Honda Shine Bike : మిడిల్ క్లాస్ వాళ్లకు నచ్చే బైక్.. ఫుల్‌ట్యాంక్‌తో 585 కిలోమీటర్లు, ధర కూడా బడ్జెట్‌లోనే!
Honda Shine 100 Bike : మిడిల్ క్లాస్ వాళ్లు ఎక్కువగా ఇష్టపడే బైకులలో హోండా షైన్ మెుదటి వరుసలో ఉంటుంది. ఎందుకంటే ఈ బైక్ బడ్జెట్ ధరతో వస్తుంది. మంచి మైలేజీ ఇస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు చూద్దాం..
భారతదేశంలో టూ వీలర్ మార్కెట్‌కు మంచి మార్కెట్ ఉంది. కొత్త కొత్త బైకులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. అయితే కొన్ని మోడల్స్ అప్‌డేట్ అయి మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. దేశంలో ఎక్కువగా అమ్ముడయ్యే బైకులలో హోండా షైన్ ఒకటి. దేశంలో 125సీసీ బైక్ సెగ్మెంట్లో హోండా షైన్ ఎక్కువగా కొంటారు. ఈ పేరుతో హోండా షైన్ 100ని కూడా మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ బైక్ తక్కువ ధర, సింపుల్ డిజైన్, మంచి మైలేజీతో బాగా అమ్మకాలు చేస్తోంది. రోజువారీ వినియోగం ఇది బెటర్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ బైక్‌లో 9 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఉంది. ఫుల్ ట్యాంక్ చేస్తే చాలా దూరం ప్రయాణించవచ్చు.
మంచి మైలేజీ
హోండా షైన్ 100లో 98.98సీసీ 4 స్ట్రోక్, ఎస్ఐ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 7.28 బిహెచ్‌పీ పవర్, 8.05 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇంజిన్ మంచి మైలేజీని అందిస్తుంది. ఈ బైక్ ఒక లీటర్‌లో 65 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ బైక్‌లో 9 లీటర్ల ఫుల్ ట్యాంక్ చేస్తే.. మొత్తం 585 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
బడ్జెట్ ధరలోనే
హోండా షైన్ 100 ఎక్స్ షోరూమ్ ధర హైదరాబాద్‌లో రూ.68,600 నుంచి ప్రారంభం అవుతుంది. షైన్ 100 డిజైన్ చాలా బాగుంటుంది. ఫ్యామిలీకి సూట్ అవుతుంది. ఎవరైనా ర్యాపిడో, జోమాటోలాంటి వాటిలో పని చేసేవారికి కూడా మైలేజీ పరంగా బెస్ట్ అని చెప్పవచ్చు. ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో 99 కిలోల బరువున్న ఏకైక బైక్ ఇదే. స్ప్లెండర్ ప్లస్ 112 కిలోల బరువు ఉంటుంది. ట్రాఫిక్‌లో కూడా షైన్‌ను సులభంగా రైడ్ చేయవచ్చు.
మిడిల్ క్లాస్ వాళ్లకి బెస్ట్
రోజూవారీ అవసరాలకు కచ్చితంగా బైక్ ఎక్కువగా ఉపయోగించేవారికి హోండా షైన్ 100 బెస్ట్. ఈ బైక్ ఎలాంటి రోడ్లపైన అయినా స్మూత్‌గా వెళ్తుంది. రోజూ ఆఫీస్ వెళ్లేవారు ఈ బైక్ ను వాడితే మైలేజీపరంగా కలిసి వస్తుంది. మీరు పెట్టిన డబ్బుకు తగ్గట్టుగా ఉపయోగపడుతుంది. మిడిల్ క్లాస్ వాళ్లు ఎక్కువగా చూసేది బడ్జెట్, మైలేజీ కాబట్టి.. హోండా షైన్ 100 గురించి ఆలోచించవచ్చు.