58 లక్షలకుపైగా టూ వీలర్స్ అమ్మకాలతో హోండా రికార్డు.. 32 శాతం పెరుగుదల!
HMSI Sales 2024 : హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) 2024 లో రికార్డు అమ్మకాలను సాధించింది. హోండా మొత్తం 58 లక్షలకుపైగా యూనిట్ల అమ్మకాలను సాధించింది.
హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) 2024లో మొత్తం 58,01,498 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. కంపెనీ దేశీయ అమ్మకాలు 52,92,976 యూనిట్లు, ఎగుమతులు 5,08,522 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సంఖ్య 2023తో పోలిస్తే 32.08 శాతం పెరుగుదలను చూపిస్తుంది. ఇది భారతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో హోండాకు పెరుగుతున్న ఆదరణను చెబుతుంది.
2024 డిసెంబర్‌లో హోండా మొత్తం 3,08,083 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. దేశీయ మార్కెట్లో 2,70,919 యూనిట్లు అమ్ముడయ్యాయి. అదే సమయంలో ఎగుమతులు 37,164 యూనిట్లుగా ఉన్నాయి. 2023 డిసెంబర్‌తో పోలిస్తే అమ్మకాలు 2.85 శాతం తగ్గి 9,040 యూనిట్లు తగ్గాయి. అదే సమయంలో 2024 నవంబర్‌తో పోలిస్తే అమ్మకాలు 34.83 శాతం క్షీణించాయి. కానీ ఏడాదిలో చూసుకుంటే మాత్రం మంచి అమ్మకాలు ఉన్నాయి.
అయితే హోండా 2024 క్యూ4 లో 13,78,543 యూనిట్లను విక్రయించింది. ఇది సంవత్సరానికి 9.59 శాతం వృద్ధి. దేశీయంగా 12,56,927 యూనిట్లు (మొత్తం అమ్మకాల్లో 91.18 శాతం) అమ్మకాలు జరిగాయి. కంపెనీ ఎగుమతులు 1,21,616 యూనిట్లు (37.68 శాతం) గా ఉన్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకీ హోండా కంపెనీ ప్రవేశించింది. ఇందులో యాక్టివా ఇ, క్యూసి 1 ఉన్నాయి. యాక్టివా ఇ, క్యూసి 1 ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్స్ 2025 జనవరి 1 నుండి ప్రారంభమయ్యాయి. 2025 ఫిబ్రవరి నుంచి డెలివరీ చేయనున్నారు. వీటి ధరలను ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో ప్రకటించనున్నారు.
హోండాకు 2024 గొప్ప సంవత్సరం అని చెప్పాలి. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో హోండాకు బలమైన ఉనికిని చూపిస్తుంది. భారత ద్విచక్ర వాహన మార్కెట్లో హోండా ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం కూడా హోండాకు కలిసి వచ్చింది. ఉత్పత్తిని పెంచుతూ గుజరాత్‌లోని విఠలాపూర్, అదనంగా, గురుగ్రామ్‌లోని మానేసర్‌లో కొత్త ఇంజన్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేశారు.
మరోవైపు యాక్టివా 125, ఎస్పీ125 , ఎస్పీ160, యునికార్న్ వంటి అప్‌డేట్ చేసిన మోడల్‌లలో ఇంధన సామర్థ్యం, ఉద్గార నియంత్రణను మెరుగుపరిచే అధునాతన ఫీచర్‌లు ఉన్నాయి. ఈ అప్‌డేట్స్ కూడా హోండాకు కలిసి వచ్చాయి.