ఈ సెట్టింగ్స్​ ఆన్​లో ఉంటే మీ స్మార్ట్​ఫోన్​కి అదనపు భద్రత! దొంగతనానికి గురైనా డేటా సేఫ్​..-how to protect your android device from theft with googles powerful built in security features ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఈ సెట్టింగ్స్​ ఆన్​లో ఉంటే మీ స్మార్ట్​ఫోన్​కి అదనపు భద్రత! దొంగతనానికి గురైనా డేటా సేఫ్​..

ఈ సెట్టింగ్స్​ ఆన్​లో ఉంటే మీ స్మార్ట్​ఫోన్​కి అదనపు భద్రత! దొంగతనానికి గురైనా డేటా సేఫ్​..

Sharath Chitturi HT Telugu
Jan 13, 2025 08:10 AM IST

మీ ఆండ్రాయిడ్​ స్మార్ట్​ఫోన్​లోని గూగుల్​ థేఫ్ట్​ ప్రొటెక్షన్​ ఫీచర్​ గురించి మీకు తెలుసా? దీని వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సెట్టింగ్స్​లో కొన్ని మార్పులు చేస్తే మీ డివైజ్​కి అదనపు భద్రత లభిస్తుంది.

ఈ సెట్టింగ్స్​ ఆన్​లో ఉంటే మీ స్మార్ట్​ఫోన్​కి అదనపు భద్రత!
ఈ సెట్టింగ్స్​ ఆన్​లో ఉంటే మీ స్మార్ట్​ఫోన్​కి అదనపు భద్రత! (Google)

ఆండ్రాయిడ్​ స్మార్ట్​ఫోన్స్​లో చాలా సేఫ్టీ ఫీచర్స్​ ఉంటాయి. కానీ వీటి గురించి మనకి తెలియకపోవడం సమస్య! ఈ ఫీచర్స్​ మనకి చాలా రకలుగా ఉపయోగపడతాయి. మరీ ముఖ్యంగా గూగుల్​ థెఫ్ట్​ ప్రొటెక్షన్​తో మీ స్మార్ట్​ఫోన్​, అందులోని డేటా చాలా సేఫ్​గా ఉంటుంది. రిమోట్​ లాకింగ్​, ట్రాకింగ్​, డేటా ప్రొటెక్షన్​ వంటి ఫీచర్లతో కూడిన గూగుల్​ థెఫ్ట్​ ప్రొటెక్షన్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

yearly horoscope entry point

గూగుల్ థెఫ్ట్ ప్రొటెక్షన్ అంటే ఏంటి?

గూగుల్ థెఫ్ట్ ప్రొటెక్షన్ అనేది మీ పరికరం దొంగతనానికి గురైతే మీ వ్యక్తిగత డేటాను రక్షించడానికి రూపొందించిన సేఫ్టీ సర్వీస్​. ఆండ్రాయిడ్ 10, ఆపైన వర్షెన్​లో లభ్యమయ్యే ఈ సర్వీస్​.. ఫోన్ దొంగతనం జరిగినప్పుడు మీ స్మార్ట్​ఫోన్​ను సురక్షితంగా ఉంచే విధంగా అనేక ఫీచర్లను అందిస్తుంది.

థెఫ్ట్​ ప్రొటెక్షన్​ని ఇలా యాక్టివేట్​ చేయండి..

  1. మీ స్మార్ట్​ఫోన్​లో సెట్టింగ్స్ యాప్ ఓపెన్ చేయండి.
  2. కిందకు స్క్రోల్ చేయండి. సెక్యూరిటీ అండ్​ ప్రైవసీ ఆప్షన్​ మీద ట్యాప్ చేయండి.
  3. భద్రతా సెట్టింగ్​ల కింద డివైజ్​ అన్​లాక్ ఆప్షన్​ని ఎంచుకోండి.
  4. డివైజ్​ అన్​లాక్ సెక్షన్​లో, థెఫ్ట్ ప్రొటెక్షన్ మీద క్లిక్​ చేయండి.
  5. ఇందులో థెఫ్ట్ డిటెక్షన్ లాక్, ఆఫ్​లైన్ డివైజ్ లాక్, రిమోట్ లాక్, ఫైండ్ మై డివైజ్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి.
  6. ఈ ఫీచర్లను టాగ్లింగ్ చేయడం ద్వారా వాటిని ఎనేబుల్ చేయండి. అదనపు రక్షణ కోసం, వినియోగదారులు బయోమెట్రిక్ డేటాను ఉపయోగించి ధృవీకరించాలి.

గూగుల్ థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్లు:

  1. థెఫ్ట్ డిటెక్షన్ లాక్: ఎవరైనా మీ స్మార్ట్​ఫోన్​ని దొంగిలించడానికి ప్రయత్నించడం వంటి అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించినప్పుడు ఈ ఫీచర్ మీ ఫోన్​ను ఆటోమేటిక్​గా లాక్ చేస్తుంది.
  2. ఆఫ్​లైన్ డివైజ్ లాక్: ఈ ఆప్షన్.. మీ స్మార్ట్​ఫోన్ స్క్రీన్ ఆఫ్​లైన్​లోకి వెళ్లగానే ఆటోమేటిక్​గా లాక్ అవుతుంది. నెట్​వర్క్ కనెక్షన్ పోయినా పరికరం సురక్షితంగా ఉండేలా చూస్తుంది.
  3. రిమోట్ లాక్: రిమోట్ లాక్​తో, మీరు android.com/lock సందర్శించడం ద్వారా మీ పరికరాన్ని రిమోట్​గా లాక్ చేయవచ్చు. డివైజ్​ ఆన్​లైన్​లో ఉన్నప్పుడు మాత్రమే ఇది పనిచేస్తుంది! కానీ ఫోన్ ఆఫ్​లైన్​లోకి వెళితే, అది తిరిగి కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్​గా లాక్ అవుతుంది.
  4. ఫైండ్​ అండ్​ ఎరేజ్​ డివైజ్​ :ఫీచర్ ఫైండ్ మై డివైజ్ నెట్​వర్క్​కు లింక్ చేస్తుంది. యాక్టివేట్ అయిన తర్వాత, ఇది మీ పరికరం దొంగతనానికి గురైతే మొత్తం డేటాను రిమోట్​గా తుడిచివేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. సున్నితమైన సమాచారాన్ని సురక్షితంగా ఉంచుతుంది.

ఇది తెలుసుకోండి..

"మీ డివైజ్ వై-ఫై లేదా బ్లూటూత్​కు కనెక్ట్ చేసి ఉంటే థెఫ్ట్ డిటెక్షన్ లాక్ యాక్టివేట్ కాకపోవచ్చు," అని గూగుల్ సపోర్ట్ డాక్యుమెంట్స్ సూచిస్తున్నాయి. బ్లూటూత్ యాక్ససరీలను తరచుగా ఉపయోగించే వినియోగదారులకు ఇది సమస్యాత్మకంగా ఉంటుంది. అదనంగా, అనేక క్విక్​-లాక్ ప్రయత్నాలు ఉంటే థెఫ్ట్ డిటెక్షన్ లాక్ నిలిచిపోతుంది.

Whats_app_banner

సంబంధిత కథనం