Honda 2 Wheelers offers: భారత్ లోని ప్రముఖ ద్వి చక్ర వాహన తయారీ సంస్థ హోండా తమ టూ వీలర్ వాహనాలపై ఈ దీపావళి సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఆఫర్స్ లో రూ. 5 వేల వరకు క్యాష్ బ్యాక్, జీరో డౌన్ పేమెంట్, నో కాస్ట్ ఈఎంఐ, రుణాలపై అతి తక్కువ వడ్డీ రేటు, నో హైపొథికేషన్.. మొదలైనవి ఉన్నాయి.
ఈ దీపావళి సందర్భంగా హోండా బైక్స్ లేదా స్కూటర్స్ కొనుగోలు చేసేవారికి అతి తక్కువ వడ్డీ రేటుకే వాహన రుణాలను హోండా అందిస్తోంది. ఈ వడ్డీ రేటు 6.99% అని సంస్థ ప్రకటించింది. హోండా షైన్ 100 బైక్ పై ‘‘100 పై 100’’ (100 pe 100) స్కీమ్ ను కూడా అమలు చేస్తోంది. ఈ ఆఫర్స్ పరిమిత కాలం పాటు మాత్రమే అమల్లో ఉంటాయని, అలాగే, పలు షరతులు వర్తిస్తాయని హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (Honda Motorcycle and Scooter India) సంస్థ వెల్లడించింది.
హోండా ఇటీవలే భారతీయ మార్కెట్లో CB300R OBD2-అనుకూల వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 2.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది గతంలో ఉన్న ధర కంటే రూ. 37,000 తక్కువ. ఇది బజాజ్ డామినార్ 400, TVS అపాచీ RTR 310, KTM 390 డ్యూక్, BMW G 310 R లకు పోటీగా ఉంది. CB300R బైక్ లో 286 సీసీ, సింగిల్-సిలిండర్ ఇంజన్ ను అమర్చారు. ఇది DOHC సెటప్, లిక్విడ్ కూలింగ్‌ని ఉపయోగిస్తుంది. ఇది 9,000 ఆర్పీఎం వద్ద 29.98 బీహెచ్పీ గరిష్ట శక్తిని, 7,500 ఆర్పీఎం వద్ద 27.5 ఎన్ఎం గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను విడుదల చేస్తుంది. ఈ బైక్ లో స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.
హోండా సంస్థ యాక్టివా కొత్త లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధరలు స్టాండర్డ్ వేరియంట్ కు రూ.80,734, స్మార్ట్ వేరియంట్ కు రూ.82,734 లుగా నిర్ణయించారు. రెండు కూడా ఎక్స్-షోరూమ్ ధరలు. ఈ లిమిటెడ్ ఎడిషన్ లో మెకానికల్ మార్పులేవీ చేయలేదు. కొద్దిగా కాస్మెటిక్ మార్పులు మాత్రం చేశారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ పెర్ల్ సైరన్ బ్లూ, మ్యాట్ స్టీల్ బ్లాక్ మెటాలిక్ కలర్స్ లో లభిస్తుంది.