Financial tips : ఇష్టమొచ్చినట్టు ఖర్చు పెట్టింది చాలు! 2025 నుంచి ఈ టిప్స్ పాటిస్తే, మీరే కోటీశ్వరులు..
How to become rich : కోటీశ్వరులు అవ్వాలని కలలు కంటున్నారా? అయితే ఇది మీకోసమే! ఈ 2025 నుంచి ఈ 8 టిప్స్‌ని పాటించండి. మీరు కచ్చితంగా ఆర్థికంగా మెరుగుపడతారు.
కోట్లల్లో సంపద సృష్టించాలని, త్వరగా కోటీశ్వరులు అవ్వాలని మనలో చాలా మంది కలలు కంటూ ఉంటారు. కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక వచ్చిన జీతాన్ని కూడా సరిగ్గా కాపాడుకోలేకపోతుంటారు. నేటి యుగంలో ఫైనాన్షియల్ ప్లానింగ్ చాలా ముఖ్యం. మీ ఆర్థిక పరిస్థితులను మార్చుకోవాలంటే, ఈ 2025 నుంచి మీరు కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అప్పుడు ధనవంతులవ్వాలన్న మీ కోరిక నెరవేరుతుంది. అవేంటంటే..
1) బడ్జెట్..
మీకు వచ్చే జీతంలో ఖర్చులకు 50% నిత్యావసరాల వైపు, 30% విచక్షణా వ్యయం కోసం, 20% పొదుపు, పెట్టుబడులకు వెళ్లాలని చెప్పే 50-30-20 నియమం ఒక అద్భుతమైన మార్గదర్శకం.
"మీ ఖర్చులను పర్యవేక్షించడానికి, వృథా ఖర్చులను గుర్తించడానికి, మీరు మీ బడ్జెట్‌ని మించకుండా చూసుకోవడానికి, బడ్జెట్ యాప్స్‌ని ఉపయోగించండి. మీ ఖర్చులను ట్రాక్ చేయండి, అవసరమైన- అత్యవసరం కాని ఖర్చుల మధ్య తేడాను గుర్తించండి," అని గుప్తా సచ్దేవ్ భాగస్వామి గౌరవ్ గుంజన్ సూచిస్తున్నారు.
2) ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ..
డెట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి స్వల్పకాలిక లక్ష్యాల కోసం లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లను ఎంచుకోండి.
స్థిరమైన లాభం కోసం డైరెక్ట్ ఈక్విటీలు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఎన్పీఎస్ వంటి రిటైర్మెంట్ ఆధారిత ఫండ్లపై దృష్టి పెట్టాలని కుల్జీత్ సింగ్ అన్నారు.
మీ ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండటానికి, జీఐ గ్రూప్ హోల్డింగ్లోని ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్ కుల్జీత్ సింగ్, మీ పోర్ట్ ఫోలియోను తరచుగా సమీక్షించాలని, అడ్జెస్ట్ చేయాలని సలహా ఇస్తారు.
3) ఎమర్జెన్సీ ఫండ్..
ఆరు నుంచి పన్నెండు నెలల జీవన వ్యయాలను అధిక రాబడి పొదుపు ఖాతాలో కేటాయించి ఎమర్జెన్సీ ఫండ్‌ని ఏర్పాటు చేసుకోండి.
“మీ ఆస్తులు, అత్యవసర నిధి పెరుగుదలలో స్థిరత్వానికి హామీ ఇవ్వడానికి, ఆటోమేటిక్ చెల్లింపులను ఏర్పాటు చేయండి,” అని కుల్జీత్ సింగ్ సలహా ఇచ్చారు.
4) రుణ నిర్వహణ
అనవసరమైన ఆర్థిక భారాలను నివారించడానికి అధిక వడ్డీ రుణాలు, క్రెడిట్ కార్డు బిల్లులు, వ్యక్తిగత రుణాల చెల్లింపుపై దృష్టి పెట్టాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
5) ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ ఎడ్యుకేషన్
అసాధారణంగా పెద్ద లాభాలను అందించడానికి మిమ్మల్ని ప్రోత్సహించే పెట్టుబడులకు దూరంగా ఉండండి.
పెట్టుబడి అవకాశాల విషయంలో జాగ్రత్తగా, విజ్ఞానంతో కూడిన విధానాన్ని అవలంబించాలని గౌరవ్ గుంజన్ సూచించారు.
6) ట్యాక్స్ ప్లానింగ్
మీ ట్యాక్స్ బాధ్యతలను తగ్గించడానికి, మినహాయింపులను పెంచడానికి ఆదాయపు పన్ను నిపుణులను సంప్రదించండి.
7) బీమా
మీ ఆర్థిక శ్రేయస్సును పరిరక్షించడానికి మీకు తగినంత జీవిత, ఆరోగ్య, టర్మ్ ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోండి.
8) జీవనశైలి ఖర్చులను తగ్గించుకోండి
"అనవసరంగా జీవనశైలి ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి," అని గౌరవ్ గుంజన్ సిఫార్సు చేస్తున్నారు.
ఈ తెలివైన ఆర్థిక విధానాలను అమలు చేయడం ద్వారా, మీరు మీ డబ్బును కంట్రోల్ చేసుకోవచ్చు, 2025లో సురక్షితమైన- ఆరోగ్యకరమైన ఆర్థిక భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచించుకోవచ్చు.
(గమనిక:- ఇది కేవలం సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించడం శ్రేయస్కరం.)
సంబంధిత కథనం