RBI rate cut : వడ్డీ రేట్ల కోత షురూ- మరి మీ లోన్​ ఈఎంఐలపై ప్రభావం ఎంత?-how does rbi rate cut influence personal loan interest rates ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Rbi Rate Cut : వడ్డీ రేట్ల కోత షురూ- మరి మీ లోన్​ ఈఎంఐలపై ప్రభావం ఎంత?

RBI rate cut : వడ్డీ రేట్ల కోత షురూ- మరి మీ లోన్​ ఈఎంఐలపై ప్రభావం ఎంత?

Sharath Chitturi HT Telugu
Published Feb 07, 2025 11:00 AM IST

RBI rate cut : చాలా కాలం పాటు అధిక స్థాయిలో వడ్డీ రేట్లను కట్​ చేస్తూ ఆర్​బీఐ కీలక ప్రకటన చేసింది. మరి మీ పర్సనల్​ లోన్​పై ఈ రేట్​ కట్​ ప్రభావం ఎంత ఉంటుంది? ఇక్కడ తెలుసుకోండి..

వడ్డీ రేట్ల కోత షురూ- మరి మీ లోన్​పై ప్రభావం ఎంత?
వడ్డీ రేట్ల కోత షురూ- మరి మీ లోన్​పై ప్రభావం ఎంత? (REUTERS)

అంచనాలకు తగ్గట్టుగానే, రెపో రేటును 25 బేసిస్​ పాయింట్ల తగ్గిస్తున్నట్టు ఆర్​బీఐ శుక్రవారం ప్రకటించింది. ఫలితంగా ఇంతకాలం 6.5శాతంగా ఉన్న వడ్డీ రేట్లు, ఇప్పుడు 6.25శాతానికి తగ్గాయి. మరి ఆర్​బీఐ తాజా నిర్ణయంతో పర్సనల్​ లోన్​ల వడ్డీ రేట్లపై ప్రభావం ఎలా ఉంటుంది? ప్రజలకు ఉపశమనం దక్కినట్టేనా? ఇక్కడ తెలుసుకోండి..

రెపో రేటు అంటే ఏంటి?

వాణిజ్య బ్యాంకులకు ఆర్​బీఐ ఇచ్చే రుణాలపై వడ్డీ రేటును రెపో రేటు అంటారు. ప్రభుత్వ సెక్యూరిటీలు వంటి పూచీకత్తుపై వాణిజ్య బ్యాంకులకు ఆర్​బీఐ రుణాలు ఇస్తుంది. సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వివిధ ఆర్థిక సూచికలను అంచనా వేయడం ద్వారా రెపో రేటును నిర్ణయిస్తుంది. ఎంపీసీలో ఆర్​బీఐ గవర్నర్ సహా ఆరుగురు సభ్యులు ఉంటారు. మానిటరీ పాలసీ లక్ష్యాలకు అనుగుణంగా రెపో రేటులో ఎంపీసీ మార్పులు చేస్తుంది.

11నెలల పాటు యథాతథంగా ఉన్న రెపో రేటు.. ఇప్పుడు 6.25శాతానికి దిగొచ్చింది.

పర్సనల్ లోన్ వడ్డీ రేటుపై రెపో రేటు ప్రభావం ఎంత?

రెపో రేట్లకు చేసే మార్పులు పర్సనల్​ లోన్​ సహా వివిధ రుణాల వడ్డీ రేట్లపై ప్రభావం చూపుతాయి. సెంట్రల్ బ్యాంక్ రెపో రేటును పెంచినప్పుడు, రుణాలు తీసుకోవడం బ్యాంకులకు ఖరీదైనదిగా మారుతుంది. అందువల్ల, అధిక రెపో రేట్లకు అనుగుణంగా, బ్యాంకులు రుణగ్రహీతలకు రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతాయి. ఇది రుణగ్రహీతలకు రుణం మరింత భారంగా మారుతుంది. ఇది వారి ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.

అయితే ఆర్​బీఐ రెపో రేటును తగ్గించినప్పుడు వాణిజ్య బ్యాంకులపై తక్కువ భారం పడుతుంది. ఇది వినియోగదారులకు కూడా బదిలీ కావచ్చు. వారు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు పొందవచ్చు! ఇది కొంతమంది రుణగ్రహీతలకు వ్యక్తిగత రుణాలను చౌకగా చేస్తుంది. అయితే, రెపో రేటులో మార్పు పర్సనల్​ లోన్​ వడ్డీ రేట్లను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందనేది డిపాజిట్ల వ్యయం, బ్యాంకుల నిర్వహణ ఖర్చులు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.

ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి! ఇక మీద తీసుకునే పర్సనల్​ లోన్​లపై వడ్డీ రేట్లు తగ్గొచ్చు. కానీ ఇప్పటికే తీసుకున్న లోన్​ల విషయం ఏంటి?  ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై రుణం తీసుకుని ఉంటేనే మీపై ఉన్న వడ్డీ భారం తగ్గుతుంది. అంటే, పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఫిక్స్​డ్ వడ్డీ రేటుకు ఎంచుకుని ఉంటే, రెపో రేటు కారణంగా వడ్డీ రేటులో ఎలాంటి మార్పు ఉండదు!

అదే విధంగా ఫ్లోటింగ్​ ఆప్షన్​తో పర్సనల్​ లోన్​ తీసుకునే వారు.. రెపో రేటు పెరిగినప్పుడు వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయని గుర్తుపెట్టుకోవాలి.

ఈఎంఐ చెల్లింపులపై రెపో రేటు ప్రభావం ఎంత?

పర్సనల్ లోన్ వడ్డీ రేటు మీ ఈఎంఐ చెల్లింపులను నిర్ణయిస్తుంది. రెపో రేటు ఈఎంఐ చెల్లింపులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆర్​బీఐ రెపో రేటును తగ్గించినప్పుడు, బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. ఇది ఈఎంఐ చెల్లింపులను తగ్గిస్తుంది.

ఆర్బీఐ రెపో రేటును పెంచితే, బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటును పెంచవచ్చు. ఇది ఈఎంఐల భారాన్ని పెంచుతుంది. అయితే రెపో రేటులో మార్పు కారణంగా వ్యక్తిగత వేరియబుల్ వడ్డీ రేటు మాత్రమే ఈఎంఐలపై ప్రభావం చూపుతుందని గమనించండి. ఫిక్స్​డ్ రేట్ రుణాలు రెపో రేటులో చేసిన మార్పులపై ఎలాంటి ప్రభావం చూపవు. 

(గమనిక: పర్సనల్ లోన్ తీసుకోవడం వల్ల రిస్క్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.)

Whats_app_banner

సంబంధిత కథనం