Family electric scooter : ఈ 2 ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్స్​లో ఏది బెస్ట్​? రేంజ్​తో పాటు ఇతర వివరాలు..-honda activa e vs ather rizta which family electric scooter is best to buy see details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Family Electric Scooter : ఈ 2 ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్స్​లో ఏది బెస్ట్​? రేంజ్​తో పాటు ఇతర వివరాలు..

Family electric scooter : ఈ 2 ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్స్​లో ఏది బెస్ట్​? రేంజ్​తో పాటు ఇతర వివరాలు..

Sharath Chitturi HT Telugu
Dec 07, 2024 06:00 AM IST

Best Family electric scooter : హోండా యాక్టివా ఈ వర్సెస్​ ఏథర్​ రిజ్టా.. ఈ రెండు ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్స్​లో ఏది బెస్ట్​? దేని రేంజ్​ ఎక్కువ? పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఈ 2 ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్స్​లో ఏది బెస్ట్​?
ఈ 2 ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్స్​లో ఏది బెస్ట్​?

మచ్​ అవైటెడ్​ హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఇటీవలే భారతీయుల ముందుకు వచ్చింది! దీనిని ఒక మంచి ఫ్యామిలీ ఈ-స్కూటర్​గా సంస్థ ప్రమోట్​ చేస్తోంది. ఈ నేపథ్యంలో 'హోండా యాక్టివా ఈ'కి.. ఇప్పటికే మార్కెట్​లో అందుబాటులో ఉన్న బెస్ట్​ ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ ఏథర్​ రిజ్టాకి మంచి పోటీ కనిపిస్తుందని అంచనాలు ఉన్నాయి. మరి ఈ రెండింటిలో ఏది బెస్ట్​? దేని రేంజ్​ ఎక్కువ? వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

yearly horoscope entry point

హోండా యాక్టివా ఈ వర్సెస్ ఏథర్ రిజ్టా: స్పెసిఫికేషన్లు..

హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ 6 కిలోవాట్ల పీఎమ్ఎస్ఎమ్ మోటారు ఉంటుంది. ఇది 8 బీహెచ్​పీ పవర్​, 22 ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. ఈ బ్యాటరీ రెండు 1.5 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ల నుంచి పవర్​ని తీసుకుంటుంది. ఈ సెటప్ 102 కిలోమీటర్ల రేంజ్​ని ఇస్తుంది. ఈ- స్కూటర్ గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 7.3 సెకన్లలో ఈ యాక్టివా ఎలక్ట్రిక్​.. 0 నుంచి 60 కేఎంపీహెచ్​ స్పీడ్​ని అందుకోగలదు!

మరోవైపు, ఏథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ రెండు బ్యాటరీ ప్యాక్​ ఆప్షన్స్​తో వస్తుంది. అవి.. 2.9 కిలోవాట్, 3.7 కిలోవాట్​. అయితే యాక్టివాతో పోల్చదగిన వేరియంట్ 2.9 కిలోవాట్​ వేరియంట్ అని చెప్పుకోవాలి. 2.9 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన రిజ్టా 129 కిలోమీటర్ల రేంజ్​ని అందిస్తుంది. 5.7 బీహెచ్​పీ పవర్​ని జనరేట్​ చేస్తుంది. ఇది యాక్టివా ఈతో సమానంగా 22 ఎన్ఎమ్ టార్క్​ని జనరేట్​ చేస్తుంది. రిజ్టాలో గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు.

హోండా యాక్టివా ఈ వర్సెస్ ఏథర్ రిజ్టా: ఫీచర్లు..

హోండా యాక్టివా ఎలక్ట్రిక్​ స్కూటర్​లో 7.0 ఇంచ్​ టీఎఫ్​టీ డిస్​ప్లే విత్​ ఆటోమెటిక్​ బ్రైట్​నెస్​ ఫీచర్​ ఉంది. హ్యాండిల్ బార్​లోని టోగిల్ స్విచ్​లను ఉపయోగించి డిస్​ప్లేను ఆపరేట్ చేయవచ్చు. యాక్టివా ఈ స్మార్ట్-కీ, స్మార్ట్ అన్​లాక్, స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ సేఫ్, స్మార్ట్ స్టార్ట్ వంటి ఫంక్షన్స్​ని కూడా కలిగి ఉంది. హై-ఎండ్ వేరియంట్​లో హోండా రోడ్ సింక్ డుయో అప్లికేషన్ రియల్ టైమ్ నావిగేషన్, కనెక్టివిటీ ఆప్షనస్​ని అందిస్తుంది.

ఏథర్ రిజ్టా ఈ-స్కూటర్​లో 7.0 ఇంచ్​ డీప్ వ్యూ డిస్​ప్లే, డ్యాష్​బోర్డ్​లో వాట్సాప్ వ్యూ ఉన్నాయి. ఏథర్ రిజ్టాలో మ్యాజిక్​ట్విస్ట్​, స్కిడ్​కంట్రోల్​, ఆటోహోల్డ్, ఫాల్​సేఫ్​ వంటి రైడ్ అసిస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇది రిజ్టాకి ప్రత్యర్థులతో పోలిస్తే ఎడ్జ్​ని తీసుకొస్తుంది.

హోండా యాక్టివా ఈ వర్సెస్ ఏథర్ రిజ్టా: ధర..

జపాన్ ఆటోమోటివ్ తయారీదారు హోండా.. యాక్టివా ఈ ధరను ఇంకా వెల్లడించలేదు. జనవరి 2025లో రేట్లు అందుబాటులోకి వస్తాయి. హోండా యాక్టివా ఈ బుకింగ్స్ కూడా జనవరి 1, 2025 న ప్రారంభమవుతాయి.

ఎథర్ రిజ్టా ఫ్యామిలీ ఎలక్ట్రిక్​ స్కూటర్​ 2.9 కిలోవాట్ల ఎస్ వేరియంట్ ధర రూ .1.09 లక్షలు. జెడ్ వేరియంట్ ధర రూ .1.26 లక్షలు (రెండూ ఎక్స్-షోరూమ్ ధరలు). రిజ్టా 3.7 కిలోవాట్ల వేరియంట్ ధర రూ .1.46 లక్షలు (ఎక్స్-షోరూమ్).

Whats_app_banner

సంబంధిత కథనం