కారు కొనడం ఒక సంతోషకరమైన అనుభవం. కానీ ఆ కారును మంచి స్థితిలో ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. కారు నిర్వహణ కొన్నిసార్లు పెద్ద పనిలా అనిపించవచ్చు, కానీ కొన్ని సులభమైన పద్ధతులు పాటించడం ద్వారా మీ కారును మరింత సమర్థవంతంగా, సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా నడపవచ్చు. ప్రతి కారు యజమాని లక్ష్యం కూడా ఇదే కదా!
మీరు, మీ కుటుంబం మీ కారు నుండి ఉత్తమ ఫలితాన్ని పొందడానికి ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి:
టైర్లు: మీ కారు రోడ్డుపై మంచి పట్టు కలిగి ఉండాలంటే టైర్లను సరిగ్గా చూసుకోవాలి. మీ ప్రాంతానికి తగిన టైర్ రేటింగ్ ఉన్నాయో లేదో చూసుకోండి. మంచి నమ్మకమైన కంపెనీ టైర్లను ఎంచుకోండి. డ్రైవింగ్ చేసే విధానం, వేడి, రోడ్డు ఎలా ఉంది, కారు బరువు వంటి వాటిని బట్టి టైర్ల జీవితకాలం 40,000 నుండి 80,000 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు.
ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు): ఈ వాహనాలు ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేస్తాయి మరియు సాధారణ కార్ల కంటే బరువుగా ఉంటాయి. కాబట్టి వీటి టైర్ల జీవితకాలం కొంచెం తక్కువగా ఉండవచ్చు. మీ కారులో ఎల్లప్పుడూ ఒక ప్రాథమిక టైర్ ప్రెషర్ గేజ్ మరియు పంక్చర్ కిట్‌ను ఉంచుకోండి.
ముందు లేదా వెనుక చక్రాల ద్వారా నడిచే కార్లు (Front or Rear Wheel Drive Cars): సాధారణంగా మనం రోడ్డుపై చూసే చాలా కార్లు ఈ రకానికి చెందినవే. వీటి టైర్లను వాటి జీవితకాలంలో ఒకసారి ముందువి వెనక్కి, వెనకవి ముందుకి మార్చుకోవచ్చు. దీనివల్ల టైర్లు సమానంగా అరిగి ఎక్కువ కాలం మన్నుతాయి.
పెర్ఫార్మెన్స్ కార్లు (Performance Cars): ఇవి వేగంగా ప్రయాణించడానికి, మంచి కంట్రోల్ కోసం ప్రత్యేకంగా తయారు చేసిన కార్లు. వీటిలో ముందు చక్రాలకు ఒక సైజులో, వెనుక చక్రాలకు వేరే సైజులో టైర్లు ఉంటాయి. ఇలాంటి కార్లలో టైర్లను మార్చడం వల్ల వాటి పనితీరు దెబ్బతినే అవకాశం ఉంది. ఇంజిన్ పవర్, కంట్రోల్ సిస్టమ్స్ ఆయా టైర్ల సైజులకు అనుగుణంగా డిజైన్ చేయబడి ఉంటాయి. టైర్ల సైజులు మారితే కార్ల బ్యాలెన్స్, డ్రైవింగ్ అనుభవం మారవచ్చు. కాబట్టి, సాధారణ కార్లలో టైర్లను అటూఇటూ మార్చుకోవచ్చు, కానీ ప్రత్యేకమైన పనితీరు గల కార్లలో ఇది మంచిది కాదు.
మీ కారు బ్యాటరీ టెర్మినల్స్ ఎల్లప్పుడూ శుభ్రంగా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి. కారును చల్లని మరియు పొడి ప్రదేశంలో పార్క్ చేయడం మంచిది. మీరు కారును తరచుగా ఉపయోగించకపోతే, బ్యాటరీ చార్జ్ అలాగే ఉండేందుకు ప్రతి వారం ఇంజిన్‌ను కొద్దిసేపు స్టార్ట్ చేయండి.
మీ కారు మ్యాన్యువల్‌ను జాగ్రత్తగా చదవండి. దానిలో చెప్పిన విధంగా ఇంజిన్ ఆయిల్, ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్, బ్రేక్ ఫ్లూయిడ్ మరియు కూలెంట్‌ను సమయానికి మార్చండి.
సాధారణంగా, ఖనిజ లేదా సింథటిక్ ఇంజిన్ ఆయిల్‌ను ప్రతి 15,000 కిలోమీటర్లకు లేదా అంతకంటే ముందే మార్చడం మంచిది.
సాంప్రదాయ ఆకుపచ్చ కూలెంట్‌ను ప్రతి 50,000 కిలోమీటర్లకు లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి మార్చాలి.
అలాగే, ప్రతి 15,000 కిలోమీటర్లకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్‌ను మార్చండి. మీరు ఎక్కువ దుమ్ము ఉండే ప్రాంతంలో నివసిస్తుంటే, ప్రతి 10,000 కిలోమీటర్లకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్‌ను మార్చడం మంచిది. మీ కారు మ్యాన్యువల్‌లో ఇచ్చిన సర్వీస్ షెడ్యూల్‌ను ఎల్లప్పుడూ పాటించండి.
PPF (Paint Protection Film): ఇది చాలా ఖరీదైన పెయింట్ ఉన్న లగ్జరీ కార్లకు మాత్రమే అవసరం. కారు నడుస్తున్నప్పుడు చిన్న రాళ్ళు లేదా గులకరాళ్ళ వల్ల గీతలు పడకుండా ఇది కాపాడుతుంది. ఇది వాహనం పెయింట్ చేసిన ఉపరితలంపై వేసే ఒక స్పష్టమైన పాలియురేతేన్ ఫిల్మ్. ఇది గీతలు, రాళ్ళు మరియు ఇతర నష్టాల నుండి రక్షణ కల్పిస్తుంది.
టెఫ్లాన్ కోటింగ్: ఇది తక్కువ ఖర్చుతో కూడుకున్నది మరియు సుమారు 4-6 నెలల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఇది చిన్న గులకరాళ్ళు మరియు UV కిరణాల నుండి రక్షణను అందిస్తుంది. దీనికి దాదాపు ₹5,000 నుండి ₹9,000 వరకు ఖర్చవుతుంది మరియు ప్రతి 5-6 నెలలకు ఒకసారి చేయించుకోవాలి.
సెరామిక్ కోటింగ్: ఇది ₹15,000 నుండి ₹50,000 వరకు ఉంటుంది మరియు మంచి మధ్యస్థ ఎంపిక. ఇది టెఫ్లాన్ కోటింగ్ కంటే ఖరీదైనది అయినప్పటికీ, చాలా ఎక్కువ కాలం మన్నుతుంది. దీనికి ప్రొఫెషనల్ ఇన్‌స్టాలేషన్ అవసరం లేదు.
మీరు సరిగ్గా వింటున్నారు. ఎయిర్ కండిషనర్ సిస్టమ్‌లు తరచుగా ఉపయోగించడానికి రూపొందినవే. వాటిని ఉపయోగించకపోవడం వల్ల కాలక్రమేణా రిఫ్రిజెరంట్ గ్యాస్ లీక్ అయ్యే అవకాశం ఉంది.
ACని ఆపి, చల్లదనం కోసం విండోస్ తెరవడం ఖర్చు ఆదా చేసేలా అనిపించవచ్చు, కానీ కిటికీలు తెరవడం వల్ల గాలి నిరోధం పెరిగి కారు ఇంధన సామర్థ్యం తగ్గుతుంది. దీనివల్ల మీరు ఇంధనం కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది.
స్పార్క్ ప్లగ్‌లను ప్రతి 20,000 కిలోమీటర్లకు ఒకసారి మార్చాలి. అవి ప్లాటినం లేదా ఇరిడియం స్పార్క్ ప్లగ్‌లు అయితే 100,000 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు.
ఏ భాగాన్ని ఏ సమయంలో మార్చాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ విండ్‌షీల్డ్ వైపర్ల స్థితిని వాటి పనితీరును బట్టి లేదా అవి చేసే శబ్దం ద్వారా (వేడి మరియు పొడి వాతావరణం వైపర్ బ్లేడ్లను త్వరగా అరిగిపోయేలా చేస్తుంది) తెలుసుకోవచ్చు.
బ్రేక్ డిస్క్, ప్యాడ్ సెటప్‌ను జాగ్రత్తగా అంచనా వేయాలి. బ్రేక్ ప్యాడ్లు సాధారణంగా 40,000 కిలోమీటర్ల వరకు మన్నుతాయి. నెమ్మదిగా డ్రైవింగ్ చేస్తే ఇంకా ఎక్కువ కాలం వస్తాయి.
బ్రేక్ పెడల్ ప్రయాణం, బ్రేకింగ్ యొక్క ప్రభావాన్ని బట్టి బ్రేక్ ప్యాడ్ల స్థితిని ఎల్లప్పుడూ అంచనా వేయండి. బ్రేక్ డిస్క్‌లు కొంచెం ఖరీదైనవి, కానీ చాలా ఎక్కువ కాలం మన్నుతాయి.
ఇవి మీ కారును జాగ్రత్తగా చూసుకోవడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు. వీటిని పాటించడం ద్వారా మీ కారు ఎక్కువ కాలం మన్నుతుంది. మీకు మంచి డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
- పార్థ్ చరణ్, స్వతంత్ర ఆటోమోటివ్ జర్నలిస్ట్
(గత 12 సంవత్సరాలుగా కార్లు, మోటార్ సైకిళ్లు మరియు ఆటోమోటివ్ పరిశ్రమపై కథనాలు రాస్తున్నారు. ఆయన ముంబైలో నివసిస్తున్నారు.)
సంబంధిత కథనం