Long range electric cars : అదిరే డిజైన్​, లాంగ్​ రేజ్​ కూడా! ఈ రెండు ఎలక్ట్రిక్​ కార్లలో ఏది బెస్ట్​?-hyundai creta electric vs mahindra be 6 iconic name or futuristic design whats your pick ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Long Range Electric Cars : అదిరే డిజైన్​, లాంగ్​ రేజ్​ కూడా! ఈ రెండు ఎలక్ట్రిక్​ కార్లలో ఏది బెస్ట్​?

Long range electric cars : అదిరే డిజైన్​, లాంగ్​ రేజ్​ కూడా! ఈ రెండు ఎలక్ట్రిక్​ కార్లలో ఏది బెస్ట్​?

Sharath Chitturi HT Telugu
Jan 20, 2025 01:37 PM IST

Hyundai Creta Electric vs Mahindra BE 6 : హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వర్సెస్​ మహీంద్రా బీఈ 6.. ఈ రెండు ఈవీల్లో ఏది బెస్ట్​? దేని రేంజ్​ ఎక్కువ? దేని ధర తక్కువ? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఈ రెండు ఎలక్ట్రిక్​ కార్లలో ఏది బెస్ట్​?
ఈ రెండు ఎలక్ట్రిక్​ కార్లలో ఏది బెస్ట్​?

రానున్న రోజుల్లో ఇండియా ఆటోమొబైల్​ మార్కెట్​లో ఈవీల దండయాత్ర కనిపించనుంది. అనేక సంస్థలు తమ ఎలక్ట్రిక్​ వాహనాలను సిద్ధం చేసుకుంటుండటం ఇందుకు కారణం. కొన్ని మోడల్స్​ ఇప్పటికే ప్రజలు ముందుకు వచ్చి, వారిలో ఆసక్తిని బాగా పెంచేశాయి. వీటిల్లో హ్యుందాయ్​ క్రెటా ఈవీ, మహీంద్రా బీఈ 6 ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలపై ప్రజల్లో విపరీతమైన క్రేజ్​ కనిపిస్తోంది. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్​? ఏది వాల్యూ ఫర్​ మనీ? ఇక్కడ తెలుసుకోండి..

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వర్సెస్ మహీంద్రా బీఈ 6: బ్యాటరీ, రేంజ్​..

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్​తో లభిస్తుంది. 42 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉన్న క్రెటా ఎలక్ట్రిక్ సింగిల్ ఛార్జ్ రేంజ్​ 390 కిలోమీటర్లు. 51.4 కిలోవాట్ల వేరియంట్ 473 కిలోమీటర్ల సింగిల్ ఛార్జ్ పరిధిని అందిస్తుంది.

మహీంద్రా బీఈ 6 59 కిలోవాట్, 79 కిలోవాట్ల ఆప్షన్స్​తో సెగ్మెంట్​లోనే అతిపెద్ద బ్యాటరీ ప్యాక్లతో వస్తోంది. అతిపెద్ద బ్యాటరీలతో, మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్​యూవీ దాని పోటీదారుల కంటే లాంగ్​ రేంజ్​ని అందిస్తుంది. చిన్న బ్యాటరీ 556 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. పెద్ద బ్యాటరీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 682 కిలోమీటర్ల రేంజ్​ ఇస్తుంది.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వర్సెస్ మహీంద్రా బీఈ 6: స్పెసిఫికేషన్లు

51 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వేరియంట్లతో హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ 169 బీహెచ్​పీ పవర్​ని ఉత్పత్తి చేస్తుంది. ఇది హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ కంటే మరింత శక్తివంతమైనది. అయితే చిన్న బ్యాటరీ ప్యాక్ ఉన్న వేరియంట్లు 133 బీహెచ్​పీ పవర్​ని ఉత్పత్తి చేస్తాయి. హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ 7.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని సంస్థ పేర్కొంది.

మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్​యూవీలో రేర్ వీల్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది. బీఈ 6 ఎలక్ట్రిక్ ఎస్​యూవీ 228 బీహెచ్​పీ- 277 బీహెచ్​పీ పవర్​ని, 390 ఎన్ఎమ్ పీక్​ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఇది కేవలం ఏడు సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది!

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వర్సెస్ మహీంద్రా బీఈ 6: ధర..

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర రూ .18 లక్షలు (ఇంట్రొడక్టరీ ఎక్స్​షోరూం ప్రైజ్​). రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందిస్తున్న క్రెటా ఎలక్ట్రిక్ ధర రూ .23.49 లక్షల వరకు ఉంటుంది.

మహీంద్రా తన బీఈ 6 ఎలక్ట్రిక్ ఎస్​యూవీకి అగ్రెసివ్​ ప్రైజింగ్​ని ఇచ్చిందనే చెప్పుకోవాలి. దీని ప్రారంభ ధర రూ .18.90 లక్షలు (ఎక్స్-షోరూమ్) దాదాపు క్రెటా ఎలక్ట్రిక్ మాదిరిగానే ఉంటుంది. టాప్ ఎండ్​లో, రూ .26.90 లక్షల ధర కలిగిన మహీంద్రా బీఈ 6, హ్యుందాయ్ ప్రత్యర్థి కంటే రూ .3 లక్షలకు పైగా ఖరీదైనది!

Whats_app_banner

సంబంధిత కథనం