Honda Shine 100 vs Bajaj CT 110X: షైన్ 100 బైక్‍ను హోండా మోటార్ సైకిల్స్, స్కూటర్స్ ఇండియా సంస్థ ఇటీవల లాంచ్ చేసింది. తన చౌకైన బైక్‍గా తీసుకొచ్చింది. ఎంతో పాపులర్‌గా ఉన్న బజాజ్ సీటీ 110ఎక్స్ బైక్‍కు ఈ హోండా షైన్ 100 పోటీదారుగా కనిపిస్తోంది. ఈ రెండు బైక్‍ల ధర కూడా దాదాపు ఒకే రేంజ్‍లో ఉంది. అందుకే, రెండు బైక్‍లను వివిధ అంశాలపరంగా పోల్చి చేస్తూ ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకోండి.
హోండా షైన్ 100 లుక్ మిగతా 100cc బైక్స్‌లా సాధారణంగా అనిపిస్తుంది. డిజైన్‍లో పెద్దగా స్పెషాలిటీ ఉండదు. ఎల్ఈడీ లైట్లతో వచ్చింది. అలాయ్ వీల్స్ ఉన్నాయి. మరోవైపు, బజాజ్ సీటీ 110ఎక్స్ రగెడ్ లుకింగ్ డిజైన్‍తో కాస్త డిఫరెంట్‍గా ఉంది. ట్యాంక్ గ్రిప్, అలాయ్ వీల్స్, స్టిచ్డ్ సీట్స్, బ్లాక్ వైసర్‌ను కలిగి ఉంది. లుక్ పరంగా సీటీ110ఎక్స్ కాస్త విభిన్నంగా కనిపిస్తుంది.
Honda Shine 100 vs Bajaj CT 110X: హోండా షైన్ 100 బైక్ 99.7 cc ఇంజిన్‍ను కలిగి ఉంది. 7.6 hp పవర్, 8.05 Nm పీక్ టార్క్యూను ఈ ఇంజిన్ ప్రొడ్యూజ్ చేస్తుంది. ఇక బజాజ్ సీటీ 100ఎక్స్ బైక్‍కు 115.45 cc ఇంజిన్ ఉంటుంది. 8.48 హెచ్‍పీ పవర్, 9.81 Nm పీక్ టార్క్యూను జనరేట్ చేయగలదు. రెండు బైక్‍లు 4-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తున్నాయి.
ఫ్రంట్‍లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లతో హోండా షైన్ 100 వచ్చింది. డైమండ్ టైప్ ఫ్రేమ్ ఉంటుంది. బజాజ్ సీటీ 100ఎక్స్ బైక్ లోయర్ క్రాడిల్ ఫ్రేమ్‍ను కలిగి ఉంది. సస్పెన్షన్ కోసం ఫ్రంట్‍లో టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక స్ప్రింగ్-ఇన్-స్ప్రింగ్ షాక్ అబ్జారర్లు ఉంటాయి. ఇక రెండు ఈ బైక్‍లు డ్రమ్ బ్రేక్‍లనే కలిగి ఉన్నాయి.
హోండా షైన్ 100 ధర రూ.64,900గా ఉంది. బజాజ్ సీటీ 110ఎక్స్ బైక్ ధర రూ.67,706గా ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. సీటీ 110ఎక్స్ బైక్ కాస్త ధర ఎక్కువగా కనిపించినా.. షైన్ 110తో పోలిస్తే డిఫరెంట్ డిజైన్, పవర్‌ఫుల్ ఇంజిన్‍ను కలిగి ఉంది. రెండింట్లో సీటీ 110ఎక్స్ బైక్‍కు ఎక్కువ మార్కులు పడతాయి. కాగా, 100 cc పోటీ పరంగా చూస్తే ఈ రేంజ్‍లో హోండా షైన్ 100 కూడా మంచి ఆప్షనే.
సంబంధిత కథనం