Offers on Maruti cars : ఈ మారుతీ సుజుకీ వాహనాలపై భారీ డిస్కౌంట్లు.. ఇంకొన్ని రోజులే!-huge offers on these maruti cars in january 2023 check all discounts and latest prices here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Huge Offers On These Maruti Cars In January 2023, Check All Discounts And Latest Prices Here

Offers on Maruti cars : ఈ మారుతీ సుజుకీ వాహనాలపై భారీ డిస్కౌంట్లు.. ఇంకొన్ని రోజులే!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 08, 2023 11:37 AM IST

Offers on Maruti cars in January 2023 : ఈ నెలలో మారుతీ సుజుకీ వాహనాలపై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

ఈ మారుతీ సుజుకీ వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు..!
ఈ మారుతీ సుజుకీ వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు..!

Offers on Maruti cars in January 2023 : దేశంలో పండుగ సీజన్​ సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ ఆటో సంస్థలు.. తమ మోడల్స్​పై డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ఈ జాబితాలోకి దేశీయ దిగ్గజ ఆటో సంస్థ మారుతీ సుజుకీ చేరింది. పలు మోడల్స్​పై  జనవరిలో అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. ఆల్టో 800, ఆల్టో కే10, వాగన్​ ఆర్​​ వంటి మోడల్స్​పై ఈ ఆఫర్స్​ ఉన్నాయి. 2022లో మేన్యుఫ్యాక్చర్​ చేసిన యూనిట్​లపైనా డిస్కౌంట్లు ఇస్తోంది ఆ సంస్థ. ఎస్​- ప్రెస్సో, సెలేరియో, వాగన్​ ఆర్​ ఎంవై22(మేన్యుఫ్యాక్చరింగ్​) యూనిట్​లపై అధికంగా ఆఫర్లు లభిస్తున్నాయి. ఎర్టిగా, బ్రెజా వాహనాలపై జనవరిలో ఎలాంటి డిస్కౌంట్లు ఇవ్వట్లేదు మారుతీ సుజుకీ.

ట్రెండింగ్ వార్తలు

జనవరిలో మారుతీ సుజుకీ మోడల్స్​పై ఉన్న ఆఫర్స్​ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము..

ఆల్టో 800..

Offers on Alto 800 in January : ఆల్టో 800 (ఎంవై2022) వేరియంట్లపై ఈ నెల 13 వరకు క్యాష్​ డిస్కౌంట్​గా రూ. 35వేల వరకు తగ్గింపు లభిస్తుంటే.. ఆ తర్వాత అది రూ. 20వేలకు పడిపోతుంది. ఇక ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 15వేలు లభిస్తోంది. కార్పొరేట్​ డిస్కౌంట్​ కింద రూ. 6వేలు తగ్గుతోంది. మొత్తం మీద ఆఫర్ల విలువ ఈ నెల 13 వరకు రూ. 50వేలు ఉండగా.. ఆ తర్వాత అది రూ. 36వేలకు చేరుతుంది.

ఇక ఆల్టో 800 (ఎంవై2023)పై క్యాష్​ బోనస్​ కింద రూ. 10వేలు, ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద్​ రూ. 15వేలు, కార్పొరేట్​ డిస్కౌంట్​ కింద రూ. 6వేల వరకు ఆఫర్స్​ ఉన్నాయి. మొత్తం మీద రూ. 31వేల వరకు తగ్గుతోంది.

ఆల్టో 800 (ఎంవై2022) సీఎన్​జీ వేరియంట్​పై అధికంగా డిస్కౌంట్లు ఉన్నట్టు తెలుస్తోంది.

మారుతీ సుజుకీ ఆల్టో కే10..

Offers on Maruti Suzuki Alto K10 : ఆల్టో కే10 (ఎంవై2022)పై క్యాష్​ డిస్కౌంట్​ కింద ఈ నెల 13 వరకు రూ. 25వేల వరకు, ఆ తర్వాత రూ. 20వేలు లభిస్తోంది. ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 15వేలు తగ్గుతోంది. కార్పొరేట్​ డిస్కౌంట్​ కింద రూ. 8వేలు తగ్గుతోంది. మొత్తం మీద జనవరి 13 వరకు రూ. 48వేలు, ఈ తర్వాత రూ. 43వేల వరకు తగ్గింపు లభిస్తోంది.

ఇక ఎంవై2023 ఆల్టో కే10 మోడల్​పై రూ. 38వేల వరకు ఆఫర్లు ఉన్నాయి.

మారుతీ ఎస్​- ప్రెస్సో..

Maruti S Presso price in India : మారుతీ ఎస్​ ప్రెస్సో (ఎంవై2022)పై ఈ నెల 13 వరకు క్యాష్​ డిస్కౌంట్​ కింద రూ. 50వేలు, ఆ తర్వాత రూ. 30వేలు లభిస్తోంది. ఇక ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 15వేలు దిగొస్తోంది. కార్పొరేట్​ బోనస్​ కింద రూ. 5వేల వరకు డిస్కౌంట్​ ఉంది. మొత్తం మీద 13వ తేదీ వరకు రూ.65వేలు, ఆ తర్వాత రూ. 45వేల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి.

ఇక మారుతీ ఎస్​ ప్రెస్సో (ఎంవై2023)పై క్యాష్​ బోనస్​ కింద రూ. 15వేలు, ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కిం రూ. 15వేలు, కార్పొరేట్​ డిస్కౌంట్​ కింద రూ. 5వేలు లభిస్తోంది. మొత్తం మీద రూ. 35వేల వరకు ఆఫర్లు లభిస్తున్నాయి.

మారుతీ వాగన్​ ఆర్​..

Maruti Wagon R discount : మారుతీ వాగన్​ ఆర్​ (ఎంవై2022)పై ఈ నెల 13 వరకు క్యాష్​ బోనస్​ కింద రూ. 25వేలు, ఆ తర్వాత రూ. 15వేల వరకు లభిస్తోంది. ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 15వేలు, కార్పొరేట్​ డిస్కౌంట్​ కింద రూ. 8వేలు వస్తోంది. మొత్తం మీద ఈ నెల 13 వరకు రూ. 48వేలు, ఆ తర్వాత రూ. 38వేల వరకు డిస్కౌంట్​ పొందొచ్చు.

ఇక మారుతీ వాగన్​ ఆర్​ ఎంవై2023పై రూ. 10వేల వరకు క్యాష్​ డిస్కౌంట్​, రూ. 15వేల వరకు ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 8వేల వరకు కార్పొరేట్​ డిస్కౌంట్​ లభిస్తోంది. మొత్తం మీద రూ. 33వేల వరకు ఆఫర్లు ఉన్నాయి.

WhatsApp channel

సంబంధిత కథనం