బెస్ట్​ సెల్లింగ్​ హోండా సిటీ సెడాన్​లో ‘స్పోర్ట్​’ ఎడిషన్​- కొత్తగా ఏముంది? ధర ఎంత?-honda city sport edition launched with sporty upgrades see details inside ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  బెస్ట్​ సెల్లింగ్​ హోండా సిటీ సెడాన్​లో ‘స్పోర్ట్​’ ఎడిషన్​- కొత్తగా ఏముంది? ధర ఎంత?

బెస్ట్​ సెల్లింగ్​ హోండా సిటీ సెడాన్​లో ‘స్పోర్ట్​’ ఎడిషన్​- కొత్తగా ఏముంది? ధర ఎంత?

Sharath Chitturi HT Telugu

హోండా సిటీ స్పోర్ట్​ ఎడిషన్​ని సంస్థ తాజాగా లాంచ్​ చేసింది. ఇదొక లిమిటెడ్​ ఎడిషన్​ మోడల్​. ఈ సెడాన్​ ధర, ఫీచర్లు, ఎక్స్​టీరియర్​- ఇంటీరియర్​లో మార్పులు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

హోండా సిటీ స్పోర్ట్​ ఎడిషన్​..

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ సెడాన్​గా పేరు తెచ్చుకున్న హోండా సిటీలో సరికొత్త ఎడిషన్​ని తీసుకొచ్చింది హోండా సంస్థ. దీని పేరు హోండా సిటీ స్పోర్ట్​. ఈ కొత్త హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్ ధర రూ. 14.89 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద ప్రారంభమవుతుంది. ఈ సెడాన్​ ఎక్స్​టీరియర్​, ఇంటీరియర్​లో​ బ్లాక్-ఔట్ చేసిన భాగాలు ఉన్నాయి. ఇవి దీనికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తాయి. కొత్త సిటీ స్పోర్ట్ ఎడిషన్ పరిమిత సంఖ్యలో మాత్రమే లభిస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఈ మోడల్​ ఈ విభాగంలో వోక్స్‌వ్యాగన్ విర్టస్, స్కోడా స్లావియా, హ్యుందాయ్ వెర్నాలకు గట్టి పోటీ ఇవ్వనుంది. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్: కొత్తగా ఏముంది?

హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్ సెడాన్ బాహ్య రూపాన్ని కొత్త అప్‌గ్రేడ్‌లతో మెరుగుపరుస్తుంది. క్రోమ్ గ్రిల్​కి, రేర్​ స్పాయిలర్​కి బ్లాక్​ ఫినిషింగ్​ వచ్చింది. ఓఆర్​వీఎంలు(అవుట్‌సైడ్ రే వ్యూ మిర్రర్స్) క్రిస్టల్ బ్లాక్ ఫినిష్‌ని పొందుతాయి. మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ మెటాలిక్ గ్రే రంగులో ఉంటాయి. షార్క్-ఫిన్ యాంటెన్నా కూడా గ్లాస్-బ్లాక్ రంగులో ఉంటుంది. సెడాన్ డిక్కీపై ‘స్పోర్ట్​’ లోగో ఉంటుంది.

క్యాబిన్‌లో ఆల్-బ్లాక్ ఇంటీరియర్ ఉంటుంది. డాష్‌బోర్డ్‌పై ఎరుపు రంగు గార్నిష్ ఉంటుంది. సీట్లు నలుపు లెథరెట్‌లో కాంట్రాస్ట్ ఎరుపు స్టిచింగ్​తో ఉంటాయి. అలాగే కొత్త సాఫ్ట్-టచ్ డోర్ ఇన్‌సర్ట్‌లు ఉంటాయి. ఏసీ వెంట్‌లు, స్టీరింగ్ వీల్ కూడా నలుపు రంగులో ఉంటాయి. స్టీరింగ్ వీల్‌కు రెడ్​ స్టిచింగ్​ ఉంటుంది.

హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్: స్పెసిఫికేషన్లు..

హోండా సిటీ స్పోర్ట్ ఎడిషన్‌కు 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ పవర్​నిస్తుంది. ఇది 119 బీహెచ్‌పీ పవర్​ని, 145 ఎన్‌ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ సెడాన్​ ప్రత్యేకంగా 7-స్పీడ్ సీవీటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది. సిటీ ఆటోమేటిక్ వెర్షన్‌లో 18.40 కేఎంపీఎల్​ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని ఆటోమేకర్ పేర్కొంది.

ఫీచర్ల పరంగా, సిటీ స్పోర్ట్ ఎడిషన్​లో యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8-ఇంచ్​ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వాయిస్ కమాండ్, ఫోర్-స్పీకర్ సౌండ్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఎంఐడీ యూనిట్‌తో కూడిన డ్యూయల్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, లెవెల్ 2 అడాస్​ సహా మరెన్నో ఉన్నాయి.

హోండా సిటీ స్పోర్ట్​ : రంగులు- లభ్యత..

హోండా సిటీ స్పోర్ట్ ప్లాటినం వైట్ పర్ల్, రేడియంట్ రెడ్ మెటాలిక్, మెటియోరాయిడ్ గ్రే మెటాలిక్ అనే మూడు రంగులలో లభిస్తుంది. ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ ఆఫర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న హోండా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం