పాన్​ కార్డు ఉంటే చాలు రూ. 5లక్షల వరకు పర్సనల్​ లోన్​- ఇవి తెలుసుకోండి..-how to avail 5 lakh personal loan with your pan card see full details here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  పాన్​ కార్డు ఉంటే చాలు రూ. 5లక్షల వరకు పర్సనల్​ లోన్​- ఇవి తెలుసుకోండి..

పాన్​ కార్డు ఉంటే చాలు రూ. 5లక్షల వరకు పర్సనల్​ లోన్​- ఇవి తెలుసుకోండి..

Sharath Chitturi HT Telugu

పర్సనల్​ లోన్​ కోసం ప్రయత్నిస్తున్నారా? పాన్​ కార్డు ఉంటే చాలు రూ. 5లక్షల వరకు పర్సనల్​ లోన్​ తీసుకోవచ్చని మీకు తెలుసా? పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

పాన్​ కార్డుతో పర్సనల్​ లోన్​

అనూహ్యంగా డబ్బు అవసరం వచ్చిపడటంతో పర్సనల్​ లోన్​ తీసుకోవాలని చూస్తున్నారా? పాన్​ కార్డుతో కూడా పర్సనల్​ లోన్​ పొందొచ్చని మీకు తెలుసా? పాన్​ కార్డు అంటే ఏంటి? పాన్​ కార్డుతో పర్సనల్​ లోన్​ ఎలా పొందాలి? అవసరమైన డాక్యుమెంట్లు ఏంటి? అర్హత ఏంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

పాన్​ కార్డుతో పర్సనల్​ లోన్​..

పర్మనెంట్ అకౌంట్ నంబర్, లేదా పాన్ అనేది రుణదాతలకు క్రెడిట్ నమూనాకు చెందిన పూర్తి చిత్రాన్ని అందించే గుర్తింపు సంఖ్య. ఇది పౌరుల ద్రవ్య లావాదేవీలను పర్యవేక్షించడానికి సహాయపడుతుంది. చట్టపరిధికి వెలుపల జరిగే అన్ని లావాదేవీలను నిరోధిస్తుంది.

అన్ని బ్యాంకు ఖాతాలతో పాన్ కార్డ్ నంబర్​ని లింక్ చేయడం చాలా ముఖ్యం. ఇది రుణదాతలకు కేవైసీ కోసం పాన్​ని చెక్​ చేయడం మరింత సులభతరం చేస్తుంది. వ్యక్తిగత రుణం పొందడానికి పాన్ నంబర్​ని ఒక ముఖ్యమైన పత్రంగా చేస్తుంది. మనకు తెలిసినట్లుగా, పాన్ ఆధార్ కార్డుతో లింక్ అవుతుంది. ఇది అనేక విధాలుగా అవసరాలను పూర్తి చేస్తుంది.

ఆధార్​తో లింక్ చేసుకుంటే పర్సనల్ లోన్ పొందడానికి కూడా పాన్ కార్డును ఉపయోగించుకోవచ్చు.

పాన్ కార్డుతో పర్సనల్​ లోన్​-​ గుర్తుంచుకోవాల్సిన విషయాలు

1. పాన్ కార్డు లోన్ కోసం అప్లై చేయాలంటే పాన్, ఆధార్ ఉండాలి.

2. పాన్, ఆధార్ కార్డులు లింక్ అయ్యేలా చూసుకోవాలి.

3. పాన్ అత్యంత కీలకమైన డాక్యుమెంట్​గా పరిగణిస్తారు. మీరు దానిని ఆధార్​తో లింక్ చేయకపోతే, మీరు ఆన్​లైన్​లో రుణం పొందడం ఆలస్యమవుతుంది.

4. ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ చేస్తే 24 గంటల్లోనే రుణం మంజూరవుతుంది!

5. పాన్ కార్డు లేకపోతే, భారతదేశంలోని ఏదైనా రుణ సంస్థల నుంచి వ్యక్తిగత రుణం పొందే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి.

అవసరమైన డాక్యుమెంట్లు..

పాన్ కార్డుతో రూ. 5 లక్షల వరకు పర్సనల్​ లోన్ కోసం సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్లు ఇవి:

1. ఐడెంటిటీ ప్రూఫ్: ఆధార్ కార్డు, పాస్​పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడీ కార్డు కాపీలు.

2. అడ్రస్ ప్రూఫ్: ఆధార్ కార్డు, పాస్​పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటర్ ఐడీ కార్డు కాపీలు.

3. గత మూడు నెలల బ్యాంక్ స్టేట్​మెంట్స్​.

4. ఫారం 16తో పాటు తాజా వేతన స్లిప్పులు (రెండు నెలలకు) లేదా ప్రస్తుత తేదీ వేతన ధృవీకరణ పత్రం.

పాన్ కార్డుతో పర్సనల్​ లోన్​- ఇలా అప్లై చేయాలి..

స్టెప్​ 1: పాన్ కార్డు ద్వారా తక్షణ పర్సనల్​ లోన్​ అందించే బ్యాంకును ఎంచుకోండి. రుణదాతలను ఎన్నుకునేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన అంశాలు.. వడ్డీ రేటు, రుణ మొత్తం, తిరిగి చెల్లించే నిబంధనలు, బ్యాంకు ప్రతిష్ఠ.

స్టెప్ 2: మీరు బ్యాంక్ అధికారిక వెబ్సైట్​ని సందర్శించవచ్చు.

స్టెప్ 2: ఆన్​లైన్ అప్లికేషన్ ఫామ్​ని తెరవడానికి, అప్లై నౌ క్లిక్ చేయండి..

స్టెప్ 3: ఓటీపీతో పాటు మీ 10 అంకెల మొబైల్ నెంబర్ ఇవ్వండి.

స్టెప్ 4: మీ పేరు, పాన్ నంబర్, పుట్టిన తేదీ, పిన్ కోడ్​తో పాన్ కార్డు లోన్ అప్లికేషన్ ఫామ్ నింపండి.

స్టెప్ 5: "ప్రొసీడ్" మీద క్లిక్ చేయండి.

స్టెప్ 6: రుణం తీసుకోవాల్సిన మొత్తం, రుణ వేరియంట్​ని ఎంటర్​ చేయండి: టర్మ్, ఫ్లెక్సీ టర్మ్, ఫ్లెక్సీ హైబ్రిడ్.

స్టెప్ 7: 6 నుంచి 96 నెలల మధ్య రుణ కాలపరిమితిని ఎంచుకోండి. "ప్రొసీడ్" మీద క్లిక్ చేయండి.

స్టెప్ 8: దరఖాస్తును పంపడానికి కేవైసీ వివరాలను నింపండి.

పాన్​ కార్డుతో పర్సనల్​ లోన్​- అర్హతలు..

రూ.5 లక్షల పర్సనల్​ లోన్​ పొందాలంటే ..

ఏ. కచ్చితంగా మీరు భారత పౌరుడు అయి ఉండాలి.

బీ. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.

సీ. దరఖాస్తుదారుడు తప్పనిసరిగా పాన్ కార్డు కలిగి ఉండాలి.

డీ. దరఖాస్తుదారుడికి మంచి క్రెడిట్ స్కోర్ ఉండాలి.

ఈ. దరఖాస్తుదారుడు క్రమం తప్పకుండా, శాశ్వత ఆదాయ వనరును కలిగి ఉండాలి.

ఎఫ్. దరఖాస్తుదారుడు వేతన జీవి లేదా స్వయం ఉపాధి కలిగి ఉండవచ్చు.

ఈ. రుణం-ఆదాయ నిష్పత్తి పరిమితి కంటే తక్కువగా ఉండాలి. అంటే నెలవారీ రుణ చెల్లింపులు అనేవి నెలవారీ ఆదాయంలో నిర్దిష్ట శాతాన్ని మించకూడదు.

(గమనిక- పర్సనల్​ లోన్​ అనేది రిస్క్​తో కూడుకున్న వ్యవహారం అని గుర్తుపెట్టుకోవాలి.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం