Electric cars : రెండు దిగ్గజ సంస్థల నుంచి కొత్త ఈవీలు- రేంజ్లో ఏ ఎలక్ట్రిక్ కారు బెస్ట్?
Hyundai Creta Electric vs Tata Curvv EV : హ్యుందాయ్ క్రేటా ఎలక్ట్రిక్ వర్సెస్ టాటా కర్వ్ ఈవీ.. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్స్లో ఏది బెస్ట్? దేని రేంజ్ ఎక్కువ? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హ్యుందాయ్ క్రేటా ఎలక్ట్రిక్ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఈ నెల 17న ప్రారంభంకానున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఈ ఎలక్ట్రిక్ కారును సంస్థ ప్రపంచానికి పరిచయం చేయనుంది. భారీ అంచనాల మధ్య అడుగుపెడుతున్న హ్యుందాయ్ క్రేటా ఈవీ.. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త టాటా కర్వ్ ఈవీ మధ్య విపరీతమైన పోటీ ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఒకటి ఎస్యూవీ మోడల్, మరొకటి కూపే ఎస్యూవీ అయినప్పటికీ, దిగ్గజ బ్రాండ్స్ నుంచి వస్తుండటంతో వీటిపై ప్రజల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రెండింటినీ పోల్చి, ఏది బెస్ట్? అన్నది ఇక్కడ తెలుసుకుందాము..
హ్యుందాయ్ క్రేటా ఎలక్ట్రిక్ వర్సెస్ టాటా కర్వ్ ఈవీ: డిజైన్..
హ్యుందాయ్ క్రేటా, టాటా కర్వ్ ఈవీలు వాటి ఐసీఈ ఇంజిన్ వర్షెన్లను పోలి ఉంటాయి. డిజైన్ పరంగా పెద్దగా మార్పులు చోటుచేసుకోలేదు. హ్యుందాయ్ క్రేటా ఎస్యూవీ ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్స్‌లో ఒకటి. ఇక టాటా కర్వ్ ఎస్యూవీ కూపే, సెగ్మెంట్లోనే తొలి ఎంట్రీల్లో ఒకటిగా నిలిచింది.
ఇక రెండు ఈవీల్లోనూ ఫ్యూచరిస్టిక్ డిజైన్ని చూడవచ్చు.
హ్యుందాయ్ క్రేటా ఎలక్ట్రిక్ వర్సెస్ టాటా కర్వ్ ఈవీ: స్పెసిఫికేషన్లు
హ్యుందాయ్ క్రేటా ఈవీకి టాటా కర్వ్ ఈవీకి మధ్య రేంజ్ విషయంలో బలమైన పోటీ ఉంటుంది! ఎందుకంటే వీటి బ్యాటరీ ఆప్షన్స్ ఒకే విధంగా ఉన్నాయి. హ్యుందాయ్ క్రేటా ఎలక్ట్రిక్‌లో 42 కిలోవాట్, 51.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది. టాటా కర్వ్ ఈవీలో 45 కిలోవాట్, 55 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ఉంది.
క్రేటా ఎలక్ట్రిక్ పెద్ద బ్యాటరీ ప్యాక్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 473 కిలోమీటర్ల రేంజ్‌ని ఇస్తుందని తెలుస్తోంది. చిన్నది 390 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇక టాటా కర్వ్ ఈవీ రేంజ్ 430 కిలోమీటర్ల నుంచి 502 కిలోమీటర్ల వరకు ఉంటుంది.
హ్యుందాయ్ క్రేటా ఎలక్ట్రిక్ వర్సెస్ టాటా కర్వ్ ఈవీ: ఫీచర్లు..
క్రేటా ఎలక్ట్రిక్.. క్రేటా ఎస్యూవీ కంటే ప్రీమియం ఆఫర్‌గా వస్తోంది. అందువల్ల కొన్ని అదనపు సాంకేతికతను ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ పొందుతుంది. క్రేటా ఎలక్ట్రిక్ డ్యూయెల్ 10.25 ఇంచ్ స్క్రీన్‌తో లెథరెట్ డ్యాష్‌బోర్డ్‌ని పొందుతుంది. ఒకటి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో ఇన్ఫోటైమెంట్ సెటప్‌తో పనిచేస్తుంది. మరొకటి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. హ్యుందాయ్ అయోనిక్ 5 లో ఉన్న దానిని పోలిన 3 స్పోక్ లేఅవుట్, 4 డాట్ స్టీరింగ్ వీల్‌ని రీడిజైన్ చేయడం జరిగింది.. కారును పోర్టెబుల్ పవర్ సోర్స్‌గా మార్చే వెహికల్-టు-లోడ్ (వి2ఎల్) టెక్నాలజీ ద్వారా వినియోగదారులు కారు లోపల, వెలుపల పరికరాలను ఛార్జ్ చేయవచ్చు.
టాటా కర్వ్ ఈవీ ఇంటీరియర్స్ చాలా మోడ్రన్‌గా కనిపిస్తాయి. డ్యూయల్ టోన్ డ్యాష్‌బోర్డ్, వెంటిలేటెడ్ ఫ్రెంట్ సీట్లు ఉన్నాయి. 12.3 ఇంచ్ ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్, 10.25 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేతో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. ఇన్-కార్ ఎక్స్‌పీరియెన్స్‌ని పెంచే మరికొన్ని ఫీచర్లు ( పనోరమిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్) కూడా ఇందులో ఉన్నాయి.
సంబంధిత కథనం