కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం ఎలా అప్లై చేయాలి? ఏమేం కావాలి?-how to apply canara bank credit card know what are the eligibility criteria and documents required ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం ఎలా అప్లై చేయాలి? ఏమేం కావాలి?

కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం ఎలా అప్లై చేయాలి? ఏమేం కావాలి?

Anand Sai HT Telugu

కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తీసుకోవాలని అనుకుంటున్నారా? ఈ క్రెడిట్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? కావాల్సిన అర్హతలు, అవసరమైన పత్రాల గురించి చూద్దాం..

ప్రతీకాత్మక చిత్రం

కెనరా బ్యాంక్ తన కస్టమర్లకు ఆకర్షణీయమైన రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లను అందించే క్రెడిట్ కార్డులను అందిస్తుంది. ఈ కార్డులు ప్రయాణం, వినోదం, భోజనంతో సహా అనేక వర్గాలలో ప్రత్యేక ఆఫర్‌లను పొందడానికి మీకు సాయపడుతాయి. కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డు పొందడానికి ఫాలో కావాల్సిన స్టెప్స్ ఏంటో చూద్దాం..

ఎలా దరఖాస్తు చేయాలి?

ముందుగా బ్యాంకు వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు ఫారమ్‌ల విభాగానికి వెళ్లండి. ఫారమ్‌ల జాబితాలో క్రెడిట్ కార్డ్ దరఖాస్తు ఫారమ్‌పై క్లిక్ చేయండి. మీరు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకునే పీడీఎఫ్ ఫైల్ తెరుచుకుంటుంది. సరైన సమాచారంతో ఫారమ్ నింపండి. ఫారమ్‌తో పాటు అవసరమైన పత్రాలను సమర్పించండి.

సమీపంలోని కెనరా బ్యాంక్ శాఖను సందర్శించి, నింపిన ఫారమ్‌ను సమర్పించండి. బ్యాంకు మీ దరఖాస్తును పరిశీలించి కార్డు జారీ చేస్తుంది. మీరు కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించడం ద్వారా లేదా బ్రాంచ్‌ను సందర్శించడం ద్వారా మీ దరఖాస్తు స్థితిని చెక్ చేయవచ్చు.

క్రెడిట్ కార్డ్‌కు అర్హతలు

మీ వయస్సు 21 మరియు 60 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం లక్ష రూపాయల వార్షిక ఆదాయం ఉండాలి. పాన్ కార్డు తప్పనిసరి. మంచి క్రెడిట్ స్కోరు ఉండటం మంచిది. కెనరా బ్యాంక్ ఖాతా ఉండటం బెటర్. ఎస్ఎంఎస్ అలర్ట్ కోసం మొబైల్ నంబర్ కూడా అవసరం. కార్డ్ రకం, మీ క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా అర్హత నియమాలు మారవచ్చు.

ఏ పత్రాలు కావాలి?

పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటరు ఐడీ మొదలైనవి. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, తాజా యుటిలిటీ బిల్లు, రేషన్ కార్డ్ మొదలైనవి అందించవచ్చు. తాజా ఒకటి లేదా రెండు నెలల జీతం స్లిప్, ఫారం 16, గత 3 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్ రూపంలో అందించాలి. కార్డు రకం, మీ క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా అదనపు పత్రాలు కూడా అవసరం కావొచ్చు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.