హోండా సిటీ హైబ్రిడ్ (e:HEV) మోడల్ ఇయర్ 2024, మోడల్ ఇయర్ 2025 వెర్షన్‌లపై రూ. 90,000 వరకు నగదు తగ్గింపు అందిస్తున్నారు. అదే సమయంలో పెట్రోల్ వేరియంట్లపై(SV, V, XZ, ZX) రూ. 73,000 వరకు తగ్గింపు దొరుకుతుంది. అయితే హోండా సిటీపై ఆఫర్లు స్టాక్ లభ్యత, నగరాలు, డీలర్‌షిప్‌లను బట్టి మారవచ్చు. మరిన్ని వివరాల కోసం కస్టమర్లు సమీపంలోని హోండా షోరూమ్‌ను సంప్రదించాలి.
దేశీయ మార్కెట్లో హోండా సిటీ సెడాన్ నాన్-హైబ్రిడ్ మోడల్ ధర రూ. 12.28 లక్షల నుండి రూ. 16.55 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరను కలిగి ఉంది. కాగా సిటీ హైబ్రిడ్ ధర రూ. 19 లక్షల నుండి రూ. 20.75 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్ ధరతో లభిస్తుంది.
హోండా సిటీ నాన్-హైబ్రిడ్ మోడల్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను పొందుతుంది. మీరు దీన్ని 6-స్పీడ్ మాన్యువల్, సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు లీటరుకు 17.8 నుండి 18.4 కి.మీ మైలేజీని ఇస్తుంది. అదే సమయంలో హోండా సిటీ హైబ్రిడ్‌లో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు అధిక సామర్థ్యం గల ఎలక్ట్రిక్ హైబ్రిడ్ మోటార్లు ఉపయోగిస్తుంది. ఇది స్మార్ట్ హైబ్రిడ్ మోడల్. ఈ కారు ఒక లీటరు ఇంధనంతో 26.5కేఎంపీఎల్ వరకు నడపగలదని హోండా పేర్కొంది.
హోండా సిటీ 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, సింగిల్-పేన్ సన్‌రూఫ్, యాంబియంట్ లైటింగ్, కనెక్ట్ చేసిన కార్ టెక్నాలజీ, వెనుక ఏసీ వెంట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి లక్షణాలను అందిస్తుంది.
ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్(ADAS) సేఫ్టీ సూట్ అందుబాటులో ఉన్నాయి. దీని కింద ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హై బీమ్ అసిస్ట్, లేన్ కీప్ అసిస్ట్ వంటి ఫీచర్లు అందిస్తారు.
సంబంధిత కథనం