senior citizens: భారతదేశంలో పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా స్థిరమైన ఆదాయ వనరును సర్దుబాటు చేయడం ఒక సవాలు. సీనియర్ సిటిజన్ల ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి పన్నుల వ్యవస్థ కొన్ని ప్రయోజనాలను అందిస్తుంది.
భారతదేశంలో, 60 ఏళ్లు పైబడిన వారిని సీనియర్ సిటిజన్ లుగా, 80 ఏళ్లు పైబడిన వ్యక్తిని సూపర్ సీనియర్ సిటిజన్ లుగా ఆదాయపు పన్ను విభాగం పరిగణిస్తుంది.
1961 ఆదాయపు పన్ను చట్టం సీనియర్, సూపర్ సీనియర్ సిటిజన్లకు వృద్ధాప్యంలో సహాయపడటానికి కొన్ని పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. అవి..
ఆదాయపు పన్ను వర్తించని గరిష్ట మొత్తం సాధారణ సిటిజన్ల కన్నా సీనియర్ సిటిజన్ల కు ఎక్కువగా ఉంటుంది. 60 ఏళ్ల లోపు సాధారణ సిటిజన్లకు ఈ పన్ను వర్తించని మొత్తం రూ. 2.5 లక్షలు కాగా, సీనియర్ సిటిజన్లకు ఈ మినహాయింపు పరిమితి రూ.3 లక్షలుగా ఉంటుంది. అలాగే, సూపర్ సీనియర్ సిటిజన్లకు ఇది రూ.5 లక్షలుగా ఉంటుంది.
వృద్ధుల ఖర్చులలో వైద్య ఖర్చులు గణనీయమైన భాగం. అందువల్ల ఐటీ చట్టం సీనియర్ సిటిజన్ల వైద్య ఖర్చులపై కొన్ని ప్రయోజనాలను అందిస్తుంది. అవి
పొదుపు ఖాతాలు, ఫిక్స్ డ్, రికరింగ్ డిపాజిట్ ఖాతాల నుంచి వచ్చే వడ్డీపై సీనియర్ సిటిజన్లకు పన్ను మినహాయింపులు ఉన్నాయి. ఇది కేవలం వడ్డీ ఆదాయంపై మాత్రమే ఆధారపడే పౌరులకు ప్రయోజనకరంగా ఉంటాయి.
సీనియర్ సిటిజన్స్ కు ట్యాక్స్ రిబేట్ కూడా లభిస్తుంది, ఇది చెల్లించిన పన్ను చెల్లించాల్సిన మొత్తం ను మించితే రీఫండ్ అవుతుంది. సెక్షన్ 87ఏ పరిధిలో రూ.5 లక్షలకు మించని వార్షికాదాయం ఉన్న సీనియర్ సిటిజన్ల (senior citizen) కు రూ.12,500 వరకు పన్ను రాయితీ లభిస్తుంది.
సీనియర్ సిటిజన్లు వ్యాపారం లేదా వృత్తిపరమైన ఆదాయం లేకపోతే, వారు అడ్వాన్స్ ట్యాక్స్ జమ చేయాల్సిన అవసరం లేదు. పన్నుకు సంబంధించిన ఈ నిబంధన వారిపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించడానికి వీలు కల్పిస్తుంది.
ఐటీ చట్టం ప్రకారం 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఫారం 12బీబీ కింద డిక్లరేషన్ సమర్పించిన తర్వాత ఒకే బ్యాంకు నుంచి పెన్షన్ ఆదాయం, వడ్డీ పొందితే ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదు.