Honda Elevate : బెస్ట్ సెల్లింగ్ హోండా ఎలివేట్‌లో రెండు బ్లాక్ ఎడిషన్స్ లాంచ్- ఓ లుక్కేయండి..
Honda Elevate Black Edition : హోండా ఎలివేట్ ఎస్‌యూవీకి బ్లాక్ ఎడిషన్, సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్స్‌ని సంస్థ తాజాగా లాంచ్ చేసింది. వీటిలో కనిపించే మార్పులు, ధరలతో పాటు పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
ఇటీవలి కాలంలో బెస్ట్ సెల్లింగ్ వాహనాలకు బ్లాక్ థీమ్ ఎడిషన్స్‌ని ఆటోమొబైల్ సంస్థలు లాంచ్ చేస్తున్న విషయం తెలిసిందే! తాజాగా ఈ జాబితాలోకి హోండా ఎలివేట్ కూడా చేరింది. ఎలివేట్ ఎస్‌యూవీకి సంబంధించిన బ్లాక్, సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్స్‌ని సంస్థ శుక్రవారం లాంచ్ చేసింది. సాధారణ ఎలివేట్ టాప్ ఎండ్ జెడ్ఎక్స్ ట్రిమ్ ఆధారంగా ఈ కొత్త వేరియంట్లు తయారయ్యాయి. వీటి ప్రారంభ ఎక్స్‌షోరూం ధరలు వరుసగా రూ. 15.51 లక్షలు, రూ. 16.93 లక్షలు. ఈ నేపథ్యంలో ఈ మోడల్స్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
హోండా ఎలివేట్ కొత్త ఎడిషన్స్: ఎక్స్టీరియర్, ఇంటీరియర్ డిజైన్ మార్పులు..
హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్, సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ స్టాండర్డ్ వేరియంట్లకు భిన్నంగా కాస్మెటిక్ అప్డేట్లతో వస్తాయి. అత్యంత గుర్తించదగిన మార్పు.. కొత్త ఆల్-బ్లాక్ ఎక్స్టీరియర్ కలర్ స్కీమ్. ఎలివేట్ ఎస్‌యూవీలో బ్లాక్ అలాయ్ వీల్స్, నట్స్, ముందు- వెనుక స్కిడ్ ప్లేట్లు, డోర్, రూఫ్ రైల్స్ వంటి డిజైన్ అప్డేట్స్ ఉన్నాయి. బ్లాక్ ఎడిషన్, సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ రెండూ వెనుక లేదా ముందు భాగంలో లోగోలను పొందుతాయి.
కొత్త వేరియంట్ల ఇంటీరియర్ కూడా కొత్త ఆల్-బ్లాక్ థీమ్‌ను పొందుతుంది. బ్లాక్ ఎడిషన్ బ్యాడ్జింగ్‌కు అనుబంధంగా నలుపు రంగు లెథరెట్ సీట్లు, పీవిసీలో చుట్టిన బ్లాక్ డోర్ ప్యాడ్లు, ఆర్మ్ రెస్ట్లు, ఆల్-బ్లాక్ డ్యాష్ బోర్డ్‌ని కార్ల తయారీ సంస్థ అందిస్తోంది. సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ రిథమిక్ సెవెన్ కలర్ యాంబియంట్ లైటింగ్‌ను కూడా పొందుతుంది.
హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్: ఫీచర్లు..
హోండా ఎలివేట్ ఎస్యూవీ బ్లాక్ ఎడిషన్ ఇప్పటికే అందిస్తున్నవి కాకుండా అదనంగా ఏమీ పొందదు! ఇందులో 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, 7 ఇంచ్ సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ ఛార్జర్, సన్ రూఫ్ తదితర ఫీచర్లు ఉండనున్నాయి. ఆరు ఎయిర్ బ్యాగులతో పాటు ఏడీఏఎస్ ప్యాక్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఈఎస్సీ, హిల్ హోల్డ్ అసిస్ట్ తదితర సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్: ఇంజిన్..
హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ ఇంజిన్‌లోనూ ఏమీ మారలేదు. ఈ ఎస్‌యూవీలో 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. బ్లాక్ ఎడిషన్, సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ రెండూ మాన్యువల్, సీవీటీ ట్రాన్స్మిషన్ వేరియంట్లను పొందుతాయి. ఈ ఇంజిన్ గరిష్టంగా 120బీహెచ్పీ పవర్, 145ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది.
హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్..
మాన్యువల్ వేరియంట్ ధర రూ .15.51 లక్షలు (ఎక్స్-షోరూమ్), సీవీటీ వేరియంట్ ధర రూ .16.73 లక్షలు (ఎక్స్-షోరూమ్). సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ మాన్యువల్, సివిటి వర్షెన్లలో బ్లాక్ ఎడిషన్ కంటే సుమారు రూ. 20,000 ఖరీదైనది.
ఇండియాలో హోండాకి ఉన్న ఏకైక ఎస్యూవీ ఈ హోండా ఎలివేట్. కొత్త ఎడిషన్స్తో సేల్స్‌ని పెంచుకోవచ్చని సంస్థ భావిస్తోంది.
సంబంధిత కథనం