Second Hand Car Tips : ఇలా చేస్తే సెకండ్ హ్యాండ్ కారును చూసి కొత్త కారు కొన్నారా అని అడుగుతారు
Second Hand Car Tips : సెకండ్ హ్యాండ్ కారును మెయింటెన్ చేయాలంటే చాలా పెద్ద పని. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే ఇది కూడా కొత్త కారులా మెరిసిపోతుంది. అందుకోసం ఈ చిట్కాలు పాటించాలి. అవేంటో చూద్దాం..

చాలా మందికి సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కోవడం అలవాటు. బడ్జెట్ కావొచ్చు, ఇతర కారణాలతో ఈ పని చేస్తారు. దానిని కూడా చాలా బాగు చూసుకుంటారు కొందరు. మరికొందరేమో సరిగా పట్టించుకోరు. అయితే దీనిని కొత్త కారులా మెయింటెన్ చేయాలంటే కొన్ని చిట్కాలు ఉన్నాయి. అలా చేస్తే మీ సెకండ్ హ్యాండ్ కారు కూడా కొత్త కారులా కనిపిస్తుంది. సెకండ్ హ్యాండ్ కారు కదా అని నిర్వహణ ఖర్చులు పెద్దగా పెట్టరు. కానీ ఇది కరెక్ట్ కాదు. పాత లేదా సెకండ్ హ్యాండ్ కారును మెయింటెయిన్ చేయడంలో సహాయపడే కొన్ని ట్రిక్స్ తెలుసుకుందాం..
కారు లోపల అన్నింటిని క్రమం తప్పకుండా చెక్ చేయడం అవసరం. సాధారణంగా చాలామంది వాహనంలోని ఇంజిన్ ఆయిల్‌ను సమయానికి మార్చుకుంటారు. అయితే బ్రేక్ ఆయిల్, స్టీరింగ్ ఆయిల్, కూలెంట్, ట్రాన్స్‌మిషన్ ఆయిల్‌ను జాగ్రత్తగా చూసుకోవడం మర్చిపోతారు. వీటిని కూడా ఎప్పటికప్పుడు మెయింటెన్ చేయాలి.
కారును సమయానికి సర్వీస్ చేయడం చాలా అవసరమైన పని. ఇలా చేస్తే వాహనం ఎక్కువ కాలం వస్తుంది. తర్వాత మీరు ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు. సర్వీస్ రికార్డులను మెయింటెన్ చేయండి. ఇది కారు విక్రయం, దాని పరిస్థితి గురించి తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది. ఏదో బుద్ధిపుట్టినప్పుడు సర్వీస్ చేయిస్తానంటే కుదరదు. క్రమం తప్పకుండా చేయించాలి.
కారు నడుపుతున్నప్పుడు అది మైనర్ వేర్ అండ్ టియర్‌ని కూడా చూపుతుంది. అటువంటి పరిస్థితిలో వాహనం సకాలంలో మరమ్మతులు చేయడం అవసరం. ఉదాహరణకు మీరు సరిగాలేని క్లచ్‌తో డ్రైవ్ చేస్తే అది ఇంజిన్‌పై కూడా ప్రభావం చూపుతుంది. అంతే కాకుండా బ్రేకులు, టైర్లు, సస్పెన్షన్, విండ్‌షీల్డ్, లైట్లు వంటి ముఖ్యమైన వాటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.
ఇంజిన్ సామర్థ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో ఎయిర్ ఫిల్టర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కారు కంపెనీ పేర్కొన్న సమయానికి అనుగుణంగా కారు ఎయిర్ ఫిల్టర్‌ను క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండండి. సమయం వచ్చినప్పుడు దాన్ని శుభ్రం చేయండి.. లేదా కొత్తది మార్చండి.
కారు సామర్థ్యం, పనితీరులో టైర్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. సరైన టైర్ ఒత్తిడిని కలిగి ఉండటం చాలా ముఖ్యం. దీని కోసం కంపెనీలు యూజర్ మాన్యువల్‌లో అవసరమైన సూచనలను రాస్తాయి. అవి చదవండి. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు టైర్ పంక్చర్ అవ్వకుండా చూసుకోవడానికి, దాన్ని క్రమం తప్పకుండా చెక్ చేయాలి. మీ కారు టైర్లను సరిగ్గా చూసుకోవడం వలన మీరు సురక్షితమైన ప్రయాణంతో వెళ్లవచ్చు. నాలుగు టైర్లను జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు, స్పేర్ వీల్‌ను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోండి.
టాపిక్