ఎస్బీఐ పర్సనల్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి? ఏమేం కావాలి?-how to apply sbi personal loan in online eligibility criteria interest rates application procedure ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  ఎస్బీఐ పర్సనల్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి? ఏమేం కావాలి?

ఎస్బీఐ పర్సనల్ లోన్ కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి? ఏమేం కావాలి?

Anand Sai HT Telugu

ఇటీవలి కాలంలో రుణం తీసుకోవడం అనేది చాలా ఈజీ అయిపోయింది. ఇంట్లో కూర్చోని పర్సనల్ లోన్ కోసం అప్లై చేయవచ్చు. ఎస్బీఐ పర్సనల్ లోన్‌కు ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలో చూద్దాం..

ఎస్బీఐ పర్సనల్ లోన్

వ్యక్తిగత రుణాలు అందించడంలో కూడా ఎస్బీఐ అగ్రగామిగా ఉంది. రుణం పొందే ప్రక్రియను చాలా సులభతరం చేస్తుంది. ముఖ్యంగా చిన్న రుణం అవసరమైన వారికి రూ. 2.5 లక్షల వరకు త్వరిత రుణాలు అందుబాటులో ఉన్నాయి. మీరు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధానాలలోనూ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. YONO SBI యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం సులభం. సమీపంలోని ఎస్బీఐ బ్రాంచ్‌ను సందర్శించడం ద్వారా ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

YONO SBI యాప్‌లోకి లాగిన్ అవ్వండి

రుణాలు విభాగానికి వెళ్లండి.

పర్సనల్ లోన్ ఎంచుకోండి.

మీ అర్హతను చెక్ చేయండి.

రుణ మొత్తం, తిరిగి చెల్లించే వ్యవధిని ఎంచుకోండి.

ఓటీపీ ద్వారా దరఖాస్తును పూర్తి చేయండి.

డబ్బు వెంటనే మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

వడ్డీ రేట్లు!

వడ్డీ రేట్లు సంవత్సరానికి 10.30 శాతం నుండి 15.30 శాతం వరకు ఉంటాయి. తిరిగి చెల్లించే వ్యవధి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు 1.5 శాతం ప్లస్ జీఎస్టీ ఉంటుంది(ఎంపిక చేసుకున్న వారికి మినహాయింపు). ఖచ్చితమైన వడ్డీ రేట్లు, నిబంధనల కోసం ఎస్బీఐ వెబ్‌సైట్ లేదా సమీపంలోని శాఖను సంప్రదించండి. పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు, నిబంధనలు మీ క్రెడిట్ స్కోర్, లోన్ మొత్తం, లోన్ రకం, తిరిగి చెల్లించే వ్యవధిపై కూడా ఆధారపడి ఉంటాయి.

కావాల్సిన పత్రాలు

పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటరు ఐడీ, పాస్‌పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్. చిరునామా రుజువుగా యుటిలిటీ బిల్లులు, రేషన్ కార్డ్, ఓటరు ఐడీ లేదా పాస్‌పోర్ట్. ఆదాయ రుజువుగా తాజా పే స్లిప్, ఫారం 16 లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు కావాలి.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.