హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 25 శాతం డౌన్.. మిగిలిన నగరాల్లో ఇలా-housing sales dip by 9 percent hyderabad sees maximum decline propequity report ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 25 శాతం డౌన్.. మిగిలిన నగరాల్లో ఇలా

హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 25 శాతం డౌన్.. మిగిలిన నగరాల్లో ఇలా

HT Telugu Desk HT Telugu
Jan 22, 2025 04:53 PM IST

Housing sales dip: గృహ విక్రయాలు 2024లో 5 లక్షల యూనిట్ల నుంచి 4.70 లక్షల యూనిట్లకు పడిపోయాయి. హైదరాబాద్‌లో అత్యధిక క్షీణత కనిపించింది. ఢిల్లీ-ఎన్సీఆర్, నవీ ముంబై నగరాల్లో మాత్రమే అమ్మకాలు పెరిగాయి.

తగ్గిన గృహ విక్రయాలు
తగ్గిన గృహ విక్రయాలు (Pixabay)

టాప్ 9 నగరాల్లో హౌసింగ్ సేల్స్ 9 శాతం క్షీణించి 4.7 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు, రుతుపవనాల కారణంగా కార్యకలాపాలు రెండొంతులు తగ్గడంతో 2024లో కొత్త సరఫరా 15 శాతం క్షీణించి 4.11 లక్షల యూనిట్లకు పడిపోయిందని ఎన్ఎస్ఈ లిస్టెడ్ రియల్ ఎస్టేట్ డేటా అనలిటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ నివేదిక తెలిపింది.

yearly horoscope entry point

2023లో విక్రయించిన యూనిట్ల సంఖ్య 5.14 లక్షలు కాగా, 2023లో లాంచ్ చేసిన యూనిట్ల సంఖ్య 4.81 లక్షలుగా ఉంది.

2024 లో 9 నగరాలలో రెండు నగరాల్లో మాత్రమే గృహాల అమ్మకాలు పెరిగాయి. నవీ ముంబై అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. కాగా హైదరాబాద్ అత్యధిక క్షీణతను నమోదు చేసింది.

2024లో నవీ ముంబైలో గృహ విక్రయాలు 16 శాతం పెరిగి 33,870 యూనిట్లకు చేరుకున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్‌లో గృహ విక్రయాలు 2024లో 5 శాతం పెరిగి 43,923 యూనిట్లకు చేరుకున్నాయి.

బెంగళూరులో గృహ విక్రయాలు 9 శాతం క్షీణించి 60,506 యూనిట్లకు పరిమితమయ్యాయి. చెన్నైలో గృహ విక్రయాలు 11 శాతం క్షీణించి 19,212 యూనిట్లకు, హైదరాబాద్ లో 25 శాతం క్షీణించి 61,722 యూనిట్లకు పరిమితమయ్యాయి.

ముంబైలో 6% తగ్గి 50,140 యూనిట్లకు, పూణేలో 13% తగ్గి 92,643 యూనిట్లకు, థానేలో 5% తగ్గి 90,288 యూనిట్లకు చేరుకున్నాయి. కోల్‌కతాలో గృహ అమ్మకాలు 2024 లో 1% తగ్గి 18,595 యూనిట్లకు చేరుకున్నాయి.

కొత్త ప్రాజెక్టులు

తొమ్మిది నగరాలకు గాను 4 నగరాల్లో కొత్త సరఫరా పెరిగింది. ఢిల్లీ-ఎన్‌సిఆర్ అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. హైదరాబాద్ అత్యధిక క్షీణతను నమోదు చేసింది.

2023 పీక్ ఇయర్ కావడంతో 2024లో హౌసింగ్ సప్లై, సేల్స్ తగ్గడానికి బేస్ ఎఫెక్ట్ కారణం. అయితే 2024 లో సరఫరా-డిమాండ్ నిష్పత్తి 2023లో మాదిరిగానే ఉంది. ఇది స్థిరాస్తి రంగం మౌలికాంశాలు బలంగా, ఆరోగ్యంగా ఉన్నాయని సూచిస్తుంది " అని ప్రాప్ ఈక్విటీ సీఈవో, వ్యవస్థాపకుడు సమీర్ జసుజా అన్నారు.

ఈ ఏడాది సరఫరా, అమ్మకాల పరంగా హైదరాబాద్ అత్యల్ప పనితీరు కనబరిచిందన్నారు. ఎన్సీఆర్‌లోని నగరాలు ఈ ఏడాదిలో కొత్త సరఫరా, అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధించాయని తెలిపారు. బలహీనమైన డిమాండ్ డెవలపర్లను కొత్త ప్రాజెక్టులకు నెమ్మదిగా వెళ్లడానికి ప్రేరేపించి ఉండవచ్చనని తెలిపారు.

ఢిల్లీ-ఎన్సీఆర్‌లో కొత్త సరఫరా 2024 లో 54% పెరిగి 45503 యూనిట్లకు, బెంగళూరులో సరఫరా 27% పెరిగి 72,111 యూనిట్లకు, చెన్నైలో 6% పెరిగి 20,522 యూనిట్లకు, ముంబై 4% పెరిగి 40,963 యూనిట్లకు చేరుకున్నాయి.

హైదరాబాద్ (49%), కోల్‌కతా (28%), నవీ ముంబై (10%), పూణే (27%), థానే (25%) నగరాలలో కొత్త సరఫరా పడిపోయింది.

Whats_app_banner

సంబంధిత కథనం