Port Your SIM : జియో, ఎయిర్‌టెల్, వీఐ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు మీ సిమ్ మార్చుకోవడం ఎలా?-how to port your sim from jio airtel or vi to bsnl a step by step guide know in details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Port Your Sim : జియో, ఎయిర్‌టెల్, వీఐ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు మీ సిమ్ మార్చుకోవడం ఎలా?

Port Your SIM : జియో, ఎయిర్‌టెల్, వీఐ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌కు మీ సిమ్ మార్చుకోవడం ఎలా?

Anand Sai HT Telugu

BSNL SIM porting guide : ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇటీవల టారిఫ్ పెంచిన నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్‌కు మారాలని ఆలోచిస్తున్నారు. మీ జియో, ఎయిర్టెల్ లేదా విఐ సిమ్‌ను బీఎస్ఎన్ఎల్‌కు పోర్ట్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది.

బీఎస్ఎన్ఎల్ కు సిమ్ మార్చడం ఎలా? (REUTERS)

ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఎయిర్టెల్, జియో, విఐ (వొడాఫోన్ ఐడియా) ఇటీవల టారిఫ్ పెంచాయి. దీంతో సోషల్ మీడియాలో వాటిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అంతేకాదు చాలా మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారిపోవాలని అనుకున్నారు. మీరు మీ సిమ్ కనెక్షన్‌ను బీఎస్ఎన్ఎల్‌కు పోర్ట్ చేయాలని ఆలోచిస్తుంటే.. కింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

స్టెప్ 1: యూనిక్ పోర్టింగ్ కోడ్ (యుపీసీ) పొందడానికి మెసేజెస్ ఓపెన్ చేయాలి. అందులో పోర్ట్ అని టైప్ చేసి.. మీ 10-అంకెల మొబైల్ నంబర్ టైప్ చేయండి. ఈ సందేశాన్ని 1900కు పంపండి. దీనికి రిప్లైగా మీరు యూనిక్ పోర్టింగ్ కోడ్ (యుపీసీ) అందుకుంటారు. మీరు జమ్మూ కాశ్మీర్లో ప్రీపెయిడ్ మొబైల్ సబ్‌స్క్రైబర్ అయితే, మీరు టెక్స్ట్ సందేశం పంపడానికి బదులుగా 1900 కు కాల్ చేయాలి.

యుపీసీ సాధారణంగా 15 రోజులు లేదా మీ నంబర్‌ను మరొక ఆపరేటర్‌కు పోర్ట్ చేసే వరకు చెల్లుబాటు అవుతుంది. అయితే, జమ్మూ కాశ్మీర్, అస్సాం, ఈశాన్యంలోని ఎంపిక చేసిన ప్రాంతాలలో కస్టమర్లు యుపీసీ 30 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. మీ ప్రస్తుత టెలికాం ప్రొవైడర్ వద్ద ఉన్న అన్ని బకాయిలు క్లియర్ చేయాలి.

స్టెప్ 2 : బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సందర్శించండి. మీకు యుపీసీ వచ్చిన తర్వాత, పోర్టింగ్‌ను అభ్యర్థించడానికి సమీపంలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్ వెళ్లాలి. రిటైలర్ దగ్గరకు కూడా వెళ్లవచ్చు. సర్వీస్ సెంటర్ వద్ద, మీరు వీటిని చేయాల్సి ఉంటుంది.

1. కస్టమర్ అప్లికేషన్ ఫారం (సిఎఎఫ్) నింపండి.

2. చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి, చిరునామా ఇవ్వండి.

3. మీ ప్రస్తుత ఆపరేటర్ నుండి అందుకున్న యుపీసీని సబ్మిట్ చేయండి.

4. పోర్టింగ్ ఫీజు చెల్లించండి (ప్రస్తుతం పోర్టింగ్ కోసం ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది.).

దశ 3 : పోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయండి

అవసరమైన పత్రాలు, ఫారాలను సమర్పించిన తర్వాత మీకు కొత్త బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డు ఇస్తారు. మీ పాత సిమ్ ఎప్పుడు డీయాక్టివేట్ అవుతుందో, కొత్త బీఎస్ఎన్ఎల్ సిమ్ ఎప్పుడు యాక్టివ్ అవుతుందో తెలియజేస్తూ మీకు మెసేజ్ వస్తుంది. నిర్ణీత సమయంలో, ప్రక్రియను పూర్తి చేయడానికి మీ పాత సిమ్ తీసేసి.. కొత్త బీఎస్ఎన్ఎల్ సిమ్ ఫోన్‌లో వేసుకోవాలి.

ఎయిర్టెల్, జియో లేదా విఐ నుండి బీఎస్ఎన్ఎల్‌కు మారడం అనేది యుపీసీని పొందడం, బిఎస్ఎన్ఎల్ సేవా కేంద్రాన్ని సందర్శించడం, పేపర్ వర్క్ పూర్తి చేయడం ద్వారా కంప్లీట్ అవుతుంది. ఈ దశలను అనుసరించడం ద్వారా పెరిగిన టారిఫ్ భారం లేకుండా మీరు బీఎస్ఎన్ఎల్‌తో మొబైల్ సేవలను ఆస్వాదించడం కొనసాగించవచ్చు.