Honda Dio 125 launch : తన లైనప్‌లోని స్కూటర్లను హెచ్- స్మార్ట్ టెక్నాలజీతో అప్డేట్ చేస్తూ వస్తోంది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా. ఇక ఇప్పుడు.. హోండా డియో 125కి ఈ అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు అప్డేటెడ్ వర్షెన్‌ను తాజాగా లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 83,400. హైలైట్స్ ఇక్కడ తెలుసుకుందాము..
సరికొత్త డియో 125 స్కూటర్ డిజైన్ పెద్దగా మారలేదు. ఇందులో ఏప్రాన్ మౌంటెడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, వైడ్ హ్యాండిల్‌బార్, యాంగ్యులర్ మిర్రర్, ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, సైడ్ ప్యానెల్లో స్పోర్టీ గ్రాఫిక్స్, సింగిల్ పీస్ స్టెప్డ్ అప్ సీట్, అప్స్వెప్ట్ ఎగ్సాస్ట్, భారీ ఎల్ఈడీ టెయిల్ల్యాంప్, స్ప్లిట్ టైప్ గ్రాబ్ రెయిల్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లాక్డ్ ఔట్ అలాయ్ వీల్స్ వంటివి వస్తున్నాయి.
ఇక ఈ హోండా స్కూటర్లో ఇంజిన్ ఆప్షన్‌ను కూడా అప్డేట్ చేశారు. గతంలో ఇందులో 110సీసీ ఇంజిన్ ఉండేది. ఇక ఇప్పుడు.. ఇందులో 123.97సీసీ, సింగిల్ సిలిండర్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటుంది. యాక్టివా 125లోనూ ఇదే ఉంటుంది. ఇది 8.2 హెచ్‌పీ పవర్‌ను, 10.3 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. సీవీటీ గేర్‌బాక్స్ ఇందులో ఉంటుంది.
Honda Dio 125 smart key : సేఫ్టీ విషయానికొస్తే.. హెచ్ స్మార్ట్ టెక్నాలజీతో వస్తున్న ఈ హోండా డియో 125 ఫ్రెంట్ వీల్‌కు డిస్క్ బ్రేక్, రేర్ వీల్‌కు డ్రమ్ బ్రేక్ వస్తున్నాయి. కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టెమ్ కూడా ఇందులో ఉంది. ఫ్రెంట్లో టెలిస్కోపిక్ ఫోర్క్స్ రేర్రో మోనో షాక్ అబ్సార్బర్ యూనిట్లతో సస్పెన్షన్స్ సెటప్ ఉంటుంది.
లేటెస్ట్ అప్డేట్లో ఈ డియో 125 స్కూటర్‌కు స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ అన్‌లాక్, స్మార్ట్ సేఫ్, స్మార్ట్ స్టార్ట్ వంటి ఫీచర్స్ వస్తున్నాయి.
హోండా డియో 125లో రెండు వేరియంట్లు ఉన్నాయి. అవి.. స్టాండర్డ్, స్మార్ట్. వీటి ఎక్స్‌షోరూం ధరలు వరుసగా రూ. 83,400- రూ. 91,300. అప్డేటెడ్ వర్షెన్‌ను ఆన్లైన్ లేదా డిలర్షిప్ షోరూమ్‌లలో బుక్ చేసుకోవచ్చు. టీవీఎస్ ఎన్‌టార్క్ 125, సుజుకీ అవెనిస్ 125, హీరో జూమ్ 110 వంటి మోడల్స్‌కు ఈ స్కూటీ గట్టిపోటనిస్తుందని మార్కెట్లో అంచనాలు ఉన్నాయి.
Honda Dio 125 price : దేశ 2 వీలర్ సెగ్మెంట్లో హోండాకు మంచి ప్రెసెన్స్ ఉంది. యాక్టివా 125కు ప్రత్యామ్నాయంగా ఉంది ఈ డియో 125. ఈ మోడల్‌కు డిమాండ్ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి కొత్త వర్షెన్ ప్రభావం ఏమేరకు ఉంటుందో చూడాలి.
సంబంధిత కథనం