RBI Ombudsman Scheme: బ్యాంకు, ఎన్‌బీఎఫ్‌సీ, చెల్లింపుల సేవా లోపాలపై ఆర్‌బీఐకి ఎలా ఫిర్యాదు చేయాలి?
బ్యాంకు, ఎన్‌బీఎఫ్‌సీ, చెల్లింపుల సేవా లోపాలపై ఆర్‌బీఐకి ఎలా ఫిర్యాదు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.
బ్యాంక్‌లు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), చెల్లింపు విధానాల భాగస్వాములు అందించే సేవల్లో లోపాలపై ఫిర్యాదులను పరిష్కరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఒక అంబుడ్స్‌మన్ పథకం అమలు చేస్తోంది. దీని ద్వారాఉచితంగా శ్రీఘ్రంగా సేవలు అందిస్తోంది. ఇందుకోసం ఫిర్యాదుల నిర్వహణ వ్యవస్థ.. అంటే కంప్లైంట్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్.రూపొందించింది.
ట్రెండింగ్ వార్తలు
అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసే ముందు గుర్తించుకోవాల్సిన విషయాలు
- మీ ఫిర్యాదు పరిష్కారం కోసం మీ బ్యాంకు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ లేదా చెల్లింపు విధానాల భాగస్వామిని సంప్రదించండి.
- మీరు ఇచ్చిన ఫిర్యాదును ఆయా సంస్థలు పరిష్కారం చేయకపోతే ఒక నెల రోజుల తర్వాత లేదా వారిచ్చిన జవాబు మీకు సంతృప్తికరంగా లేకపోతే జవాబు ఇచ్చిన 1 సంవత్సరం లోగా అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
- ఫిర్యాదుకు కారణాలు అందుకు ఉద్దేశించిన ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్ పథకం పరిధిలో ఉండాలి.
- ఫిర్యాదులో అవసరమైన వివరాలు, సమాచారము కలిగి ఉండాలి. సదరు ఫిర్యాదు కోర్టులో ఉంటే ఫిర్యాదు చేయరాదు. కోర్టు తీర్పు ఇచ్చిన కూడా ఫిర్యాదు చేయకూడదు. అలాగే అంబుడ్స్‌మన్ పరిశీలనలో ఉన్నప్పుడు మళ్లీ ఫిర్యాదు చేయరాదు.
- కంప్లైంట్స్, మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సి ఎమ్ ఎస్) ద్వారా నిర్ణీత నమూనాలో అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేస్తే శ్రీఘ్రంగా పరిష్కారం పొందవచ్చు.
ఫిర్యాదు ఎప్పుడు చేయాలి?
- మీరు బ్యాంక్ లేదా ఎన్‌బీఎఫ్‌సీ లేదా చెల్లింపు విధానాల భాగస్వాముల నుండి జవాబు లభించకపోతే ఒక నెలలోగా ఫిర్యాదు చేయాలి.
- బ్యాంకు ఎన్‌బీఎఫ్‌సీ చెల్లింపు విధానాల భాగస్వాములు ఇచ్చిన జవాబు సంతృప్తికరంగా లేనట్లయితే ఫిర్యాదు చేయవచ్చు.
ఎవరికి ఫిర్యాదు చేయాలి?
బ్యాంకు, ఎన్‌బీఎఫ్‌సీ, చెల్లింపు విధానాల భాగస్వామ్య శాఖ లేదా రిజిస్టర్డు కార్యాలయము ఏ అంబుడ్స్‌మెన్ పరిధిలోకి వస్తుందో వారికి.ఫిర్యాదు చేయాలి.
ఎలా ఫిర్యాదు చేయాలి?
ఆర్‌బీఐ నిర్వహణ వ్యవస్థ పోర్టల్ Cms.rbi.org.in ద్వారా అంబుడ్స్‌మన్ పథకం అనుబంధంలో సూచించిన నమూనాల ప్రకారం లేదా సంతకం చేసిన ఫామ్ సబ్మిట్ చేయడం ద్వారా లేదా పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
ఫిర్యాది పేరు, ఫిర్యాదిని సంప్రదించుటకు చిరునామా, ఈమెయిల్, ఫోన్ నంబర్, అలాగే బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ వివరాలను అందులో పొందుపర్చాలి.
ఫిర్యాదుకు సంబంధించిన అన్ని వివరాలు అనగా ఏ విధమైన ఫిర్యాదు? ఎలాంటి నష్టం కలిగింది? ఎంత పరిహారం కోరుతున్నారు? వంటి అన్ని విషయాలు, అవసరమైన అన్ని పత్రాలు జతపరచాలి.
ఫిర్యాదు చేసే విధానం
రిజర్వ్ బ్యాంక్ నియంత్రణలో గల సంస్థలపై అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేసేందుకు Cms.rbi.org.in పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. ఫిర్యాదు ఎలా చేయాలో ఇందులో అందుబాటులో ఉన్న వీడియో ద్వారా తెలుసుకోవచ్చు.
ఫిర్యాదు చేసిన వెంటనే మీకు ఎస్.ఎం.ఎస్. లేదా ఈమెయిల్ ద్వారా ఒక రిజిస్ట్రేషన్ సంఖ్యతో రశీదు జారీ అవుతుంది. ఫిర్యాదు పరిష్కారం పై ఆరా తీసేందుకు, ఆన్‌లైన్ లో దాని స్థితి తెలుసుకునేందుకు ఈ సంఖ్య ఉపయోగపడుతుంది. సూచించిన పరిష్కారంపై మరలా అప్పీలు చేసేందుకు కూడా ఉపయోగపడుతుంది.
టాపిక్