ీరు ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) వినియోగదారు అయితే.. ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన విషయం ఛార్జింగ్ స్టేషన్ ఉండటం. కలిసి వచ్చే విషయం ఏమిటంటే.. గూగుల్ మ్యాప్స్ ఈ పనిని చాలా సులభతరం చేస్తుంది. మీరు చాలా త్వరగా మీ సమీప ఈవి ఛార్జింగ్ స్టేషన్‌ను కనుగొనవచ్చు. అదెలా చేయాలో తెలుసుకుందాం.
ముందుగా మీ స్మార్ట్ ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయండి. మీ ఫోన్లో ఈ యాప్ లేకపోతే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పైన సెర్చ్ బాక్స్‌లో 'ఈవీ ఛార్జింగ్ స్టేషన్' అని టైప్ చేసి సెర్చ్ చేయండి.
మీరు సెర్చ్ చేసినప్పుడు గూగుల్ మ్యాప్స్ మీ స్థానం ఆధారంగా సమీపంలోని అన్ని ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల లిస్ట్, మ్యాప్ వ్యూను చూపిస్తుంది. మీరు కావాలనుకుంటే ఫిల్టర్లను ఉపయోగించవచ్చు. ఉదాహరణకు ఏ స్టేషన్లు ఇంకా తెరిచి ఉన్నాయి. లేదా ఏ రకమైన ఛార్జర్ (ఉదా : సీసీఎస్, టైప్ 2, సిహెచ్ఎడీఎంఓ) అందుబాటులో ఉంది. లేదా ఏ స్టేషన్లు ఉచితం అనేది కూడా మ్యాప్స్ ద్వారా కనుగొనవచ్చు.
స్టేషన్ పేరు యూజర్ రేటింగ్, రివ్యూ ఛార్జింగ్ స్పీడ్ (ఫాస్ట్/నార్మల్) ఛార్జింగ్ నెట్ వర్క్ (టాటా పవర్, ఏథర్ గ్రిడ్, స్టాటిక్ మొదలైనవి) స్టార్ట్ డైరెక్షన్, నావిగేషన్ ఛార్జింగ్ స్టేషన్లలో ఒకదాన్ని ఎంచుకుని 'డైరెక్షన్స్' మీద ట్యాప్ చేయండి. అప్పుడు స్టార్ట్ నొక్కడం ద్వారా నావిగేషన్ ప్రారంభించవచ్చు. తర్వాత మీరు ఛార్జింగ్ స్టేషన్ దగ్గరకు వెళ్తారు.
మీరు దూరప్రయాణాలకు వెళుతున్నట్లయితే.. గూగుల్ మ్యాప్స్ లో మీ గమ్యాన్ని నమోదు చేయండి. ఆపై యాడ్ ఛార్జింగ్ స్టాప్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి. ఇది ఆటోమేటిక్‌గా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను దారిలో సూచనలుగా చూపిస్తుంది.