WhatsApp : చాట్‌ని కోల్పోకుండా వాట్సాప్ నెంబర్ మార్చడం ఎలా?
How to change WhatsApp number without losing chat : చాట్ కోల్పోకుండా వాట్సాప్‌లో నెంబర్ మార్చడం చాలా సింపుల్. అది ఎలా అంటే..
How to change WhatsApp number without losing chat : వాట్సాప్ చాలా సింపుల్‌గా ఉంటుంది. సులభంగా చాట్ చేయవచ్చు. మన పని సులభం అయ్యేందుకు ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ని కూడా తీసుకొస్తుంది వాట్సాప్. అయితే.. వాట్సాప్‌లో ఒక్కోసారి ఫోన్ నెంబర్లు మార్చాల్సి వస్తుంది. ఇలా నెంబర్ మారుస్తే.. పాత చాట్స్ పోతాయేమో అన్న భయం మనలో ఉంటుంది. కీలకమైన చాట్స్ డిలీట్ అయిపోతే చాలా కష్టం. కానీ ఈ సింపుల్ స్టెప్స్ పాటిస్తూ.. మీ ఫోన్లో వాట్సాప్ నెంబర్ని మార్చుకోవచ్చు. ఎలా అంటే..
ఒకే ఫోన్లో వాట్సాప్ నెంబర్ మార్చడం ఎలా?
స్టెప్ 1:- ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్‌లోకి వెళ్లండి.
స్టెప్ 2:- అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేంజ్ ఫోన్ నెంబర్ మీద టాప్ చేయండి.
స్టెప్ 3:- ఇప్పుడు 'నెక్స్ట్' మీద క్లిక్ చేయండి.
స్టెప్ 4:- ముందు మీ పాత ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేయండి. ఆ కింద.. కొత్త ఫోన్ నెంబర్ టైప్ చేయండి. ఈ రెండు ఇంటర్నేషనల్ ఫార్మాట్లోనే ఉండాలి.
How to change WhatsApp number : స్టెప్ 5:- నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీరు నెంబర్ మార్చినట్టు మీ కాంటాక్ట్స్ చెప్పాలా? వద్దా? అని అడుగుతుంది. మీకు ఇష్టం ఉంటే నోటిఫై మీద క్లిక్ చేయండి.
స్టెప్ 6:- కస్టమ్ మీద క్లిక్ చేస్తే.. మీరు ఏ కాంటాక్ట్స్‌కి పంపించాలని అనుకుంటున్నరో.. వాటిని సెర్చ్ చేసి సెలక్ట్ చేయాల్సి ఉంటుంది.
స్టెప్ 7:- డన్ ఆప్షన్ మీ టాప్ చేయండి.
ఇలా ఫోన్ నెంబర్ మారిస్తే.. గ్రూప్ చాట్‌లో ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్ వస్తుంది.
కొత్త ఫోన్లో వాట్సాప్ నెంబర్ మార్చడం ఎలా?
How to change WhatsApp number in ne phone : చాట్ హిస్టరీని ట్రాన్స్ఫర్ చేయాలంటే.. పాత ఫోన్ డేటాను ఐక్లౌడ్, కంప్యూటర్ బ్యాకప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత..
స్టెప్ 1:- కొత్త ఫోన్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేయండి.
స్టెప్ 2:- కొత్త ఫోన్ నెంబర్ని కొత్త డివైజ్‌లో రిజిస్టర్ చేయండి.
స్టెప్ 3:- రీస్టోర్ బ్యాకప్ మీద క్లిక్ చేయండి.
సంబంధిత కథనం