Apple Invites app: ఐఫోన్ తో మీ ఫంక్షన్స్ కు మీరే సొంతంగా క్రియేటివ్ గా ఇన్విటేషన్ తయారు చేయొచ్చు.. ఎలాగంటే?
Apple Invites app: ఐఫోన్ లోని ఆపిల్ స్టోర్ లో మరో యూజ్ ఫుల్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఆపిల్ ఇన్వైట్స్ యాప్ తో మీరే సొంతంగా మీ ఫంక్షన్స్ కు ఆహ్వాన పత్రికను సిద్ధం చేయొచ్చు. ఇందుకు ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ గైడ్ ను ఇక్కడ చూడండి.

Apple Invites app: ఇకపై ఐఫోన్ యూజర్లు ఇన్విటేషన్స్ కోసం థర్డ్ పార్టీ యాప్స్ లేదా ఎడిటింగ్ టూల్స్ పై ఆధారపడాల్సిన అవసరం లేదు. గత వారం ఆపిల్ "ఆపిల్ ఇన్విటేషన్స్" అనే కొత్త ఐఫోన్ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఐఫోన్ యూజర్లు అన్ని రకాల ఈవెంట్లకు కస్టమ్ ఇన్విటేషన్లను రూపొందించవచ్చు. వినియోగదారులు తాము రూపొందించిన ఇన్విటేషన్ కు లొకేషన్ ను జోడించవచ్చు. సపోర్టింగ్ అల్బమ్స్ ను, ప్లే లిస్ట్ లను యాడ్ చేయవచ్చు. ఈ ఇన్విటేషన్ ను ఆండ్రాయిడ్ వినియోగదారులతో సహా అందరికీ పంపించవచ్చు.
ఆపిల్ ఇన్విటేషన్ యాప్ ఎలా పనిచేస్తుంది?
ఆపిల్ ఇన్విటేషన్స్ యాప్ తో ఐఫోన్ లేదా వెబ్ బ్రౌజర్ నుండి నేరుగా కస్టమ్ ఆహ్వానాలను సృష్టించవచ్చు. ఈ ఇన్విటేషన్ తో ఈవెంట్ వివరాలు, లొకేషన్ లు, ఆహ్వానితులు, భాగస్వామ్య ఆల్బమ్ లు, ఆపిల్ మ్యూజిక్, ఇతర కీలక సమాచారాన్ని అందించవచ్చు. ఐఓఎస్ 18 వెర్షన్లలో రన్ అయ్యే అన్ని ఐఫోన్ మోడళ్లకు ఆపిల్ ఇన్విటేషన్స్ యాప్ అందుబాటులో ఉంది. యాప్ స్టోర్ ద్వారా ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లేదా వెబ్ బ్రౌజర్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు.
కొత్త ఆపిల్ ఇన్విటేషన్స్ లో ఇన్విటేషన్ ఎలా క్రియేట్ చేయాలి
స్టెప్ 1: మీ ఐఫోన్ లో ఆపిల్ ఇన్విటేషన్స్ యాప్ ను తెరవండి లేదా ఐక్లౌడ్ వెబ్ సైట్ ను సందర్శించండి.
స్టెప్ 2: పిల్ ఆకారంలో ఉన్న బార్ లో కింద ఉన్న "క్రియేట్ యాన్ ఈవెంట్" బటన్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: ఇప్పుడు, ఆపిల్ యొక్క ప్రీసెట్ డిజైన్ నుండి టెంప్లేట్ ను ఎంచుకోండి. అదనపు నేపథ్య చిత్రాలతో లేదా ఇమేజ్ ప్లేగ్రౌండ్ ఉపయోగించి అనుకూలీకరించండి.
స్టెప్ 4: ఈవెంట్ హెడింగ్, తేదీ, టైమ్ లను జాగ్రత్తగా జోడించండి.
స్టెప్ 5: మ్యాప్స్ ద్వారా ఈవెంట్ జరిగే ప్లేస్ ను జోడించండి. వినియోగదారులు కస్టమ్ పేరును కూడా ఎంచుకోవచ్చు.
స్టెప్ 6: ఇప్పుడు, హాజరైన వారు ఒకే ప్రదేశంలో చిత్రాలను భాగస్వామ్యం చేయడానికి ఒక ఆల్బమ్ ను సృష్టించండి. మీరు ఆపిల్ మ్యూజిక్ నుండి కస్టమ్ ప్లే సూట్ను కూడా జోడించవచ్చు.
స్టెప్ 7: ఇప్పుడు, ఇన్విటేషన్ ను ఒక సారి రివ్యూ చేయండి. మీరు కోరుకున్నవారికి ఈ వర్చువల్ ఇన్విటేషన్ ను పంపించడం ప్రారంభించండి.