How to reduce loan burden : అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడాలా? ఇలా చేయండి..!
How to reduce loan burden : మీపై అప్పుల భారం ఎక్కువగా ఉంటోందా? ఫలితంగా ఒత్తిడికి గురవుతున్నారా? అప్పులను ఎలా తీర్చుకోవాలో అర్థం కావడం లేదా? అయితే ఇది మీకోసమే..
How to get rid of Loan burden : 'ధనం మూలం ఇధం జగత్' అన్న మాటపై ఈ ప్రపంచం నడుస్తోందన్న విషయం అందరికి తెలిసిందే. నిత్య జీవితాన్ని సాగించేందుకు డబ్బు చాలా అవసరం. డబ్బు లేకపోవడంతో కొంతమంది అప్పులు చేస్తుంటారు. కొద్ది కాలంలో ఆ అప్పులు ఎక్కువైపోతాయి. అప్పుల ఊబిలో కూరుకుపోయి చాలా బాధలు పడుతుంటారు. అయితే.. అప్పులను తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్/ మార్గాలు ఉంటాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాము..
పెద్ద 'అప్పు' భారాన్ని తీర్చుకోండి..
ముందుగా మీ ఒత్తిడికి కారణమైన పెద్ద అప్పుపై ఫోకస్ చేయండి. దానిని తీర్చుకునేందుకు కృషిచేయండి. మీ అప్పుల్లో ఏది ఎక్కువగా ఉందొ గుర్తించి, దానిని తగ్గించుకునేందుకు ప్లాన్ చేయండి. ఇలా చేస్తే.. పెద్ద అప్పు భారం నుంచి బయటపడతారు. మీ మనస్సు కాస్త కుదుటపడుతుంది.
లోన్ తీసుకోండి..
అప్పు తీర్చడం కోసం లోన్ తీసుకోండని అంటున్నారేంటి? అని అనుకుంటున్నారా? ఇక్కడ ఒక టిప్ ఉంది. మీకు వేరువేరుగా అప్పులు ఉన్నటైతే.. వాటిని ఒకేసారి క్లియర్ చేసేందుకు మరో లోన్ తీసుకోండి. అయితే.. ఆ లోన్‌పై వడ్డీ తక్కువగా ఉండాలన్న విషయం గుర్తుపెట్టుకోండి. దీనినే డెట్ కన్సాలిడేషన్ అంటారు. వేరువేరు లోన్స్‌ను వేరువేరుగా కట్టకుండా.. వాటిని ఒకే లోన్ తీర్చేసి, దానికి తక్కువ వడ్డీలు కట్టడం బెటర్ అని నిపుణులు చెబుతుంటారు.
ఇదీ చదవండి:- How to payoff car loan : మీ కారు లోన్‌ను 'స్మార్ట్'గా క్లియర్ చేసేయండి ఇలా..!
కొత్త లోన్లు ఆపేయండి..
సింగిల్ లోన్‌తో అప్పులన్నీ తీర్చేసిన తర్వాత.. ఇక ఇప్పట్లో కొత్తవి తీసుకోకుండా జాగ్రత్త పడండి. మీకు మీరు టైమ్ తీసుకోండి. మీ ఆర్థిక పరిస్థితులను లెక్కవేసుకోండి.
ఆదాయం పెరగాలి..
Tips to reduce loan burden : అప్పులు తీర్చుకోవాలంటే మీ ఆదాయం పెరగాలి. ఈ మధ్య చాలా మంది సెకండ్ ఇన్‌కమ్‌పై ఫోకస్ పెంచారు. మీకు ఏవైనా ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటే.. వాటితో డబ్బులు ఎలా సంపాదించుకోవాలో ప్లాన్ చేసుకోండి.
బడ్జెట్ ముఖ్యం..
ఆర్థికపరమైన విషయాల్లో 'బడ్జెట్' చాలా అవసరం. మన సంపాదన ఎంత, ఎంత ఖర్చు చేయాలి, ఎంత పొదుపు చేయాలి వంటివాటిపై పట్టు ఉండాలి. అప్పుడే డబ్బులు ఎటెళుతున్నాయి వంటి విషయాలపై అవగాహన ఉంటుంది. కాస్త సేవ్ చేసినా.. అప్పులు తీర్చుకోవచ్చు.
ఇక్కడే జీవనశైలిని మార్చుకోవాల్సి ఉంటుంది. విలాసవంతంగా ఉండటం కోసం సామర్థ్యానికి మించి ఖర్చు చేయడం, అప్పులు చేయడం అస్సలు మంచి విషయం కాదు.
పెట్టుబడలను ఉపయోగించుకోండి..!
Tips to reduce home loan burden : మీ అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయంటే.. మీ వద్ద ఉన్న పెట్టుబడులను ఉపయోగించుకోవడం బెటర్. ఉదాహరణకు.. మీ వద్ద పీపీఎఫ్ అకౌంట్ ఉంటే.. దానిపై (మూడేళ్ల తర్వాత) లోన్ తీసుకోవచ్చు. బ్యాలెన్స్‌పై గరిష్ఠంగా 25శాతం వరకు లోన్ లభిస్తుంది. లైఫ్ ఇన్ష్యూరెన్స్ పాలసీపైనా లోన్ దొరుకుతుంది. మీ వద్ద బంగారం ఉంటే.. దానిపైనా లోన్ లభిస్తుంది.
ఈ విధంగా మీరు మీ అప్పులను తీర్చుకుని, కాస్త ప్రశాంతతను పొందవచ్చు.
సంబంధిత కథనం