అతి తక్కువ వడ్డీ రేటుకు పర్సనల్​ లోన్​ పొందడం ఎలా? ఇవి తెలిస్తే చాలా డబ్బులు ఆదా..-how to apply for personal loan in hyderabad that charges lowest interest rate ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  అతి తక్కువ వడ్డీ రేటుకు పర్సనల్​ లోన్​ పొందడం ఎలా? ఇవి తెలిస్తే చాలా డబ్బులు ఆదా..

అతి తక్కువ వడ్డీ రేటుకు పర్సనల్​ లోన్​ పొందడం ఎలా? ఇవి తెలిస్తే చాలా డబ్బులు ఆదా..

Sharath Chitturi HT Telugu

పర్సనల్​ లోన్​ కోసం చూస్తున్నారా? అధిక వడ్డీ రేట్లు చూసి భయపడుతున్నారా? అయితే ఇది మీకోసమే తక్కువ వడ్డీ రేటుకు పర్సనల్​ లోన్​ ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకోండి..

తక్కువ వడ్డీకి పర్సనల్​ లోన్​

సాధారణంగా పర్సనల్​ లోన్​లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అలా అని మన భారీ వడ్డీ రేట్లు ఉన్న లోన్​లు తీసుకుంటే మనపై ఆర్థిక భారం మరింత పెరుగుతుంది. పర్సనల్ లోన్ కోసం అప్లై చేసేటప్పుడు అతి తక్కువ వడ్డీకే పొందాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. అది జరగడానికి ఏం చేయాలి? అన్నది తెలుసుతోవాలి. తక్కువ వడ్డీ రేటుకు వ్యక్తిగత రుణ ఒప్పందాన్ని పొందడంలో మీకు సహాయపడే కొన్ని టిప్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

పర్సనల్ లోన్: ఈ విధంగా మీరు మంచి డీల్ పొందవచ్చు


1. అన్నింటికంటే ముందు, రుణం ఆవశ్యకతను గుర్తించండి - అది వివాహానికి ఖర్చు చేయడానికి లేదా ఏదైనా వ్యక్తిగత అత్యవసర పరిస్థితికి ఖర్చు చేయడానికి ఉపయోగిస్తున్నారా? అని తెలుసుకోండి.

2. అవసరాన్ని దానిని గుర్తించినట్లయితే, మొత్తం ఖర్చుల ప్రణాళికను రూపొందించండి. మీ ప్రత్యామ్నాయ నిధుల వనరుల ఆధారంగా కొంచెం ఎక్కువ లేదా తక్కువ రుణం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఉదాహరణకు మీకు రూ. 5లక్షలు అవసరం పడుతుంటే, మీరు రూ. 1లక్ష పెట్టగలుగుతున్నారమో చూడండి. అప్పుడు రూ. 4లక్షలే పర్సనల్​ లోన్​ తీసుకోవచ్చు.

3. సౌకర్యవంతమైన షరతులతో వ్యక్తిగత రుణాలను పొందడంలో ముఖ్యమైన పాత్ర పోషించే మీ క్రెడిట్ స్కోరును చెక్​ చేయడం చాలా ముఖ్యం.

4. మీ క్రెడిట్ స్కోర్ ఎక్కువగా ఉంటే - ఉదాహరణకు 720 కంటే ఎక్కువ ఉంటే, మీరు తక్కువ వడ్డీ రేటుతో లోన్​ కోసం ప్రయత్నించవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

5. మీకు రెగ్యులర్ బ్యాంకింగ్ రిలేషన్​షిప్ ఉన్న బ్యాంకును సంప్రదించండి. మీ జీతం క్రెడిట్ అయ్యే బ్యాంకు నుంచి రుణం పొందడం సులభం అని గుర్తుపెట్టుకోండి.

6. అదే సమయంలో ఒకటి లేదా ఇంకో రెండు బ్యాంకులను సంప్రదించి వారు మీకు ఏ వడ్డీ రేటుకు పర్సనల్​ లోన్​ ఇవ్వగలరో తెలుసుకోండి. మీ బ్యాంకు కన్నా అక్కడ తక్కువకు వడ్డీ రేటు లభిస్తుంటే మీకే మంచిది.

7. ఎక్కువ ఆర్థిక సంస్థలను ఆశ్రయించకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీకు లోన్​ ఇచ్చే ముందు వారు మీ క్రెడిట్​ స్కోరును చెక్​ చేయాలసి ఉంటుంది. అన్నిసార్లు చెక్​ చేస్తే క్రెడిట్​ స్కోరు పడిపోతుంది.

9. మీ డాక్యుమెంట్లను ఆన్​లైన్​లో సబ్మిట్ చేసి లోన్ కోసం అప్లై చేయండి. ఈ డాక్యుమెంట్లు సాధారణంగా 3 నెలల వేతన స్లిప్పులు, అపాయింట్​మెంట్​ లెటర్, ఆధార్, పాన్, కంపెనీ ఐడీ వంటివి ఉంటాయి.

10. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే, మీ పర్సనల్​ లోన్​ని టాప్ బ్యాంక్ తిరస్కరించినట్లయితే, మీరు ఆర్బీఐ-ఆమోదించిన ఎన్​బీఎఫ్​సీ లేదా ఏదైనా రిజిస్టర్డ్ ఫిన్​టెక్​ ప్లాట్​ఫామ్​ని సంప్రదించవచ్చు. ఈ ప్లాట్​ఫామ్​ సాధారణంగా అధిక వడ్డీ రేటుకు రుణాలను అందిస్తాయని గుర్తుపెట్టుకోండి.

(గమనిక- పర్సనల్​ లోన్​ తీసుకోవడం రిస్క్​తో కూడుకున్న వ్యవహారం అని గుర్తుపెట్టుకోండి.)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం