International driving license : ఇంటర్నేషనల్​ డ్రైవింగ్​ లైసెన్స్​కు అప్లై చేయడం ఎలా?-how to apply for international driving license in india know full details in telugu ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  How To Apply For International Driving License In India Know Full Details In Telugu

International driving license : ఇంటర్నేషనల్​ డ్రైవింగ్​ లైసెన్స్​కు అప్లై చేయడం ఎలా?

Sharath Chitturi HT Telugu
Feb 27, 2023 07:24 PM IST

How to apply for International driving license : మీరు త్వరలోనే విదేశాలకు వెళుతున్నారా? అక్కడ కారు కొనుక్కోవాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే మీకు ఇంటర్నేషనల్​ డ్రైవింగ్​ లైసెన్స్​ ఉండాల్సిందే. ఇండియాలోనే దానిని అప్లై చేసుకోవచ్చు. ఎలా అంటే..

ఇంటర్నేషనల్​ డ్రైవింగ్​ లైసెన్స్​కు అప్లై చేయడం ఎలా?
ఇంటర్నేషనల్​ డ్రైవింగ్​ లైసెన్స్​కు అప్లై చేయడం ఎలా? (REUTERS)

How to apply for international driving license : ఈ మధ్యకాలంలో చదువు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో చాలా మంది పర్యటిస్తున్నారు. అయితే చాలా మంది లోకల్​గా ఉండే బస్సులు, రైళ్లల్లో ప్రయాణిస్తుంటారు. కానీ ఇంకొంత మంది సొంత వాహనాల్లో రోడ్ల మీద చక్కర్లు కొట్టాలని భావిస్తారు. ఇండియాలో ఉన్న డ్రైవింగ్​ లైసెన్స్​ను.. ఆయా ప్రాంతాల్లో చూపిస్తే పని జరగదు. అందుకోసం ప్రత్యేకంగా ఓ డ్రైవింగ్​ లైసెన్స్​ తీసుకోవాల్సి ఉంటుంది. అదే “ఇంటర్నేషనల్​ డ్రైవింగ్​ లైసెన్స్”​. విదేశీ ప్రయాణానికి ముందే.. ఇంటర్నేషనల్​ డ్రైవింగ్​ లైసెన్స్​ను ఇండియాలోనే తీసుకోవచ్చు. ఆ ప్రక్రియను ఇక్కడ తెలుసుకుందాము..

ట్రెండింగ్ వార్తలు

ఇండియాలో ఇంటర్నేషనల్​ డ్రైవింగ్​ లైసెన్స్​..

భారత దేశ రోడ్డు రవాణాశాఖ.. ఈ ఇంటర్నేషనల్​ డ్రైవింగ్​ లైసెన్స్​లను జారీ చేస్తుంది. ఈ లైసెన్స్​తో ఇతర దేశాల్లోని 4 వీలర్​, 2 వీలర్​లను డ్రైవ్​ చేయవచ్చు. ఇంటర్నేషనల్​ డ్రైవింగ్​ లైసెన్స్​కు అప్లై చేస్తున్న వ్యక్తి ఇండియన్​ అయ్యి ఉండాలి. అంతేకాకుండా 18ఏళ్ల వయస్సు నిండి ఉండాలి. సంబంధిత వ్యక్తి సరైన ఇండియన్​ డ్రైవింగ్​ లైసెన్స్​ ఉండాలి. సరైన పాస్​పోర్ట్​, వీసా కూడా పొంది ఉండాలి.

Apply for international driving license in India : ఇంటర్నేషనల్​ డ్రైవింగ్​ లైసెన్స్​కు అప్లే చేయడం కోసం ఫామ్ 4, ఫామ్​ 1ఏతో పాటు డ్రైవింగ్​ లైసెన్స్​ కాపీ, పాస్​పోర్ట్​- వీసా కాపీలు, డూప్లికేట్​ ఎయిర్​ టికెట్స్​, పాస్​పోర్ట్​ సైజ్​ ఫొటో, భారత పౌరసత్వాన్ని రుజువు చేసే విధంగా సర్టిఫైడ్​ ప్రూఫ్​, అడ్రెస్​ ప్రూఫ్​, ఏజ్​ ప్రూఫ్​ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. రూ. 1000ని అప్లికేషన్​ ఫీజ్​.

ఇంటర్నేషనల్​ డ్రైవింగ్​ లైసెన్స్​ పొందండం ఎలా..

మినిస్ట్రీ ఆఫ్​ రోడ్​ ట్రాన్స్​పోర్ట్​ అండ్​ హైవేస్​ వెబ్​సైట్​ లేదా స్థానిక ఆర్​టీఓ దగ్గర ఈ ఇంటర్నేషనల్​ డ్రైవింగ్​ లైసెన్స్​ను పొందవచ్చు.

ఫామ్​ 4ఏ, 1ఏని నింపాలి..

ఇంటర్నేషనల్​ డ్రైవింగ్​ లైసెన్స్​ పొందండంలో తొలి ప్రక్రియ ఫామ్​ 4, ఫామ్​ 1ఏని నింపడం. ఫామ్​ 4ఏ అంటే.. డ్రైవింగ్​ చేసేందుకు మీ వద్ద స్కిల్​ ఉందని చెప్పే పత్రాలు. ఫామ్​ 1ఏ అంటే.. డ్రైవింగ్​ చేసేందుకు కావాల్సిన మెడికల్​ ఫిట్​నెస్​. సంబంధిత మంత్రిత్వశాఖ లేదా ఆర్​టీఓ అధికారిక వెబ్​సైట్​లో నుంచి వీటిని డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

ఫీజ్​తో పాటు డాక్యుమెంటల్​ను సమర్పించాలి..

International driving license : ఫామ్​ 4ఏ, 1ఏని ఫిల్​ చేసిన తర్వాత.. మీ ఇండియన్​ డ్రైవింగ్​ లైసెన్స్​, ఐడెంటిటీ, వయస్సు, రెసిడెన్షియల్​ ప్రూఫ్​ వంటి డాక్యుమెంట్లు ఇవ్వాలి. లీగల్​ డాక్యుమెంట్​లలో ఉన్నట్టుగానే ఇవి కూడా ఉండాలి. తప్పులు జరిగితే భవిష్యత్తులో కష్టమవుతుంది. రూ.1000 ఫీజ్​తో వీటిని సమర్పించాల్సి ఉంటుంది.

డ్రైవింగ్​ టెస్ట్​..

చివరిగా.. డ్రైవింగ్​ టెస్ట్​ చేయాల్సి ఉంటుంది. ఇండియన్​ డ్రైవింగ్​ లైసెన్స్​ కోసం ఏ విధంగా టెస్ట్​ ఉంటుందే.. ఇదీ కూడా అంతే! ఇందులో మీరు సక్సెస్​ అయితే.. ఇంటర్నేషనల్​ డ్రైవింగ్​ లైసెన్స్​కు మీరు అర్హులవుతారు. 4-5 పని రోజుల్లో మీ లైసెన్స్​ మీకు వస్తుంది.

WhatsApp channel