Flipkart Year end Sale: ఈ మూడు స్మార్ట్ టీవీలపై సూపర్ డిస్కౌంట్.. బ్యాంక్ కార్డు ఆఫర్లు కూడా..
Flipkart Year end Sale - Smart TV offers: ఇయర్ ఎండ్ సేల్‌లో కొన్ని స్మార్ట్ టీవీలను డిస్కౌంట్లతో అందుబాటులోకి తెచ్చింది ఫ్లిప్‌కార్ట్. వాటిలో మూడు టీవీలపై ఉన్న డీల్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి.
Flipkart Year end Sale - Smart TV offers: 2022 ముగుస్తున్న తరుణంలో ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart).. ఇయర్ ఎండ్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొబైళ్లు, స్మార్ట్ టీవీలతో పాటు చాలా ప్రొడక్టులపై డిస్కౌంట్లను తీసుకొచ్చింది. బ్యాంక్ కార్డ్ ఆఫర్లను కూడా అందుబాటులో ఉంచింది. ఈనెల 28వ తేదీ వరకు ఈ ఇయర్ ఎండ్ సేల్ ఉండనుంది. ఈ సేల్‌లో కొన్ని స్మార్ట్ టీవీలపై మంచి డిస్కౌంట్లకు ఉన్నాయి. ఆఫర్లను వినియోగించుకుంటే తగ్గింపు ధరకే వీటిని కొనుగోలు చేయవచ్చు. ఇలా ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్‌లో మంచి ఆఫర్లతో లభిస్తున్న వాటిలో మూడు స్మార్ట్ టీవీలు ఇవి.
ట్రెండింగ్ వార్తలు
రియల్మీ 50 ఇంచుల 4కే స్మార్ట్ టీవీ
రియల్మీ 50 ఇంచుల అల్ట్రా హెచ్డీ 4కే ఆర్వీఎం2005 (realme 50 inch 4K Smart TV RMV2005) స్మార్ట్ టీవీ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో డిస్కౌంట్‌తో రూ.28,999కే అందుబాటులో ఉంది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో కొంటే అదనంగా మరో రూ.3,000 తగ్గింపు దక్కుతుంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.2,000 ఆఫర్ లభిస్తుంది. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై కూడా అదనపు డిస్కౌంట్ దక్కుతుంది. 50 ఇంచుల 4కే డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, 24 వాట్ల సౌండ్ ఔట్పుట్ ఇచ్చే స్పీకర్లను ఈ రియల్మీ ఆర్వీఎం2005 4కే స్మార్ట్ టీవీ కలిగి ఉంది. రూ.30వేలలోపు 50 ఇంచుల టీవీ కావాలంటే ఇది మంచి ఆప్షన్‌గా ఉంది.
ఎంఐ 5ఏ 32 ఇంచుల స్మార్ట్ టీవీ (2022 మోడల్)
32 ఇంచుల స్మార్ట్ టీవీ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆఫర్‌గా ఉంది. ఎంఐ 5ఏ 32 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ (Mi 5A 32 inch LED Smart Android TV) ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ప్రస్తుతం రూ.13,999 ధరకు లభిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ, ఫెడరల్, ఐడీఎఫ్సీ బ్యాంకుల క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,399 వరకు అదనంగా తగ్గింపు పొందవచ్చు. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, 20 వాట్ల స్పీకర్లు ఈ ఎంఐ టీవీలో ఉంటాయి. దాదాపు అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు ఈ స్మార్ట్ టీవీ సపోర్ట్ చేస్తుంది.
థామ్సన్ ఆల్ఫా 32 ఇంచుల స్మార్ట్ టీవీ
Thomson Alpha 32 inch Smart Linux TV: ఇక ఎంట్రీ లెవెల్లో 32 ఇంచుల స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఇది సూటవుతుంది. థామ్సన్ ఆల్ఫా 32 ఇంచుల స్మార్ట్ టీవీ ధర ప్రస్తుత సేల్‌లో రూ.7,999గా ఉంది. బ్యాంక్ కార్డు ఆఫర్లను వినియోగించుకుంటే మరో రూ.800 వరకు అదనంగా సేవ్ చేసుకోవచ్చు. 30 వాట్ల సౌండ్ ఔట్పుట్ ఇచ్చే స్పీకర్లు ఈ బడ్జెట్ థామ్సన్ స్మార్ట్ టీవీలో ఉంటాయి. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ టీవీ రన్ అవుతుంది.