Personal loan tips : ఆదాయం లేని విద్యార్థులకు పర్సనల్ లోన్ ఇస్తారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి..
Personal loan for students : విద్యార్థులు పర్సనల్ లోన్ తీసుకోవచ్చా? ఒక వేళ తీసుకోగలిగితే ఎలాంటి డాక్యుమెంట్స్ చూపించాలి? ఎంత వరకు లోన్ మంజూరు అవుతుంది? పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
డబ్బు అవసరం ఎప్పుడు, ఏ విధంగా వస్తుందో తెలియదు. మరీ ముఖ్యంగా విద్యార్థి దశలో చాలా ఖర్చులు ఉంటాయి. కానీ ఆదాయం లేని వారికి పర్సనల్ లోన్ దొరకడం చాలా కష్టమవుతుంది! మరి విద్యార్థులకు పర్సనల్ లోన్ ఇస్తారా? ఇస్తే, ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం పడతాయి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
విద్యార్థులు వ్యక్తిగత రుణాల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు?
ఊహించని ఖర్చుల సమస్యను పరిష్కరించుకోవడానికి లేదా వివిధ వ్యక్తిగత ఖర్చులను కవర్ చేసుకోవడానికి విద్యార్థులకు పర్సనల్ లోన్స్ బాగా ఉపయోగపడతాయి. కానీ భారతీయ బ్యాంకులు, ఫిన్‌టెక్ కంపెనీలు తరచుగా విద్యార్థులకు పర్సనల్ లోన్ అందించవు. పైగా చాలా రుణ సంస్థలకు వ్యక్తిగత రుణాలను ఆమోదించడానికి స్థిరమైన ఆదాయ వనరు అవసరం. అయితే వేతనం లేని విద్యార్థి పర్సనల్ లోన్ పొందేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి..
- హామీదారు: చాలా బ్యాంకులకు మీ తరఫున రుణంపై సంతకం చేయడానికి ఒక హామీదారు అవసరం. తల్లిదండ్రులు, తోబుట్టువులు లేదా ఇతర కుటుంబ సభ్యులు వంటివారు మీ కోసం సంతకం చేయాల్సి ఉంటుంది.
- ఇతర డబ్బు వనరులు: మీకు సైడ్ జాబ్, ఫ్రీలాన్సింగ్ వర్క్ లేదా మరొక డబ్బు వనరు ఉంటే మీ పేరు మీద పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
పర్సనల్ లోన్- ఎడ్యుకేషనల్ లోన్ ఒకటేనా?
లేదు! పర్సనల్ లోన్- ఎడ్యుకేషనల్ లోన్ ఒకటి కావు..
- స్టూడెంట్ పర్సనల్ లోన్స్: జీవన ఖర్చులు అంటే బిల్లులు చెల్లించడం, అనుకోని మెడికల్ బిల్లులు కట్టం లేదా టెక్నాలజీ కొనుగోలు వంటి వివిధ విషయాలకు పర్సనల్ లోన్ని ఉపయోగించవచ్చు.
- ఎడ్యుకేషన్ లోన్స్: ఈ రుణాలను ప్రత్యేకంగా విద్యకు సంబంధించిన ట్యూషన్, పుస్తకాలు, ఇతర ఖర్చుల కోసం అందిస్తారు.
విద్యార్థి ఎంత వరకు అప్పు తీసుకోవచ్చు?
విద్యార్థి రుణ పరిమితి ఆదాయం, క్రెడిట్ స్కోరు, రుణదాత పరిమితులు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. చాలా భారతీయ ఆర్థిక సంస్థలు.. పర్సనల్ లోన్ తీసుకునే వ్యక్తికి ఇతరులు గ్యారంటీ ఇచ్చినంత కాలం రూ. 5లక్షల వరకు నిధులను మంజూరు చేస్తాయి.
విద్యార్థి పర్సనల్ లోన్‌కి అవసరమైన డాక్యుమెంట్లు..
- ఐడెంటిటీ ప్రూఫ్: ఆధార్ కార్డు, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ.
- అడ్రస్ ప్రూఫ్: ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, యుటిలిటీ బిల్లు.
- ఆదాయ రుజువు: గత మూడు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ (హామీదారులు, వేతన జీవులకు అవసరం.)
ఇవి సాధారణంగా అడిగే డాక్యుమెంట్లు. అయితే, ఒక్కో బ్యాంక్ రూల్స్ ఒక్కో విధంగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి.
వాస్తవానికి విద్యార్థులు పర్సనల్ లోన్ పొందడానికి చాలా పేపర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. రుణం తీసుకోవడానికి వివేకవంతమైన విధానం అవసరం. ప్రణాళికాబద్ధంగా, బాధ్యతాయుతంగా రుణం తీసుకుంటే మీ అకాడమిక్ లక్ష్యాలను నెరవేర్చుకోవడంపై దృష్టి పెట్టడానికి అవసరమైన డబ్బును పర్సనల్ లోన్ ద్వారా పొందొచ్చు. అంత డబ్బును హ్యాండిల్ చేయలేక ఇతర మార్గాల్లో ఖర్చులు చేస్తే, భవిష్యత్తులో మీరు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందని గుర్తించండి.
(గమనిక: పర్సనల్ లోన్‌లో రిస్క్ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి.)
సంబంధిత కథనం