Honda Activa : డైలీ వాడకానికి హోండా యాక్టివా బెస్ట్.. పెట్రోల్ వేరియంట్లతోపాటు ఈవీ గురించి వివరాలు
Honda Activa : భారతదేశంలో హోండా యాక్టివా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ స్కూటర్‌కు మంచి డిమాండ్ ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా వచ్చింది. ఈ స్కూటీకి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

ఇప్పుడు టూ వీలర్స్ తప్పనిసరి అయిపోయాయి. అయితే కొందరు బైకులు తీసుకుంటే.. మరికొందరు స్కూటర్ వైపు మెుగ్గుచూపుతారు. ఇంట్లో మహిళలకు కూడా ఉపయోగపడే ఆలోచనలో చాలా మంది స్కూటర్లను కొనుగోలు చేసేందుకు కూడా ఇష్టపడుతుంటారు. స్కూటీ అనగానే ఇండియాలో మెుదటగా గుర్తొచ్చేది హోండా యాక్టివా. దీనికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఎక్కువగా అమ్ముడవుతోంది. హోండా యాక్టివా అనేక రూపాల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. మంచి డిజైన్, ఫీచర్లతో వస్తుంది. ఈ స్కూటీ గురించి వివరాలు తెలుసుకుందాం.. మెుదటగా ఈవీ గురించి చూద్దాం..
హోండా యాక్టివా ఇ
ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్. రూ. 1.17 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు కొనుగోలుకు అందుబాటులో ఉంది. దీనికి 1.5 kWh 2 బ్యాటరీ ప్యాక్ ఎంపిక ఉంది. ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 102 కి.మీ వరకు రేంజ్ (మైలేజ్) అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కి.మీ. ఇది పెర్ల్ సెరినిటీ బ్లూ, పెర్ల్ మిస్టీ వైట్ అండ్ మ్యాట్ ఫాగీ సిల్వర్ మెటాలిక్ వంటి వివిధ ఆకర్షణీయమైన కలర్స్‌లో దొరుకుతుంది. ఇందులో టీఎఫ్‌టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో సహా అనేక ఫీచర్లు ఉన్నాయి.
హోండా యాక్టివా 125
ఇది పవర్‌ఫుల్ స్కూటర్. రూ. 94,442 నుండి రూ. 97,146 (ఎక్స్-షోరూమ్) ధరల శ్రేణిలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఈ స్కూటర్ 123.92 సిసి పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. 47 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. ఈ యాక్టివా 125 స్కూటర్ టీఎఫ్‌టీ కన్సోల్, టర్న్-బై-టర్న్ నావిగేషన్‌తోపాటుగా మరిన్ని ఫీచర్లతో వస్తుంది. దీనికి ముందు డిస్క్, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. దీనికి దాదాపు 5.3 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంక్ ఉంది.
హోండా యాక్టివా 110
ఈ స్కూటర్ ధర రూ. 80,950 (ఎక్స్-షోరూమ్)లో కూడా దొరుకుతుంది. దీనికి 109.51 సిసి పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఉంది. ఇది 7.9 పీఎస్ హార్స్‌పవర్, 9.05 ఎన్ఎం పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 45 నుండి 50 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఈ యాక్టివా 110 స్కూటర్ టీఎఫ్‌టీ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ (4.2-అంగుళాలు)తోపాటుగా వివిధ ఫీచర్లతో వస్తుంది. సేఫ్టీ కోసం దీనికి ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి.