఎక్స్‌షోరూం ప్రైజ్ కాకుండా ఆన్‌రోడ్ ప్రైజ్ తెలుసుకుని బడ్జెట్ వేసుకోవాలి.
మీ సమీప డీలర్షిప్ షోరూమ్‌ని సందర్శిస్తే ఈ 5 సీటర్ హ్యుందాయ్ క్రేటా ఈవీ టెస్ట్ డ్రైవ్‌తో పాటు ఆఫర్స్, డిస్కౌంట్స్ వంటి వివరాలపైనా క్లారిటీ వస్తుంది. ఆ మేరకు మీరు మీ బడ్జెట్‌ని ప్లాన్ చేసుకోవచ్చు.
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్- బ్యాటరీ, రేంజ్..
హ్యుందాయ్ క్రెటా ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో వస్తుంది. వి.. 51.4 కిలోవాట్, 42 కిలోవాట్. పెద్ద బ్యాటరీ ప్యాక్ ఉన్న క్రెటా ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 472 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుందని సంస్థ చెబుతోంది. అయితే చిన్న ప్యాక్ రేంజ్ 390 కి.మీ అని స్పష్టం చేసింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో మూడు డ్రైవింగ్ మోడ్లు అందుబాటులో ఉన్నాయి. అవి.. ఈకో, నార్మల్, స్పోర్ట్స్. క్రెటా ఈవీ కేవలం 7.9 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని హ్యుందాయ్ పేర్కొంది.
మరోవైపు క్రెటా ఐసీఈ ఇంజిన్ వర్షెన్ సేల్స్ పరంగా దూసుకెళుతోంది. జనవరిలోనూ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది. పూర్తి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం