WhatsApp Meta AI : మెటా ఏఐతో వాట్సాప్‌లోనే ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు- మరెన్నో కూల్ ఫీచర్స్ కూడా!
Meta AI features in WhatsApp : మెటా ఏఐ ఆధారంగా వాట్సాప్‌లోనే మీరు ఇమేజెస్‌ని క్రియేట్ చేసుకోవచ్చని మీకు తెలుసా? అంతేకాదు ఈ ఏఐతో ఇంకా ఎన్నో పనులు చేయవచ్చు. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
ప్రపంచం ఇప్పుడు ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్వైపు శరవేగంగా పరుగులు తీస్తోంది. వాట్సాప్ సైతం తన యూజర్స్ కోసం మెటా ఏఐ పేరుతో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మెటా ఏఐతో మీరు ఎన్నో అద్బుతాలు చేయవచ్చు! ఇందులోని ఏఐ ఫీచర్స్ మీకు చాలా రకాలుగా ఉపయోపగతాయి. భారతదేశంతో పాటు ఎంపిక చేసిన దేశాల్లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ స్మార్ట్, మరింత అంతరాయం లేని కమ్యూనికేషన్‌ని అందిస్తుంది.
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ మెటా అభివృద్ధి చేసిన మెటా ఏఐ లామా 3 లాంగ్వేజ్ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం, టెక్స్ట్ కంటెంట్‌ని జనరేట్ చేయడం, ఇమేజెస్‌ని క్రియేట్ చేయడం, అనువాదం, సారాంశంలో సహాయపడటం వంటి పనులను చేయగలదు!
ప్రస్తుతం ఇండియా, యునైటెడ్ స్టేట్స్, కెనడా, యూకే, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఆంగ్లంలో అందుబాటులో ఉన్న ఈ మెటా ఏఐ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. డైరెక్ట్ మెసేజ్‌లను మాత్రమే ప్రాసెస్ చేయడం ద్వారా యూజర్ ప్రైవసీకి భరోసా కూడా ఇస్తూ ఈ టూల్ పూర్తిగా వాట్సాప్‌లో ఇంటిగ్రేట్ అయింది. ఈ నేపథ్యంలో మెటా ఏఐతో వాట్సాప్‌లో ఏంఏం చేయొచ్చు? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
మెటా ఏఐని ఎలా ఉపయోగించాలి?
1. వాట్సప్ ఓపెన్ చేయండి.
మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైజ్‌లో వాట్సాప్ ఓపెన్ చేయండి.
2. మెటా ఏఐ ఐకాన్ని వెతకండి
ఆండ్రాయిడ్‌లో మెటా ఏఐ ఐకాన్ "కొత్త చాట్" బటన్ పైన కనిపిస్తుంది. ఐఓఎస్ యూజర్లకు ఇది ఇన్‌బాక్స్ లోపల స్క్రీన్ పైభాగంలో ఉంటుంది.
3. చాట్ ప్రారంభించండి..
ప్రత్యేక చాట్ విండోను ఓపెన్ చేయడానకిి మెటా ఏఐ ఐకాన్‌పై క్లిక్ చేయండి.
4. మీ ప్రశ్నలు అడగండి..
ఏదైనా ప్రశ్న లేదా రిక్వెస్ట్‌ని టైప్ చేయండి. మెటా ఏఐ అనేక రకాల ప్రశ్నలకు సమాధానం చెప్పగలదు!
5. ఇమేజ్‌లను జనరేట్ చేయండి..
ఇమేజ్‌లను సృష్టించడానికి, “ఇమాజిన్” తో పాటు ఇమేజ్ వివరణ టైప్ చేయండి. ఉదాహరణకి:
- “Imagine a sunset over a snowy mountain.”
మీ వివరణ ఆధారంగా మెటా ఏఐ ఇమేజ్ జనరేట్ చేస్తుంది.
గ్రూప్ చాట్స్‌లో మెటా ఏఐని ఎలా ఉపయోగించాలి?
మెటా ఏఐ గ్రూప్ చాట్లకు కూడా సపోర్ట్ చేస్తుంది. "@" అని టైప్ చేసి డ్రాప్‌డౌన్ మెనూ నుంచి మెటా ఏఐని ఎంచుకోవడం ద్వారా, వినియోగదారులు చాట్‌బాట్‌తో సంభాషించవచ్చు. దాని రెస్పాన్స్ అందరికీ కనిపిస్తుంది. సంభాషణ సందర్భానికి అనుగుణంగా రెస్పాన్స్‌లు ఉంటాయి.
మెటా ఏఐ ఫీచర్లు..
మెటా ఏఐ వాస్తవిక ప్రశ్నలకు తక్షణ సమాధానాలు, కవితలు, పాటల సాహిత్యం, చిన్న కథలు, స్క్రిప్ట్‌లను సృష్టించడం వంటి సృజనాత్మక సహాయాన్ని అందిస్తుంది. ఇది అనువాదం, సారాంశం, కస్టమ్ ఇమేజ్‌లను సృష్టించేందుకు కూడా సహాయపడుతుంది.
ప్రైవసీ అండ్ సేఫ్టీ..
మెటా ఏఐ నేరుగా ఉద్దేశించిన సందేశాలను మాత్రమే ప్రాసెస్ చేస్తుంది, ఇతర సంభాషణల గోప్యతను నిర్ధారిస్తుంది. క్లియర్ ప్రాంప్ట్స్ దాని ప్రభావాన్ని పెంచుతాయి.
మెటా ఏఐతో, వాట్సాప్ వినియోగదారులు ఇప్పుడు వారి గోప్యత చెక్కుచెదరకుండా చూసుకుంటూనే తెలివైన, మరింత ఉత్పాదక కాన్వర్జేషన్స్లో పాల్గొనవచ్చు.
సంబంధిత కథనం