హోండా కంపెనీకి భారత మార్కెట్‌లో మంచి పేరు ఉంది. హోండా అమేజ్ న్యూ జనరేషన్ కారు ధర త్వరలో పెరగనుంది. మూడో తరం అమేజ్ ప్రారంభ ధరను 2025 జనవరి 31 వరకు కొనసాగించనున్నట్టుగా హోండా ప్రకటించింది. అంటే కస్టమర్లు ఈ కొత్త కారును 31 జనవరి 2025 వరకు చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత కంపెనీ దాని ధరను పెంచవచ్చు. ఈ మోడల్ 2024 డిసెంబర్ 4 న భారతదేశంలో లాంచ్ అయింది. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.
మూడో తరం హోండా అమేజ్‌లో అనేక ముఖ్యమైన మార్పులు చేశారు. దీని కొత్త ఎక్ట్సీరియర్లు, అప్‌గ్రేడ్ సిన ఇంటీరియర్స్ మునుపటి కంటే మరింత స్టైలిష్‌గా, కర్షణీయంగా మార్చాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ మోడల్ కు లెవల్ 2 ఏడీఏఎస్(అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్) ఇచ్చారు. ఇది ఇప్పటివరకు టాప్-స్పెక్ జెడ్ఎక్స్ వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉంది. ఏడీఏఎస్ వంటి ఫీచర్ ఈ సెగ్మెంట్‌లో కారును మరింత ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది.
హోండా అమేజ్ ఈ కొత్త మోడల్ వినియోగదారులకు మూడు వేరియంట్లు, 6 కలర్ ఆప్షన్లలో అందిస్తుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో దొరుకుతుంది. ఎకానమీ, పవర్ గొప్ప కలయికను అందిస్తుంది. ఈ సెగ్మెంట్‌లోని ఇతర కార్ల విషయానికొస్తే హోండా అమేజ్ మారుతి డిజైర్, హ్యుందాయ్ ఆరా, మారుతి బాలెనో, టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ ఐ20 వంటి కార్లతో పోటీ పడుతోంది.
హోండా కార్స్ ఇండియా మార్కెటింగ్ అండ్ సేల్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహ్ల్ మాట్లాడుతూ.. 'మూడో తరం హోండా అమేజ్ కు వినియోగదారుల నుండి మంచి స్పందన లభించింది. దీని స్టైలిష్ డిజైన్, ప్రీమియం అప్పీల్, సెగ్మెంట్ ఫస్ట్ ఏడీఏఎస్ ఫీచర్‌ను కస్టమర్లు మెచ్చుకున్నారు. కొత్త అమేజ్ ప్రారంభ ధరలను జనవరి 31, 2025 వరకు పొడిగించడం మాకు సంతోషంగా ఉంది. వినియోగదారులు ఈ గొప్ప కారును సొంతం చేసుకోవచ్చు.'అని తెలిపారు.
హోండా అమేజ్ ధర రూ .7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. మెరుగైన ఫీచర్లు, గొప్ప డిజైన్, ఆకర్షణీయమైన ధరతో ఈ కారు గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు ఈ కారు కొనాలని ఆలోచిస్తుంటే జనవరి 31 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. తర్వాత ధర పెరగవచ్చు.