Alcazar vs XUV700 : మీ ఫ్యామిలీకి ఏ కారు సెట్ అవుద్దో తెలుసుకోవాలనుకుంటే ఇది చదివితే అర్థమవుతుంది
Alcazar vs XUV700 : ఇటీవలి కాలంలో 7 సీటర్స్‌కు డిమాండ్ పెరిగింది. ఫ్యామిలీతో కలిసి వెళ్లేందుకు ఇవి చక్కగా ఉంటాయి. మీరు కూడా కుటుంబానికి సరిపోయేలా కారు తీసుకోవాలనుకుంటే హ్యూందాయ్ అల్కాజర్, మహింద్రా ఎక్స్‌యూవీ 700పై ఓ లుక్కేయండి..
SUVలు చాలా మందికి ఇష్టమైన వాహనం. 7 మంది కలిసి వెళ్లే అన్ని మోడల్స్‌కు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. కుటుంబంతో కలిసి ప్రయాణించడానికి పెద్ద వాహనం అవసరం. అలాంటి ఫ్యామిలీ కార్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. దీన్ని సరిగ్గా అర్థం చేసుకున్న కంపెనీలు మార్కెట్లోకి కొత్త కార్లను తీసుకొస్తున్నాయి. ఈ వ్యూహం విజయవంతమైంది. మహీంద్రా 7-సీటర్ సెగ్మెంట్‌ను కూడా క్యాష్ చేయడం ప్రారంభించింది. ట్రెండ్‌కు అనుగుణంగా దక్షిణ కొరియా వాహన తయారీదారు హ్యుందాయ్.. అల్కాజర్ సెగ్మెంట్‌కు కూడా పరిచయం చేశారు.
సరికొత్త హ్యుందాయ్ అల్కాజార్ రిఫ్రెష్డ్ డిజైన్, అప్‌గ్రేడ్ చేసిన ఫీచర్లతో వస్తుంది. మీరు 7-సీటర్ స్పోర్ట్ యుటిలిటీ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే.. మహీంద్రా XUV700, హ్యుందాయ్ అల్కాజార్‌ల మధ్య ఏ మోడల్‌ను ఎంచుకోవాలో చూడండి. ఈ రెండు SUVలను పరిశీలించండి..
ధర
హ్యుందాయ్ అల్కాజార్ పెట్రోల్ వేరియంట్ ధర రూ. 14.99 లక్షలు ఎక్స్-షోరూమ్. కాగా 7-సీటర్ ఎస్‌యూవీ డీజిల్ వెర్షన్ ధర రూ.15.99 లక్షలు. మరోవైపు మహీంద్రా XUV700 ఎక్స్-షోరూమ్ ధర రూ. 13.99 లక్షల నుండి రూ. 25.14 లక్షల మధ్య ఉంది. ఇటీవల మహీంద్రా అనేక వేరియంట్ల ధరలను తగ్గించింది. మీరు మీ బడ్జెట్ ఆధారంగా కొనుగోలు చేస్తే ప్రాధాన్యతలు మారే అవకాశం ఉంది.
ఇంజిన్
అల్కాజర్ రెండు ఇంజన్ ఎంపికలలో వస్తుంది. మొదటిది 1.5-లీటర్ టర్బోచార్జ్డ్-పెట్రోల్ యూనిట్, ఇది 158 bhp శక్తిని, 253 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ DCT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కొనుగోలు చేయవచ్చు. తదుపరి 1.5-లీటర్ U2 CRDi డీజిల్ 114 bhp శక్తిని, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కలిగి ఉంటుంది.
మరోవైపు మహీంద్రా XUV700 SUV పెట్రోల్, డీజిల్ ఎంపికలలో కూడా అందుబాటులో ఉంది. పెట్రోల్ 2.0 లీటర్ Mstallion యూనిట్, ఇది 197 bhp శక్తిని, 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. తదుపరిది 2.2-లీటర్ Mhawk డీజిల్‌గా ఉంది. ఇది రెండు వేర్వేరు ట్యూనింగ్‌లలో కంపెనీ మార్కెట్ చేసింది. మునుపటిది 152 bhp శక్తిని, 360 Nm టార్క్‌ను అందించగలదు. మహీంద్రా XUV700 SUVలో ట్రాన్స్‌మిషన్ ఎంపికలు 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్.
ఈ రెండు ఫ్యామిలీ కార్లు ఇంజన్ల పరంగా ఒకేలా ఉంటాయి. కానీ హ్యుందాయ్ సర్వీస్ పరంగా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఫీచర్ల విషయానికొస్తే, రెండు మోడల్‌లు ఒకదానికొకటి దగ్గరగా ఉంటాయి. వాటిని పోల్చాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి అభిరుచిని బట్టి డిజైన్, అంశాలు మారుతూ ఉంటాయి. హ్యుందాయ్ అల్కాజార్, మహీంద్రా XUV700 SUVలో అన్ని రకాల ఆధునిక ఫీచర్లు, ADAS వంటి డ్రైవర్ సహాయక వ్యవస్థలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటీలో మీకు ఏది ఇష్టమో చూసి కొనండి.