Festival discounts on cars : పండుగ సీజన్​లో ఈ వాహనాలపై భారీ డిస్కౌంట్లు.. మిస్​ అవ్వకండి!-huge discounts on these hyundai and maruti suzuki cars in october ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Festival Discounts On Cars : పండుగ సీజన్​లో ఈ వాహనాలపై భారీ డిస్కౌంట్లు.. మిస్​ అవ్వకండి!

Festival discounts on cars : పండుగ సీజన్​లో ఈ వాహనాలపై భారీ డిస్కౌంట్లు.. మిస్​ అవ్వకండి!

Sharath Chitturi HT Telugu
Oct 15, 2023 01:09 PM IST

Festival discounts on cars : హ్యుందాయ్​ మోటార్స్​, మారుతీ సుజుకీకు చెందిన కొన్ని మోడల్స్​పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఆ వివరాలు..

పండుగ సీజన్​లో ఈ వాహనాలపై భారీ డిస్కౌంట్లు.. మిస్​ అవ్వకండి!
పండుగ సీజన్​లో ఈ వాహనాలపై భారీ డిస్కౌంట్లు.. మిస్​ అవ్వకండి! (REUTERS)

Festival discounts on cars : పండుగ సీజన్​ నేపథ్యంలో.. వివిధ ఆటోమొబైల్​ సంస్థలు తమ వాహనాలపై భారీ మొత్తంలో డిస్కౌంట్లు ఇస్తున్నాయి. హ్యుందాయ్​ మోటార్స్​, మారుతీ సుజుకీకి చెందిన పలు మోడల్స్​పై మంచి ఆఫర్స్​ లభిస్తున్నాయి. వీటిపై ఓ లుక్కేద్దాము..

హ్యుందాయ్​ ఆరా..

హ్యుందాయ్​ ఆరా సీఎన్​జీ వర్షెన్​పై రూ. 33వేల వరకు తగ్గింపు లభిస్తోంది. వీటిల్లో క్యాష్​ డిస్కౌంట్​ రూ. 20వేలు, ఎక్స్​ఛేంజ్​ బోనస్​ రూ. 10వేలు, కార్పొరేట్​ డిస్కౌంట్​ రూ. 3వేలుగా ఉన్నాయి.

Discounts on Hyundai cars : మరోవైపు ఈ కాంపాక్ట్​ సెడాన్​కు చెందిన పెట్రోల్​ వర్షెన్​పై రూ. 10వేల వరకు క్యాష బోనస్​, రూ. 10వేల వరకు ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 3వేల వరకు కార్పొరేట్​ డిస్కౌంట్​ వస్తోంది.

అయితే.. ఈ నెల తొలినాళ్లల్లో హ్యుందాయ్​ ఆరా ధర (ఎస్​ఎక్స్​(ఓ) వేరియంట్​ను మినహాయిస్తే.. ) రూ. 11,200 వరకు పెరిగింది. ఇక ఇప్పుడు.. పెరిగిన రేటు కన్నా డిస్కౌంట్​ ఎక్కువగా లభిస్తుండటం.. మంచి విషయం.

మారుతీ సుజుకీ సెలేరియో..

అక్టోబర్​ నెల, పండుగ సీజన్​ నేపథ్యంలో పలు నెక్సా, ఎరోనా మోడల్స్​పై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ. మరీ ముఖ్యంగా మారుతీ సుజుకీ సెలేరియోపై క్రేజీ డీల్స్​ పొందొచ్చు!

సెలేరియో వీఎక్స్​ఐ, జెడ్​ఎక్స్​ఐ, జెడ్​ఎక్స్​ఐ పెట్రోల్​ ఎంటీపై రూ. 35వేల వరకు క్యాష్​ డిస్కౌంట్​, రూ. 20వేల వరకు ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 4వేల వరకు కార్పొరేట్​ డిస్కౌంట్​ లభిస్తోంది.

Discounts on Maruti Suzuki cars : ఇక సెలేరియో ఏఎంటీ వర్షెన్​పై రూ. 30వేలు విలువ చేసే క్యాష్​ డిస్కౌంట్​, రూ. 20వేలు విలువ చేసే ఎక్స్​ఛేంజ్​ బోనస్​, రూ. 4వేలు విలువ చేసే కార్పొరేట్​ డిస్కౌంట్​ పొందొచ్చు.

సీఎన్​జీ వేరియంట్​పైనా తగ్గింపు లభిస్తోంది. ఈ మోడల్​పై రూ. 30వేల క్యాష్​ డిస్కౌంట్​, రూ. 20వేల ఎక్స్​ఛేంజ్​ బోనస్​ ఉంటుంది.

ఈ సెలేరియోలో 1.0 లీటర్​, 3 సిలిండర్​, నేచురల్లీ ఆస్పిరేటెడ్​ పెట్రోల్​ ఇంజిన్​ ఉంటుంది. ఇది 66 హెచ్​పీ పవర్​ను, 89ఎన్​ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది. సీఎన్​జీ వర్షెన్​లోని ఇంజిన్​.. 56 హెచ్​పీ పవర్​ను, 82ఎన్ఎం టార్క్​ను జనరేట్​ చేస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం