EPF bank account change : ఈపీఎఫ్ అకౌంట్లో బ్యాంక్ ఖాతాను ఇలా అప్డేట్ చేసుకోండి..
How to update bank account in EPFO : మీ ఈపీఎఫ్ అకౌంట్‌కి కొత్త బ్యాంక్ ఖాతా వివరాలను యాడ్ చేయాలని చూస్తున్నారా? అయితే.. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రిటైర్మెంట్ ఫండ్ బాడీ అయిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ).. చందాదారులు తమ ఈపీఎఫ్ ఖాతా నుంచి నిధులను ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తుంది. అయితే.. ఉపసంహరణ సజావుగా సాగడానికి, సభ్యులు ఖచ్చితమైన బ్యాంకు ఖాతా రికార్డులను మెయిన్టైన్ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ ఖాతాలో కొత్త అకౌంట్ వివరాలను అప్డేట్ చేయకుండానే చాలా మంది తమ పాత బ్యాంకు ఖాతాలను మూసివేసిన సందర్భాలు ఉన్నాయి. బ్యాంకు వివరాలు తప్పుగా ఉండటం వల్ల క్రెడిట్ లావాదేవీలు విఫలం కావొచ్చు. చందాదారులు తమ బ్యాంక్ ఖాతా వివరాలను ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా అప్డేట్ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
ఈపీఎఫ్ఓ రికార్డులో మీ బ్యాంక్ ఖాతా వివరాలను అప్డేట్ చేసుకోండి ఇలా..
స్టెప్ 1:- యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌కి వెళ్లి మీ యూజర్ నేమ్, పాస్వర్డ్ తో లాగిన్ అవ్వండి.
స్టెప్ 2:- 'మేనేజ్' ట్యాబ్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 3:- డ్రాప్ డౌన్ మెనూ నుంచి 'కేవైసీ'ని ఎంచుకోండి.
స్టెప్ 4:- మీ బ్యాంకును ఎంచుకోండి. మీ బ్యాంక్ ఖాతా నెంబర్, పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్‌ని నమోదు చేయండి. తర్వాత 'సేవ్' క్లిక్ చేయండి.
స్టెప్ 5:- మీ ఎంప్లాయర్ ఆమోదించిన తరువాత, మీరు అప్డేట్ చేసిన బ్యాంక్ వివరాలు అప్రూవ్డ్ KYC సెక్షన్లో కనిపిస్తాయి.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ట్యాక్స్ బెనిఫిట్స్..
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అనేది భారతదేశంలో ఒక ప్రసిద్ధ రిటైర్మెంట్ పొదుపు పథకం. దీనిని.. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) రెగ్యులేట్ చేస్తుంది. ఇది చందాదారులకు గణనీయమైన పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈపీఎఫ్ ఖాతాకు కంట్రిబ్యూషన్ చేయడం ద్వారా, ఉద్యోగులు సెక్షన్ 80 సీ కింద సంవత్సరానికి రూ .1.5 లక్షల వరకు తగ్గింపు పొందవచ్చు.
2023 డిసెంబర్లో.. రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్ఓ 15.62 లక్షల మంది కొత్త సభ్యులను చేర్చుకుంది. 2017 సెప్టెంబర్ నుంచి సంబంధిత పేరోల్ డేటాని.. 2018 ఏప్రిల్ నుంచి ప్రచురిస్తోంది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలపై ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును 8.25 శాతంగా ప్రకటించింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం పొందిన తర్వాత, ఈ వడ్డీ రేటును ప్రభుత్వ గెజిట్‌లో అధికారికంగా ప్రకటిస్తారు. దీని తరువాత, ఈపీఎఫ్ఓ ఆమోదించిన వడ్డీ రేటును తన చందాదారుల ఖాతాలలో జమ చేస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది, ఇది 1977-78 తర్వాత అత్యల్ప రేటు.
సంబంధిత కథనం