Home loan: ఆర్బీఐ రేట్ కట్ తో మీ హోం లోన్ ఈఎంఐ తగ్గుతుందా?.. వివరాలు ఇక్కడ చూడండి!
RBI rate cut: ఫిబ్రవరి 7న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల పలు రుణాలపై వడ్డీ రేట్లు, తద్వారా ఈఎంఐ లు తగ్గుతాయని భావిస్తున్నారు. గృహ రుణాలపై ఈ రేట్ కట్ ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇక్కడ చూడండి.

RBI rate cut: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్రవరి 7, శుక్రవారం మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపో రేట్ ను 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని నిర్ణయించింది. ఈ తగ్గింపు తరువాత అది 6.25 శాతానికి తగ్గుతుంది. వడ్డీ రేట్ ను తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడం ఐదేళ్లలో ఇదే మొదటిసారి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రక్షణాత్మక వాణిజ్య విధానాలు, అంతర్జాతీయ కమోడిటీ ధరల్లో హెచ్చుతగ్గులు, ఆర్థిక మార్కెట్లలో అనిశ్చితి కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాను ఆర్బీఐ 6.7 శాతానికి తగ్గించింది.
రుణగ్రహీతలకు దీని అర్థం ఏమిటి?
గృహ రుణం లేదా వ్యక్తిగత రుణం తీసుకున్న భారతీయ రుణగ్రహీతలకు ఈ వడ్డీ రేటు తగ్గింపు ముఖ్యమైనది. ఈ మేరకు ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేయాలని బ్యాంక్ లు నిర్ణయిస్తే, కస్టమర్లు తమ రుణాలపై చెల్లించే వడ్డీ రేటు తగ్గుతుంది. తద్వారా, వారి ఈఎంఐ మొత్తాలు కూడా తగ్గుతాయి. రెపో రేట్ తగ్గడంతో ప్రభుత్వ ట్రెజరీ బిల్లులలో పెట్టుబడులు చౌకగా మారతాయి. ఫ్లోటింగ్ వడ్డీ రేటుపై ఆధారపడిన ఇతర రుణాలు కూడా చౌకగా మారుతాయి. రుణగ్రహీతలపై ఈఎంఐ భారం తగ్గుతుంది. ఒకవేళ బ్యాంక్ మొత్తం 25 బేసిస్ పాయింట్లు కాకుండా, 10 నుంచి 15 బేసిస్ పాయింట్ల వడ్డీరేట్ల ఉపశమనాన్ని కస్టమర్లకు బదలాయించాలని నిర్ణయిస్తే కాలపరిమితితో పాటు నెలవారీ హోమ్ లోన్ ఈఎంఐ ఆ మేరకు తగ్గుతుంది.
కొత్త హోం లోన్ కస్టమర్లకు..
ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గింపు నిర్ణయం హోం లోన్ కస్టమర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో సెబీ రిజిస్టర్డ్ ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ నిపుణుడు జితేంద్ర సోలంకి వివరించారు. వాణిజ్య బ్యాంకులు కొత్త గృహ రుణ గ్రహీతలకు వడ్డీ రేటు ఉపశమనాన్ని ఎలా బదిలీ చేస్తాయో వివరించారు.
- కొత్తగా హోమ్ లోన్ తీసుకునేవారికి బ్యాంకులు తమ కస్టమర్లకు 25 బేసిస్ పాయింట్ల ఉపశమనం ఇస్తే 20 ఏళ్ల కాలపరిమితి గల గృహ రుణంపై నెలవారీ ఈఎంఐ 1.80 శాతం తగ్గుతుందని సోలంకి చెప్పారు.
- అయితే చరిత్రను పరిశీలిస్తే బ్యాంకులు తమ ఖాతాదారులకు 10 నుంచి 15 బేసిస్ పాయింట్ల వడ్డీరేట్ల ఉపశమనం మాత్రమే కల్పించే అవకాశం ఉంది. ఒక బ్యాంకు కొత్త గృహ రుణ గ్రహీతకు 15 బీపీఎస్ వడ్డీ రేటు ఉపశమనాన్ని బదిలీ చేస్తే, ఇరవై సంవత్సరాల కాలపరిమితికి నెలవారీ గృహ రుణ ఈఎంఐ 1.25 శాతానికి తగ్గుతుంది" అని సోలంకీ వివరించారు.
ఇప్పటికే ఉన్న గృహ రుణ చెల్లింపుదారులకు..
- ఆర్బీఐ 25 బేసిస్ పాయింట్ల వడ్డీ రేటు తగ్గింపును బ్యాంకులు తమ కస్టమర్లకు బదిలీ చేస్తే.. ప్రస్తుత హోమ్ లోన్ ఈఎంఐ చెల్లింపుదారులు తమ నెలవారీ ఈఎంఐని తగ్గించుకోవచ్చు. లేదా వారు తమ గృహ రుణాన్ని చెల్లించాల్సిన కాలపరిమితిని తగ్గించుకోవచ్చు.
- ఇప్పటికే హోమ్ లోన్ ఈఎంఐ చెల్లిస్తున్నందున, ఆ మొత్తాన్ని చెల్లించడం పెద్ద సవాలేమీ కాదు. కాబట్టి, హోమ్ లోన్ కాలపరిమితిని తగ్గించుకోవడం ఉత్తమ పద్ధతి. గృహ రుణ చెల్లింపుదారుడు గృహ రుణ కాలపరిమితిని తగ్గించాలని ఎంచుకుంటే, రూ .20 లక్షల ఇరవై సంవత్సరాల (240 నెలలు) గృహ రుణం 25 బీపీఎస్ ల గృహ రుణ వడ్డీ రేటు తగ్గింపు పొందిన తర్వాత.. వారి రుణ చెల్లింపు కాలపరిమితి 230 నెలలకు తగ్గుతుంది’’ అని ఆప్టిమా మనీ మేనేజర్స్ ఎండి & సిఇఒ పంకజ్ మత్పాల్ చెప్పారు. అంటే, వారికి సుమారు 10 నెలల ఈఎంఐ ఆదా అవుతుంది.
టాపిక్