Honor 200 5G Discount : సెల్ఫీలకు బెస్ట్ హానర్ 200 5జీ.. ఈ ఫోన్‌పై 40 శాతం వరకు డిస్కౌంట్
Honor 200 5G Discount : కొత్తగా ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. హానర్ 200 5జీ ఫోన్ మీద పెద్ద మెుత్తంలో డిస్కౌంట్ లభిస్తుంది. తక్కువ ధరలోనే దీనిని సొంతం చేసుకోవచ్చు.
బెస్ట్ సెల్ఫీ కెమెరా ఉన్న ఫోన్ కొనాలనుకుంటే హానర్ మొబైల్ చాలా తక్కువ ధరకే దొరుకుతుంది. అమెజాన్‌లో 40 శాతం తగ్గింపుతో లభిస్తుంది. బ్యాంకు కార్డులపై 2,000 అదనపు తగ్గింపులను కూడా పొందవచ్చు. హానర్ 200 మొబైల్ గతేడాది జూలైలో విడుదలైంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్ 6.7 డిస్‌ప్లేను కలిగి ఉంది.
హానర్ 200 5జీ ఫీచర్లు
హానర్ 200 5జీ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల 1.5K కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1200 x 2664 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఫింగర్‌ప్రింట్ డిస్‌ప్లే కూడా ఉంది. బయోమెట్రిక్స్ కోసం స్కానర్ కూడా ఉంది.
హానర్ 200 మొబైల్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ఆక్టాకోర్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఈ ప్రాసెసర్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్స్‌పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం ఇది అడ్రెనో 720 జీపీయూని కూడా కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా మ్యాజిక్ ఓఎస్ 8.0తో రన్ అవుతుంది. ఇది 8జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్టోరేజ్‌తో వస్తుంది.
అద్భుతమైన కెమెరా
హానర్ 200 5జీ ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్‌లో ఓఐఎస్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ప్లస్ 50 ఎంపీ కెమెరా, 12-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 5200mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీ 100W ఫాస్ట్ ఛార్జింగ్, 100W ఫాస్ట్ వైర్డు ఛార్జింగ్ సౌకర్యంతో అందిస్తారు.
ధరలు
హానర్ 200 5జీ మొబైల్ 8జీబీ ప్లస్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 39,999కి విడుదల చేశారు. ప్రస్తుతం అమెజాన్‌లో 40 శాతం డిస్కౌంట్‌తో వస్తుంది. అంటే 23,998కి కొనుగోలు చేయవచ్చు. అమెజాన్‌లో రూ.2,000 తగ్గింపు కూపన్‌ను కూడా అందిస్తోంది.