మీరు రూ. 5 లక్షల వరకు ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ కోసం చూస్తున్నట్లయితే, సాంకేతిక పురోగతితో ఇప్పుడు వేగంగా, సులభంగా రుణం పొందవచ్చు. అయితే, రుణాన్ని అందించే సంస్థలు సూచించిన కొన్ని ముఖ్యమైన పత్రాలను సమర్పించడం, ప్రాథమిక అర్హత ప్రమాణాలను తీర్చడం తప్పనిసరి. అనేక బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు) ఇప్పుడు తక్కువ పత్రాలతో, వేగంగా డిజిటల్ పద్ధతిలో రుణాలను మంజూరు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పర్సనల్ లోన్‌కి కావాల్సిన డాక్యుమెంట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
పర్సనల్ లోన్లు అనేవి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అందించే అన్‌సెక్యూర్డ్ క్రెడిట్‌లు. ఇవి వైద్య ఖర్చులు, విద్య, ప్రయాణం లేదా అప్పులను క్రమబద్ధీకరించడం వంటి తక్షణ అవసరాలను తీర్చడానికి ఉపయోగపడతాయి. ఈ వ్యక్తిగత రుణాలకు ఎలాంటి హామీ (కొలేటరల్) అవసరం లేదు. అవసరమైన పత్రాలు సమర్పించినట్లయితే నిధుల పంపిణీ త్వరగా జరుగుతుంది. అంతేకాకుండా, ఆదాయం, క్రెడిట్ స్కోర్, గత చెల్లింపు చరిత్ర, సమర్పించిన పత్రాలు వంటి అంశాల ఆధారంగా రుణ అర్హత నిర్ణయిస్తారు.
రుణాన్ని అందించే సంస్థలు మీ గుర్తింపును, ఆదాయ స్థిరత్వాన్ని, రుణ దరఖాస్తుదారుని ప్రామాణికతను, అలాగే రుణగ్రహీత తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని ధృవీకరించడానికి డాక్యుమెంట్స్‌ని ఉపయోగిస్తాయి. పత్రాలను సరిగ్గా సమర్పించడం వల్ల నిబంధనలకు కట్టుబడి ఉన్నారని నిర్ధారిస్తుంది, వేగవంతమైన ఆమోదాలకు సహాయపడుతుంది. మెరుగైన రుణ నిబంధనలను పొందేందుకు తోడ్పడుతుంది.
శాలరీ స్లిప్‌లు - బ్యాంక్ స్టేట్‌మెంట్లు: రుణదాతలు సాధారణంగా చివరి 3-6 నెలల శాలరీ స్లిప్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్లను అడుగుతారు. యాక్సిస్ బ్యాంక్ 3 నెలల శాలరీ స్లిప్‌లు, స్టేట్‌మెంట్‌లు, ఫారం 16ను కోరుతుంది. కోటక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌సర్వ్ వంటివి కూడా ఇలాంటి నిబంధనలనే పాటిస్తాయి.
కేవైసీ ప్రూఫ్: పర్సనల్ లోన్ కోసం చాలా బ్యాంకులు పాన్, ఆధార్‌లను ప్రామాణిక ఐడీ, చిరునామా రుజువుగా అంగీకరిస్తాయి. బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి రుణదాతల ప్రకారం, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ప్రత్యామ్నాయాలు కూడా చెల్లుబాటు అవుతాయి.
ఉద్యోగ- చిరునామా రుజువు: జీతం పొందే దరఖాస్తుదారులు ఉద్యోగి ఐడీ లేదా అపాయింట్‌మెంట్ లెటర్‌ను సమర్పించాలి. యాక్సిస్ బ్యాంక్ ప్రకారం, చిరునామా రుజువులో యుటిలిటీ బిల్లులు (చివరి 3 నెలలు), లీజు ఒప్పందం లేదా పాస్‌పోర్ట్ ఉంటాయి.
డిజిటల్ కేవైసీ: నింపిన లోన్ ఫారం, పాస్‌పోర్ట్-సైజ్ ఫోటో, డిజిటల్/వీడియో కేవైసీ తప్పనిసరి. యాక్సిస్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ వంటివి తక్షణ ధృవీకరణతో పేపర్‌లెస్ ఆన్‌బోర్డింగ్‌ను అందిస్తాయి.
ఐటీఆర్‌లు సమర్పించండి: స్వయం ఉపాధి పొందే రుణగ్రహీతలు 1-2 సంవత్సరాల ఐటీఆర్‌లు లేదా ఆడిట్ చేసిన ఆర్థిక పత్రాలు, వ్యాపార స్థిరత్వాన్ని నిరూపించడానికి బ్యాంక్ స్టేట్‌మెంట్లను (బజాజ్ ఫిన్‌సర్వ్, కోటక్) అందించాలి.
అన్ని పత్రాలు సిద్ధంగా ఉన్నట్లయితే, బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి రుణ సంస్థలు ఐదు నిమిషాల లోపే రుణాన్ని ఆమోదించి, అదే రోజున పర్సనల్ లోన్ మొత్తాన్ని పంపిణీ చేస్తాయి! ఇదే పద్ధతిలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్యాంకులు కూడా ఆన్‌లైన్ దరఖాస్తు చేసిన కొన్ని గంటల్లోనే నిధులను పంపిణీ చేస్తాయి.
చివరి 3 నుంచి 6 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్లు.
శాలరీ స్లిప్‌లు (3 నెలలు) + ఫారం 16.
పాన్ + ఆధార్/పాస్‌పోర్ట్/ఓటర్ ఐడీ.
ఉద్యోగ రుజువు.
చిరునామా రుజువు (యుటిలిటీ బిల్లు/లీజు/పాస్‌పోర్ట్).
దరఖాస్తు ఫారం, ఫోటో & డిజిటల్ కేవైసీ.
ఖచ్చితమైన పత్రాలు రుణ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేస్తాయి. అధిక క్రెడిట్ స్కోర్లు (అంటే 730+ స్కోర్లు), స్థిరమైన ఆదాయం ఉన్నవారు తక్కువ వడ్డీ రేట్లతో, వేగవంతమైన వ్యక్తిగత రుణ ప్రాసెసింగ్ నుంచి ప్రయోజనం పొందుతారు. అందుకే, మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను క్లీన్‌గా ఉంచుకోవడం, క్రెడిట్ స్కోర్‌ను అధికంగా ఉంచుకోవడం, అవసరమైనప్పుడు తక్కువ సమయంలో రుణాలను పొందడానికి మీ పత్రాలన్నింటినీ సరిగ్గా అమర్చుకోవడం ముఖ్యం.
సంబంధిత కథనం