FAQs on 2,000 notes exchange: రూ. 2 వేల నోట్ల ఎక్స్ చేంజ్ పై అనుమానాలు - సమాధానాలు-how to exchange your 2 000 notes after rbi scraps circulation faqs answered ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  How To Exchange Your 2,000 Notes After Rbi Scraps Circulation: Faqs Answered

FAQs on 2,000 notes exchange: రూ. 2 వేల నోట్ల ఎక్స్ చేంజ్ పై అనుమానాలు - సమాధానాలు

HT Telugu Desk HT Telugu
May 19, 2023 09:33 PM IST

రూ. 2 వేల నోటును అక్టోబర్ 1వ తేదీ నుంచి చెలామణి నుంచి తొలగిస్తున్నట్లు ఆర్బీఐ చేసిన ప్రకటన ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో, రూ. 2 వేల నోట్ల ఎక్స్ చేంజ్ పై నెలకొన్న అనుమానాలను తీర్చే ప్రయత్నం ఆర్బీఐ చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT File)

FAQs on 2,000 notes exchange: 2016 నవంబర్ లో అప్పడు చెలామణిలో ఉన్న రూ. 1000, రూ. 500 నోట్లను తక్షణమే అమలయ్యేలా రద్దు చేస్తున్నట్లు (demontisation) ప్రధాని మోదీ (PM Modi) ప్రకటించారు. అప్పటి నగదు అవసరాల కోసం ఆ పెద్ద నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవడానికి కొంత సమయం ఇచ్చారు. అదే సమయంలో, కొత్తగా రూ. 500, రూ. 2000 వేల నోట్లను చెలామణిలోకి తీసుకువచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

FAQs on 2,000 notes exchange: సెప్టెంబర్ 30 లోపే..

తాజాగా, రూ. 2 వేల నోట్ల ( 2000 note) ను కూడా రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. సెప్టెంబర్ 30 తరువాత ఆ నోట్లు చెలామణిలో ఉండబోవని స్పష్టం చేసింది. ఈ లోపే బ్యాంకుల్లో వాటిని మార్చుకోవాలని సూచించింది. 2018-19 నుంచే రూ. 2 వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ నిలిపివేసింది. ఈ నేపథ్యంలో, రూ. 2 వేల నోట్ల ఎక్స్ చేంజ్ పై నెలకొన్న అనుమానాలకు ఆర్బీఐ ఇచ్చిన సమాధానాలివి..

  • బ్యాంక్ లో ఖాతా ఉన్నవారు తమ బ్యాంక్ ఖాతాలో ఈ రూ. 2 వేల ( 2000 note) నోట్లను సెప్టెంబర్ 30 డిపాజిట్ చేయవచ్చు.
  • బ్యాంక్ ఖాతా లేనివారు కూడా దగ్గర్లోని ఏదైనా బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను ఎక్స్ చేంజ్ చేసుకోవచ్చు.
  • బ్యాంక్ ఖాతాలో రూ. 2 వేల నోట్ల ( 2000 note) ను ఎంతమొత్తం లోనైనా డిపాజిట్ చేయవచ్చు. ఆ తరువాత, అవసరమైనంత మేరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ విత్ డ్రా కు గరిష్ట పరిమితి లేదు.
  • బ్యాంక్ లో ఖాతా లేనివారు మాత్రం ఒక పర్యాయం గరిష్టంగా రూ. 20 వేల వరకు మాత్రమే రూ. 2 వేల నోట్ల ( 2000 note) ను ఎక్స్ చేంజ్ చేసుకోవచ్చు.
  • బ్యాంక్ లో ఖాతా ఉన్నవారు కూడా ఒక పర్యాయం గరిష్టంగా రూ. 20 వేల వరకు రూ. 2 వేల నోట్ల ( 2000 note) ను ఎక్స్ చేంజ్ చేసుకోవచ్చు.
  • బ్యాంకులు, 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ఎక్స్ చేంజ్ చేసుకోవడానికి మే 23 వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు సమయం ఉంటుంది.
  • సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా రూ. 2 వేల నోట్లు చెలామణిలో ఉంటాయి. వాటితో నగదు లావాదేవీలు నిర్వహించవచ్చు.
  • బ్యాంక్ ఖాతాలో రూ. 2 వేల నోట్ల ( 2000 note) ను జమ చేసే సమయంలో Know Your Customer (KYC) నిబంధనలు వర్తిస్తాయి.
  • బ్యాంక్ ఏజెంట్లు, బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్లు కస్టమర్లకు రోజుకు గరిష్టంగా రూ. 4 వేల వరకు ఎక్స్చేంజ్ చేయవచ్చు.
  • రూ. 2 వేల నోట్ల ( 2000 note) ఎక్స్ చేంజ్ కు, డిపాజిట్ కు బ్యాంకులు ఎలాంటి చార్జీలను వసూలు చేయవు.
  • రూ. 2 వేల నోట్ల ( 2000 note) ను ఎక్స్ చేంజ్ లేదా డిపాజిట్ చేయడానికి వచ్చిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ప్రత్యేక అరెంజ్ మెంట్స్ చేస్తారు.
  • రూ. 2 వేల నోట్ల ( 2000 note) ను ఎక్స్ చేంజ్ లేదా డిపాజిట్ చేసుకోవడానికి ఏవైనా బ్యాంక్ బ్రాంచ్ లు నిరాకరిస్తే, కస్టమర్లు cms.rbi.org.in వెబ్ సైట్ లో ఫిర్యాదు చేయవచ్చు.
  • రూ. 2 వేల నోట్ల ( 2000 note) ఎక్స్ చేంజ్ కు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది కనుక ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముందే క్యూలలో నిల్చుని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

WhatsApp channel