Redmi Note 12 pro plus 5G : రూ. 8వేలకే రెడ్‍మీ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్.. ఆఫర్ అదిరింది!
Discounts on Redmi Note 12 pro plus 5G : రెడ్‍మీ నోట్ 12 ప్రో ప్లస్ 5జీపై అదిరిపోయే ఆఫర్ ఇస్తోంది ఫ్లిప్‌కార్ట్. రూ. 33,999గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 8వేలకే దక్కించుకోవచ్చు!
Discounts on Redmi Note 12 pro plus 5G : ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ ఇటీవలే లాంచ్ అయ్యింది. ఇంతలోనే ఈ గ్యాడ్జెట్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తుండటం విశేషం. డీసెంట్ ఫీచర్స్‌తో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని మీరు చూస్తుంటే.. ఇదే మంచి సమయం. మరి రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీపై ఉన్న డిస్కౌంట్‌ను ఓసారి చూద్దాం..
క్రేజీ స్మార్ట్‌ఫోన్.. క్రేజీ ఆఫర్..!
ఈ రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వాస్తవ ధర రూ. 33,999. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఈరోజు కేవలం రూ. 8వేలకే దక్కించుకోవచ్చు!
Redmi Note 12 pro plus 5G Flipkart offers : వాస్తవానికి ఆఫర్ కారణంగా ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 29,999కి వస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ని వాడుకుంటే.. రూ. 22,000 తగ్గొచ్చు. ఫలితంగా.. కేవలం రూ. 7,999కే ఈ రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మీరు దక్కించుకోవచ్చు. పాత, పనిచేస్తున్న ఓ స్మార్ట్‌ఫోన్ మీ వద్ద ఉంటే చాలు.. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను ట్రై చేయవచ్చు.
మరోవైపు.. రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీపై ఫ్లిప్‌కార్ట్- యాక్సిస్ బ్యాంక్ కార్డు మీద 5శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్ట్ నాన్ ఈఎంఐ ట్రాన్సాక్షన్ మీద రూ. 2000 తగ్గింపు వస్తోంది. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్ట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ మీద రూ .2,500 తగ్గుతుంది.
రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీని కొనుగోలు చేసేందుకు ఫ్లిప్‌కార్ట్ అఫీషియల్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. కలర్, వేరియంట్ సెలక్ట్ చేసి బై ఆప్షన్ మీద క్లిక్ చేసి, ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ఆఫర్స్‌ను అప్లై చేయాలి. అంతే..! ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 26వేల వరకు తగ్గింపు పొందవచ్చు.
రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ ఫీచర్స్..
Redmi Note 12 pro plus 5G features : రెడ్‍మీ నోట్ 12 సిరీస్‍లో రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ, రెడ్ మీ నోట్ 12 ప్రో 5జీ, రెడ్ మీ నోట్ 12 5జీ ఫోన్లు ఈ నెల 5న ఇండియాలో విడులయ్యాయి. వీటిలో రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ ప్రీమియమ్ స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. డ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ ఫోన్‍లో మీడియాటెక్ డైమన్సిటీ 1080 ప్రాసెసర్ ఉంటుంది. 256జీబీ స్టోరేజీని కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‍తో వస్తోంది.
రెడ్‍మీ నోట్ 12 ప్రో+ 5జీ ఫీచర్స్ పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం