Discounts on Nissan cars : మాగ్నైట్​, కిక్స్​పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్న నిస్సాన్​..-huge discounts on nissan cars check full details of offers on magnite and kicks ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Huge Discounts On Nissan Cars Check Full Details Of Offers On Magnite And Kicks

Discounts on Nissan cars : మాగ్నైట్​, కిక్స్​పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్న నిస్సాన్​..

Sharath Chitturi HT Telugu
Feb 10, 2023 11:34 AM IST

Discounts on Nissan cars : మాగ్నైట్​, కిక్స్​పై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది ప్రముఖ ఆటోమొబైల్​ సంస్థ నిస్సాన్​. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

మాగ్నైట్​, కిక్స్​పై భారీ డిస్కౌంట్లు..
మాగ్నైట్​, కిక్స్​పై భారీ డిస్కౌంట్లు.. (HT AUTO)

Discounts on Nissan cars : అటు పండుగ సీజన్​ కాదు.. ఇటు డిమాండ్​ ఎక్కువగా ఉన్న రోజులూ కాదు.. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకర్షించి, సేల్స్​ని పెంచుకునేందుకు దేశంలోని ఆటోమొబైల్​ సంస్థలు డిస్కౌంట్ల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి నిస్సాన్​ కూడా చేరింది. సంస్థకు చెందిన, మంచి డిమాండ్​ ఉన్న మాగ్నైట్​, కిక్స్​ వంటి మోడల్స్​పై ఈ నెలలో భారీ డిస్కౌంట్లు ఇస్తోంది. ఆ వివరాలను ఓసారి చూద్దాం..

ట్రెండింగ్ వార్తలు

నిస్సాన్​ మాగ్నైట్​..

Discounts on Nissan Magnite : నిస్సాన్​ మాగ్నైట్​ ఎంవై22 (మేన్యుఫ్యాక్చరింగ్​ ఇయర్​)కు సంబంధించి.. ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 20వేల తగ్గింపు లభిస్తోంది. ప్రీ మెయిన్​టేనెన్స్​ ప్యాకేజ్​పై రూ. 12,100 తగ్గుతోంది. ఇక క్యాష్​/ యాక్ససరీస్​ రూపంలో మరో రూ. 12వేలు దిగొస్తోంది. కార్పొరేట్​ డిస్కౌంట్​ కింద రూ. 15వేల తగ్గింపు లభిస్తోంది. లాయల్టీ బోనస్​, ఆన్​లైన్​ బుకింగ్​ బోనస్​లు వరుసగా రూ. 10వేలు, రూ. 2వేలుగా ఉన్నాయి. మొత్తం మీద ఈ మోడల్​పై రూ. 82,100 వరకు తగ్గింపు వస్తోంది.

Nissan Magnite on road price : ఇక నిస్సాన్​ మాగ్నైట్​ ఎంవై23 మోడల్​పై ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద రూ. 20వేల తగ్గింపు లభిస్తోంది. ప్రీ మెయిన్​టేనెన్స్​ ప్యాకేజ్​పై రూ. 6,950 తగ్గుతోంది. ఇక క్యాష్​/ యాక్ససరీస్​ రూపంలో మరో రూ. 12వేలు తగ్గింపు వర్తిస్తోంది. కార్పొరేట్​ డిస్కౌంట్​ కింద రూ. 10వేల తగ్గింపు లభిస్తోంది. లాయల్టీ బోనస్​, ఆన్​లైన్​ బుకింగ్​ బోనస్​లు వరుసగా రూ. 10వేలు, రూ. 2వేలుగా ఉన్నాయి. మొత్తం మీద ఈ మోడల్​పై రూ. 71,950 వరకు తగ్గింపు వస్తోంది.

Nissan new 7 seater MPV : నిస్సాన్​ నుంచి త్వరలో కొత్త ఎంపీవీ రానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

మార్కెట్​లో నిస్సాన్​ మాగ్నైట్​ ఎక్స్​షోరూం ధర రూ. 6లక్షలు- రూ. 10.94లక్షల మధ్యలో ఉంది.

నిస్సాన్​ కిక్స్​..

Nissan Kicks on road price Hyderabad : నిస్సాన్​ కిక్స్​పై ఎక్స్​ఛేంజ్​ బోనస్​ కింద్​ రూ.30వేలు తగ్గుతోంది. క్యాష్​ డిస్కౌంట్​తో రూ. 19వేలు అదనంగా తగ్గుతుంది. ఇక కార్పొరేట్​ డిస్కౌంట్​ పేరుతో రూ. 10వేలను తగ్గిస్తోంది నిస్సాన్​. ఆన్​లైన్​ బుకింగ్​ బోనస్​ (రూ. 2000)ను కూడా ఇస్తోంది. మొత్తం మీద నిస్సాన్​ కిక్స్​పై రూ. 61వేల వరకు డిస్కౌంట్​ లభిస్తోంది.

మార్కెట్​లో నిస్సాన్​ కిక్స్​ ఎక్స్​షోరూం ధర రూ. 9.50లక్షలు- రూ. 14.90లక్షల మధ్యలో ఉంది.

* డిస్కౌంట్లు అనేవి మోడల్​, నగరం, షోరూమ్​కు తగ్గట్టు మారుతూ ఉంటాయి

* పూర్తి వివరాల కోసం మీ సమీప నిస్సాన్​ డీలర్​షిప్​ షోరూమ్​ను సంప్రదించాల్సి ఉంటుంది.

WhatsApp channel

సంబంధిత కథనం