Check Insurance Expiry Date : వాహన బీమా గడువు తేదీని ఎలా చెక్ చేయాలి? ఇంట్లో కూర్చొని చేయెుచ్చు
Check Vehicle Insurance Expiry Date : వాహనాలకు బీమా అనేది తప్పనిసరి. ఇన్సూరెన్స్ చేయిస్తే అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. అయితే మీ బండి ఇన్సూరెన్స్ గడువు తేదీని ఎలా చెక్ చేయాలి?
మీ కారు, బైక్ బీమా గడువు తేదీని తనిఖీ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇన్సురెన్స్ కార్యాలయాన్ని సందర్శించడం, ACKO, పరివాహన్ వెబ్‌సైట్‌పై క్లిక్ చేయడం ద్వారా కూడా గడువును చూడవచ్చు. గడువు తేదీని ముందుగానే చూసుకుని ఇన్సూరెన్స్ తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తర్వాత ఎలాంటి ఇబ్బందులు వచ్చినా బీమా ఉంటుంది.
మీరు బీమా సంస్థ కార్యాలయాన్ని సందర్శించి, మీ బైక్ లేదా కారు బీమా పాలసీ గడువు ముగింపు తేదీని తనిఖీ చేయాల్సిన రోజులు పోయాయి . ఇప్పుడు ఆఫ్‌లైన్ మార్గాన్ని అనుసరించే బదులు మీరు ఆన్‌లైన్‌లో తనిఖీ చేయవచ్చు. ఆన్‌లైన్ ప్రక్రియ సరళమైనది, పాలసీ గడువు తేదీని తనిఖీ చేయడానికి చాలా సమయాన్ని ఆదా చేస్తుంది.
అయితే మీరు వెహికల్ ఇన్సూరెన్స్‌ను ఆఫ్‌లైన్‌లో కూడా తనిఖీ చేయెుచ్చు. లేదంటే ఆన్‌లైన్‌ను కూడా ఫాలో కావొచ్చు. ఆఫ్ లైన్ కోసం.. సమీపంలోని ప్రాంతీయ రవాణా కార్యాలయం లేదా RTO వెళ్లండి. అక్కడ కౌంటర్‌లో పాలసీ నంబర్, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ మొదలైన వివరాలను అందించండి. మీరు అన్ని వివరాలను ఇచ్చిన తర్వాత, ఇతర వివరాలతో పాటు పాలసీ గడువు తేదీ గురించి మీకు చెబుతారు. ఇలా కాదు అనుకుంటే మీరు ఆన్‌లైన్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ ద్వారా చెక్ చేయండి
మీ మొబైల్ ఫోన్ లేదా డెస్క్‌టాప్‌లో ACKO వెబ్‌సైట్‌కి వెళ్లండి.
వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయండి.
వాహనం తయారీ, మోడల్ రిజిస్ట్రేషన్ సంవత్సరం మొదలైన వాటి వివరాలను నమోదు చేయండి.
గడువు తేదీ స్పష్టంగా కనిపించే చోట మీ పాలసీ కనిపిస్తుంది.
గడువు తేదీ సమీపిస్తున్నట్లు మీకు కనిపిస్తే నిర్ణీత కాల వ్యవధి కంటే ముందే పాలసీని పునరుద్ధరించండి.
పరివాహన్‌లో బీమా గడువు తేదీని ఎలా తనిఖీ చేయాలి?
వాహన్ ఇ-సర్వీసెస్ అధికారిక వెబ్‌సైట్‌పై క్లిక్ చేయండి.
నో యువర్ వెహికల్ ఎంపికకు వెళ్లండి.
మీరు ఇప్పటికే ఉన్న వినియోగదారు కాకపోతే ఖాతాను క్రియేట్ చేయాలి.. లేకపోతే, మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి.
మీ మొబైల్ ఫోన్‌కు వచ్చిన OTPని నమోదు చేయడం ద్వారా ముందుకు వెళ్లాలి.
తర్వాత మీరు వాహన రిజిస్ట్రేషన్ స్థితి పేజీకి వెళ్తారు.
ఆర్సీ ఎంపిక కింద, మీ వాహనం నంబర్‌ను నమోదు చేసి, వెహికల్ సెర్చ్‌పై క్లిక్ చేయండి
చివరగా మీరు కారు/బైక్ గడువు తేదీని చూడవచ్చు. మీరు మీ వాహనానికి సంబంధించిన ఇతర వివరాలను కూడా చూడవచ్చు
మీరు మీ వాహన బీమా గడువు తేదీని తనిఖీ చేసి, సమయానికి దాన్ని పునరుద్ధరించుకోవాలి. తద్వారా గడువు ముగిసిన పాలసీతో రైడింగ్ చేసినందుకు పడే జరిమానాలు చెల్లించే అవకాశం నుంచి బయటపడుతారు. వాహన బీమా తేదీని ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా చెక్ చేస్తే సులభంతోపాటుగా సమయం ఆదా అవుతుంది. మీరు కేవలం కొన్ని వివరాలను నమోదు చేయాలి. మీరు పాలసీ గడువు తేదీని తనిఖీ చేయెుచ్చు.