కొవిడ్ సంక్షోభం తర్వాత దేశంలోని చాలా మందికి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్‌పై ఆసక్తి పెరిగింది. డబ్బులు ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎలా ట్రేడ్ చేయాలి? అని సొంతంగా తెలుసుకుని అమలు చేస్తున్నారు. అయితే, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలన్నా, ట్రేడింగ్ చేయలన్నా.. డీమ్యాట్ అకౌంట్ ఉండాల్సిందే. మరి మీరు కొత్తగా స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుంటే.. ఒక డీమ్యాట్ కచ్చితంగా తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఇండియాలో లీడింగ్ బ్రోకరేజ్ సంస్థ జెరోధాలో డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? ఏ డాక్యుమెంట్స్ సమర్పించాలి? వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
భారతీయులకు అత్యంత నమ్మదగిన బ్రోకరేజ్ సంస్థల్లో జెరోధా ఒకటి. 2025 నాటికి జెరోధాకు 7.96 మిలియన్ మంది యూజర్లు ఉన్నట్టు సమాచారం. కస్టమర్స్‌ని సంతృప్తి పరిచేందుకు ఇండస్ట్రీలోనే బెస్ట్ సేవలు, బెస్ట్ ఫీచర్లను తీసుకొస్తుంటుంది జెరోధా. నికిల్ కామత్- నితిన్ కామత్‌లు ఈ సంస్థను నడుపుతున్నారు.
షేర్లు కొని- అమ్మేందుకు ఉపయోగపడే సాధనాన్ని డీమ్యాట్ అకౌంట్ అంటారు. ఇప్పుడు ఈ తరహా అకౌంట్స్‌లో ఈటీఎఫ్‌లు, మ్యూచువల్ ఫండ్స్‌ని కూడా మెయిన్టైన్ చేయగలిగే ఆప్షన్స్ వచ్చాయి.
జెరోధా అధికారిక వెబ్సైట్ (zerodha.com) కి వెళ్లండి. మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి సైన్-అప్ నౌ అనే ఆప్షన మీద క్లిక్ చేయండి.
2. పాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
3. ఆ తర్వాత, కనెక్ట్ టు డిజీలాకర్ మీద క్లిక్ చేయండి. సైన్ ఇన్ అవ్వండి.
4. జెరోధాకి కూడా డిజీలాకర్ యాక్సెస్ ఇవ్వండి. మీ ఆధార్ కార్డు కాపీని షేర్ చేయండి.
5. ఆధార్ వివరాలను వెరిఫై చేసుకోండి.
6. బ్యాంక్ డీటైల్స్, అడ్రెస్ సహా మీ పర్సనల్ వివరాలను ఇవ్వండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
7. మీకు ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని పేపర్ మీద రాసి.. ఐపీవీ (ఇన్-పర్సన్ వెరిఫికేషన్) కోసం స్క్రీన్‌కి చూపించింది.
8. జెరోధాకి వెబ్‌క్యామ్ యాక్సెస్ ఇవ్వండి. ఐపీవీ ప్రక్రియను పూర్తి చేయండి. క్యాప్చర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
9. పైన చెప్పిన డాక్యుమెంట్స్ సాఫ్ట్ కాపనీ అప్లోడ్ చేయండి. ఆధార్ ఆధారిత ఈ-సైన్ చేయండి.
10. ఈ-సైన్ ఈక్విటీ మీద క్లిక్ చేస్తే ఎన్ఎస్డీఎల్ సైట్ ఓపెన్ అవుతుంది.
11. మీ ఈమెయిల్ ఐడీ వెరిఫై చేసుకోండి.
12. అకౌంట్ ఓపెనింగ్ ఫామ్‌ని వెరిఫై చేయండి. సైన్ నౌ మీద క్లిక్ చేయండి.
13. మీ ఆధార్ నెంబర్, ఓటీపీ ఎన్ఎస్డీఎల్ వెబ్సైట్లో ఫిల్ చేయండి. సబ్మీట్పై క్లిక్ చేయండి.
జెరోధా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది. సాధారణంగా 72 గంటలలోపు ఈ ప్రాసెస్ పూర్తవుతుంది.
జెరోధా గతంలో డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జీలు వసూలు చేసేది. కానీ ఇప్పుడు ఎలాంటి ఛార్జీలు కలెక్ట్ చేయడం లేదు.
సంబంధిత కథనం